భారత మహిళలదే సిరీస్ | India beat Bangladesh in Women's T20 Cricket | Sakshi
Sakshi News home page

భారత మహిళలదే సిరీస్

Published Wed, Mar 12 2014 1:29 AM | Last Updated on Sat, Sep 2 2017 4:35 AM

India beat Bangladesh in Women's T20 Cricket

బంగ్లాతో రెండో టి20లో విజయం
 కాక్స్‌బజార్: బంగ్లాదేశ్ మహిళా క్రికెట్ జట్టుతో జరిగిన రెండో టి20 మ్యాచ్‌లోనూ భారత్ దుమ్మురేపింది. షేక్ కమాల్ అంతర్జాతీయ స్టేడియంలో మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో గెలిచింది. తద్వారా మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో ఖాయం చేసుకుంది. చివరి టి20 గురువారం ఇదే వేదికపై జరుగుతుంది.
 

పూనమ్ యాదవ్ (2/9), జులన్ గోస్వామి (2/15) ధాటికి బంగ్లా 20 ఓవర్లలో కేవలం 65 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫర్గానా హోగ్ (36 బంతుల్లో 18; 1 ఫోర్) టాప్ స్కోరర్. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 12.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 66 పరుగులు చేసి నెగ్గింది. ఓపెనర్ మాధురి మెహతా (30 బంతుల్లో 23; 3 ఫోర్లు) రాణించింది. చివర్లో జులన్ గోస్వామి (13 బంతుల్లో 18; 4 ఫోర్లు) వేగంగా ఆడి త్వరగా మ్యాచ్‌ను ముగించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement