
Ind W Vs NZ W Series: భారత మహిళల క్రికెట్ జట్టు న్యూజిలాండ్ పర్యటన వేదికల విషయంలో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. కోవిడ్ కారణంగా సమస్యలు ఎదురు కాకుండా ఉండేందుకు మూడు వేదికలను తగ్గించి ఒకే వేదికకు మార్చారు. ఈ టూర్‌లో భాగంగా కివీస్‌లో భారత మహిళలు ఒక టి20, 5 వన్డేలు ఆడాల్సి ఉంది.
ఈ ఆరు మ్యాచ్‌లను నేపియర్, నెల్సన్, క్వీన్స్‌టౌన్‌లో నిర్వహించాలని షెడ్యూల్ రూపొందించగా... ఇప్పుడు అన్ని మ్యాచ్‌లు క్వీన్స్‌టౌన్‌లోనే జరుగుతాయి. వన్డే ప్రపంచకప్‌కు ముందు జరిగే ఈ పోరు కోసం భారత జట్టు ఇప్పటికే న్యూజిలాండ్ చేరుకుంది. ఇరు జట్ల మధ్య ఫిబ్రవరి 9న టి20 మ్యాచ్... ఫిబ్రవరి 11, 14, 16, 22, 24 తేదీల్లో వన్డేలు జరుగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment