శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్ను 3-0తో భారత మహిళల క్రికెట్ జట్టు క్లీన్ స్వీప్ చేసింది.
విశాఖపట్టణం: శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్ను 3-0తో భారత మహిళల క్రికెట్ జట్టు క్లీన్ స్వీప్ చేసింది. గురువామిక్కడ జరిగిన చివరి వన్డేలో లంకను 95 పరగుల తేడాతో భారత్ చిత్తు చేసింది. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన ఇండియా 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 229 పరుగులు చేసింది. కెప్టెన్ మిథాలి రాజ్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి సెంచరీ(104) సాధించింది.
230 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక 44 ఓవర్లలో 134 పరుగులకు ఆలౌటయింది. పూనమ్ యాదవ్ 4, రానా 2, గయాక్వాద్ 2 వికెట్లు తీశారు. గోస్వామి ఒక వికెట్ దక్కించుకుంది. వచ్చే నెలలో జరిగే టీ20 వరల్డ్ కప్‌లో సత్తా చాటుతామని మ్యాచ్ ముగిసిన తర్వాత కెప్టెన్ మిథాలీరాజ్ 'సాక్షి'తో చెప్పింది.