queenstown
-
భారత్–న్యూజిలాండ్ సిరీస్ మ్యాచ్‌లన్నీ అక్కడే... ఎందుకంటే..
Ind W Vs NZ W Series: భారత మహిళల క్రికెట్ జట్టు న్యూజిలాండ్ పర్యటన వేదికల విషయంలో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. కోవిడ్ కారణంగా సమస్యలు ఎదురు కాకుండా ఉండేందుకు మూడు వేదికలను తగ్గించి ఒకే వేదికకు మార్చారు. ఈ టూర్లో భాగంగా కివీస్‌లో భారత మహిళలు ఒక టి20, 5 వన్డేలు ఆడాల్సి ఉంది. ఈ ఆరు మ్యాచ్‌లను నేపియర్, నెల్సన్, క్వీన్స్‌టౌన్‌లో నిర్వహించాలని షెడ్యూల్ రూపొందించగా... ఇప్పుడు అన్ని మ్యాచ్‌లు క్వీన్స్టౌన్లోనే జరుగుతాయి. వన్డే ప్రపంచకప్‌కు ముందు జరిగే ఈ పోరు కోసం భారత జట్టు ఇప్పటికే న్యూజిలాండ్ చేరుకుంది. ఇరు జట్ల మధ్య ఫిబ్రవరి 9న టి20 మ్యాచ్... ఫిబ్రవరి 11, 14, 16, 22, 24 తేదీల్లో వన్డేలు జరుగుతాయి. చదవండి: India Captain: భవిష్యత్తు కెప్టెనా... అసలు అతడిలో ఏ స్కిల్ చూసి ఎంపిక చేశారు: సెలక్టర్లపై మండిపడ్డ మనోజ్ తివారి -
క్వీన్స్ టౌన్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు
క్వీన్స్ టౌన్: న్యూజిలాండ్ లోని క్వీన్స్ టౌన్ ఎయిర్ పోర్టుకు ఆదివారం బాంబు బెదిరింపు రావడంతో అక్కడి భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. ఎయిర్ పోర్టులోని కీలక విభాగాలను ఖాళీ చేయించిన అధికారులు ప్రయాణీకులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఎయిర్ పోర్టు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎయిర్ పోర్టులోని రన్ వేపై ల్యాండయిన విమానంలో గుర్తు తెలియని వ్యక్తి ఉత్తరాన్ని వదిలి వెళ్లినట్లు చెప్పారు. ఇది గమనించిన క్లీనర్ ఉత్తరంలో విమానంలో బాంబు ఉంచినట్లు పేర్కొనడాన్ని గమనించి అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో హైఅలర్ట్ ప్రకటించిన ఎయిర్ పోర్టు అధికారులు భధ్రతను కట్టుదిట్టం చేసి తనిఖీలు చేపట్టారు. బాంబు డిస్పోజల్ స్క్వాడ్ సాయంతో విమానాన్ని జల్లెడ పట్టిన అధికారులు ఎటువంటి పేలుడు పదార్ధాలు లభించలేదని పేర్కొన్నారు. ఎయిర్ పోర్టులోని మిగతా ప్రాంతాలను బాంబు స్క్వాడ్ తనిఖీ చేస్తున్నట్లు చెప్పారు. ప్రయాణికులను ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు.