ముంబై వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగు రోజుల ఏకైక టెస్టులో భారత మహిళల జట్టు దుమ్మురేపుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 428 పరుగుల భారీ స్కోర్ చేసింది. 410/7 ఓవర్ నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత జట్టు అదనంగా మరో 18 పరుగులు చేసి ఆలౌటైంది.
భారత బ్యాటర్లలో శుభ సతీశ్ (76 బంతుల్లో 69; 13 ఫోర్లు), జెమీమా రోడ్రిగ్స్ (99 బంతుల్లో 68; ), యస్తిక భాటియా (88 బంతుల్లో 66; 10 ఫోర్లు, 1 సిక్స్), దీప్తి శర్మ (111 బంతుల్లో 67 ; 9 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలతో చెలరేగారు. వీరితో పాటు కెప్టెన్ హర్మాన్ ప్రీత్ కౌర్(49) పరుగులతో రాణించింది.
ఇంగ్లండ్ బౌలర్లలో లారెన్ బెల్, ఎకిలిస్టోన్ తలా మూడు వికెట్లు సాధించగా.. కట్లే క్రాస్, నెట్ స్కైవర్, చార్లీ డిన్ చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఇంగ్లండ్ 10 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 42 పరుగులు చేసింది. కాగా ఇది టెస్టుల్లో భారత మహిళల జట్టుకు రెండో అత్యధిక స్కోర్ కావడం గమనార్హం.
Moment when Jemimah Rodrigues completed her maiden FIFTY 🤩🔥#CricketTwitter #INDvENG pic.twitter.com/oIahFzW157
— Female Cricket (@imfemalecricket) December 14, 2023
Comments
Please login to add a commentAdd a comment