Bangladesh womens cricket team
-
ఉత్కంఠ సమరంలో భారత్‌ను నిలువరించిన బంగ్లాదేశ్.. మ్యాచ్ టై, సిరీస్ డ్రా
బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్న భారత మహిళల క్రికెట్ జట్టు స్థాయికి తగ్గట్టుగా రాణించలేక 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 1-1తో డ్రా చేసుకుంది. తొలుత టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో అతికష్టం మీద కైవసం చేసుకున్న భారత్.. ఇవాళ (జులై 22) జరిగిన వన్డే సిరీస్ డిసైడర్ మ్యాచ్‌లో గెలుపు అంచుల వరకు వచ్చి, ఆఖరి నిమిషంలో చతికిలపడింది. బంగ్లాదేశ్ నిర్ధేశించిన 226 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చివరి 6 వికెట్లు 34 పరుగుల వ్యవధిలో కోల్పోయిన భారత్.. స్కోర్లు సమం అయ్యాక ఆఖరి వికెట్‌ను కోల్పోయింది. దీంతో మ్యాచ్ 'టై'గా ముగిసింది. సూపర్ ఓవర్ నిబంధన లేకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను 'టై'గా సిరీస్‌ను 'డ్రా'గా ప్రకటించారు. వన్డే ట్రోఫీని బంగ్లా టీమ్.. టీమిండియాతో సంయుక్తంగా పంచుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. ఫర్జానా హాక్ (107) సూపర్ శతకంతో, షమీమా సుల్తానా (52) అర్ధసెంచరీతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. ఆఖర్లో శోభన మోస్త్రీ (23 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. టీమిండియా బౌలర్లలో స్నేహ్ రాణా 2, దేవిక వైద్య ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం 226 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. 32 పరుగులకే 2 వికెట్లు కోల్పోయినప్పటికీ స్మృతి మంధన (59), హర్లీన్ డియోల్ (77) ఆదుకున్నారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 107 పరుగులు జోడించారు. ఈ దశలో భారత్ సునాయాసంగా గెలిచేలా కనిపించింది. అయితే బంగ్లా బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో భారత్ 34 పరుగుల వ్యవధిలో చివరి 6 వికెట్లు కోల్పోయి, మ్యాచ్‌తో పాటు సిరీస్ గెలిచే అవకాశాలను చేజార్చుకుంది. ఆఖర్లో జెమీమా రోడ్రిగెజ్ (33 నాటౌట్) టీమిండియాను గెలిపించేందుకు విఫలయత్నం చేసింది. ఆఖరి ఓవర్లో భారత్ విజయానికి కేవలం 3 పరుగులు మాత్రమే అవసరం కాగా.. మరూఫా బౌలింగ్‌లో మేఘన సింగ్ ఔటై, భారత్‌కు విజయాన్ని దూరం చేసింది. బంగ్లా బౌలర్లలో నహిద అక్తర్ 3, మరూఫా అక్తర్ 2, సుల్తానా ఖాతూన్, రబేయా ఖాన్, ఫహీమ ఖాతూన్ తలో వికెట్ పడగొట్టారు. -
కోపంతో ఊగిపోయిన టీమిండియా కెప్టెన్.. బ్యాట్‌తో వికెట్లను కొట్టి! వీడియో వైరల్
ఢాకా వేదికగా భారత మహిళల జట్టు, బంగ్లాదేశ్ మధ్య జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డే టైగా ముగిసింది. దీంతో మూడు వన్డేల సిరీస్ 1-1తో సమమైంది. ఈ క్రమంలో ట్రోఫీని భారత్-బంగ్లాదేశ్ జట్లు సంయుక్తంగా పంచుకున్నాయి. 226 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా సరిగ్గా 225 పరుగులు చేసి ఆలౌటైంది. ఆఖరి ఓవర్లో భారత విజయానికి మూడు పరుగులు అవసరమవ్వగా.. తొలి బంతిని మేఘనా సింగిల్ తీసి రోడ్రిగ్స్‌కు స్ట్రైక్ ఇచ్చింది. ఆ తర్వాత రోడ్రిగ్స్ మరో పరుగు తీసి స్కోర్లను సమం చేసింది. ఈ సమయంలో స్ట్రైక్‌లోకి వెళ్లిన మేఘనా సింగ్ వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగడంతో మ్యాచ్ టై అయింది. అంతకుముందు ఫర్జానా హాక్ (160 బంతుల్లో 107; 7 ఫోర్లు) అద్భుతమైన సెంచరీతో సాధించడంతో బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. కోపంతో ఊగిపోయిన హర్మన్‌ప్రీత్ కౌర్ ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తన సహనాన్ని కోల్పోయింది. అంపైర్ ఔట్ ఇచ్చాడనే కోపంతో వికెట్లను బ్యాట్‌తో కొట్టింది. భారత ఇన్నింగ్స్ 34 ఓవర్ వేసిన నహిదా అక్తర్ బౌలింగ్‌లో మూడో బంతిని హర్మన్‌ప్రీత్ లెగ్ సైడ్ ఆడే ప్రయత్నం చేసింది. అయితే బంతి బ్యాట్‌కు మిస్స్ అయ్యి ప్యాడ్‌కు తాకింది. ఈ క్రమంలో బంగ్లా క్రికెటర్లు ఎల్బీకి అప్పీలు చేశారు. అంపైర్ వెంటనే ఔట్ అంటూ వేలు పైకెత్తాడు. దీంతో అంపైర్ నిర్ణయంపై ఆసంతృప్తి వ్యక్తం చేసిన హార్మన్ ప్రీత్.. తన బ్యాట్‌తో సంప్ట్ప్ను పడగొట్టి పెవిలియన్‌కు వెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: Fargana Hoque: బంగ్లాదేశ్ తరఫున తొలి సెంచరీ నమోదు Harmanpreet Kaur was not happy with the decision 👀#HarmanpreetKaur #IndWvsBangW #INDvWI pic.twitter.com/ZyoQ3R3Thb — Ajay Ahire (@Ajayahire_cric) July 22, 2023 -
బంగ్లాదేశ్ తరఫున తొలి సెంచరీ నమోదు
మహిళల వన్డే క్రికెట్లో బంగ్లాదేశ్ తరఫున తొలి సెంచరీ నమోదైంది. 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా టీమిండియాతో ఇవాళ (జులై 22) జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో ఫర్జానా హాక్ (160 బంతుల్లో 107; 7 ఫోర్లు) ఈ ఘనత సాధించింది. ఈ మ్యాచ్‌కు ముందు వన్డేల్లో బంగ్లాదేశ్ తరఫున అత్యధిక స్కోర్ రికార్డు సల్మా ఖాతూన్ పేరిట ఉండేది. 2013 ఏప్రిల్‌లో సల్మా భారత్‌పై 75 పరుగులు చేసింది. అదే నేటి వరకు వన్డేల్లో బంగ్లా తరఫున అత్యధిక స్కోర్‌గా ఉండింది. బంగ్లా తరఫున వన్డేల్లో తొలి సెంచరీ రికార్డుతో పాటు ఫర్జానా ఖాతాలో మరో 2 రికార్డులు కూడా ఉన్నాయి. బంగ్లా తరఫున వన్డేల్లో అత్యధిక పరుగుల రికార్డు (56 మ్యాచ్‌ల్లో 25.83 సగటున 1240 పరుగులు), బంగ్లా తరఫున వన్డేల్లో అత్యధిక హాఫ్ సెంచరీల రికార్డు (9) ఫర్జానా పేరిటే ఉన్నాయి. భారత్‌తో మ్యాచ్‌లో 160 బంతులు ఎదుర్కొన్న ఫర్జానా.. మహిళల క్రికెట్లో అత్యధిక బంతులు ఎదుర్కొన్న ఐదో బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కింది. టీమిండియా బ్యాటర్ దీప్తి శర్మతో కలిసి ఫర్జానా ఈ రికార్డును షేర్ చేసుకుంది. ఈ జాబితాలో ఐర్లాండ్ అన్నె ముర్రే (171) టాప్‌లో ఉంది. ఇదిలా ఉంటే, ఫర్జానా రికార్డు సెంచరీతో కదంతొక్కడంతో భారత్‌తో జరుగుతున్న మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. ఫర్జానాతో పాటు మరో ఓపెనర్ షమీమా సుల్తానా (52) అర్ధసెంచరీతో రాణించింది. కెప్టెన్ నిగర్ సుల్తానా (24), ఆఖర్లో శోభన మోస్త్రీ (23 నాటౌట్) పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో స్నేహ్ రాణా 2, దేవిక వైద్య ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్.. 37 ఓవర్ల తర్వాత 4 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసి, విజయం దిశగా సాగుతుంది. స్మృతి మంధన (59) అర్ధశతకంతో మెరవగా.. హర్లీన్ డియోల్ (67 నాటౌట్) భారత్‌ను విజయతీరాలకు చేర్చే ప్రయత్నం చేస్తుంది. హర్లీన్‌కు జతగా జెమీమా రోడ్రిగెజ్ (6) క్రీజ్‌లో ఉంది. షెఫాలీ వర్మ (4), యస్తికా భాటియా (5), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (14) ఔటయ్యారు. బంగ్లా బౌలర్లలో సుల్తానా ఖాతూన్, మరుఫా అక్తర్, నహిద అక్తర్, ఫామిమా ఖాతూన్ తలో వికెట్ పడగొట్టారు. -
బంగ్లాదేశ్ హెడ్ కోచ్‌గా శ్రీలంక మాజీ ప్లేయర్
Hashan Tillakaratne: బంగ్లాదేశ్ మహిళా క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా శ్రీలంక మాజీ ప్లేయర్ హసన్ తిలకరత్నే నియమితుడయ్యాడు. ప్రస్తుతం శ్రీలంక మహిళా జట్టు కోచ్‌గా వ్యవహరిస్తున్న తిలకరత్నే.. వచ్చే రెండేళ్ల కాలానికి బంగ్లాదేశ్ కోచ్‌గా విధులు నిర్వహిస్తాడని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (మహిళల క్రికెట్) చైర్మన్ నాదెల్ చౌధురీ వెల్లడించారు. తిలకరత్నే ఈ ఏడాది నవంబర్ నుంచి బాధ్యతలు చేపడతాడని నాదెల్ ప్రకటించారు. కాగా, బంగ్లాదేశ్ మహిళా క్రికెట్ టీమ్ గత కొంతకాలంగా స్థానిక కోచ్‌లతో ప్లేయర్లకు శిక్షణ ఇప్పించేది. వీరి పర్యవేక్షణలో జట్టు కనీస ప్రదర్శన కూడా చేయలేకపోవడంతో అనుభవజ్ఞుడైన విదేశీ కోచ్‌ను నియమించుకోవాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే హసన్ తిలకరత్నేతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇదిలా ఉంటే, ఇటీవల జరిగిన మహిళల ఆసియా కప్‌లో బంగ్లా జట్టు పేలవ ప్రదర్శన కనబర్చి, గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. ఈ టోర్నీలో ఆడిన 6 మ్యాచ్‌ల్లో రెండే విజయాలతో ఐదో స్థానంలో నిలిచింది. ఈ టోర్నీలో టీమిండియా ఛాంపియన్‌గా నిలిచింది. భారత్.. ఫైనల్లో శ్రీలంకపై 8 వికెట్ల తేడాతో గెలుపొంది ఆసియా ఛాంపియన్‌గా నిలిచింది. చదవండి: న్యూజిలాండ్‌కు ఊహించని షాక్.. ఆఫ్ఘన్‌తో మ్యాచ్ రద్దు -
అంతా సింగిల్ డిజిట్.. 46కే ప్యాకప్!
ప్రొవిడెన్స్ (గయానా) : మహిళా టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ ఆతిథ్య జట్టు, డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్ చేతిలో చిత్తుగా ఓడింది. భారత కాలమాన ప్రకారం శనివారం ఉదయం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 8 వికెట్ల నష్టానికి 106 పరుగుల చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లా.. విండీస్ బౌలర్ దియాంద్రా డాటిన్(5/6) దాటికి బంగ్లా బ్యాట్స్ఉమెన్ అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. దీంతో బంగ్లా 46 పరుగులకే కుప్పకూలడంతో విండీస్ 60 పరుగుల తేడాతో విజయం సాధించింది. బంగ్లా బ్యాట్స్ఉమెన్లో ఫర్గానా హక్ (8) పరుగులే అత్యధికం కావడం విశేషం. చదవండి: జస్ట్.. ఇది ఆరంభమే : హర్మన్ ప్రీత్ హర్మన్ హరికేన్ -
భారత మహిళలదే సిరీస్
బంగ్లాతో రెండో టి20లో విజయం కాక్స్‌బజార్: బంగ్లాదేశ్ మహిళా క్రికెట్ జట్టుతో జరిగిన రెండో టి20 మ్యాచ్‌లోనూ భారత్ దుమ్మురేపింది. షేక్ కమాల్ అంతర్జాతీయ స్టేడియంలో మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో గెలిచింది. తద్వారా మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో ఖాయం చేసుకుంది. చివరి టి20 గురువారం ఇదే వేదికపై జరుగుతుంది. పూనమ్ యాదవ్ (2/9), జులన్ గోస్వామి (2/15) ధాటికి బంగ్లా 20 ఓవర్లలో కేవలం 65 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫర్గానా హోగ్ (36 బంతుల్లో 18; 1 ఫోర్) టాప్ స్కోరర్. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 12.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 66 పరుగులు చేసి నెగ్గింది. ఓపెనర్ మాధురి మెహతా (30 బంతుల్లో 23; 3 ఫోర్లు) రాణించింది. చివర్లో జులన్ గోస్వామి (13 బంతుల్లో 18; 4 ఫోర్లు) వేగంగా ఆడి త్వరగా మ్యాచ్‌ను ముగించింది.