India vs New Zealand T20I: న్యూజిలాండ్ సిరీస్‌కు ముందు భారత అభిమానులకు రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ గుడ్ న్యూస్ అందించింది. న్యూజిలాండ్‌తో జరగబోయే తొలి టీ20 మ్యాచ్‌కు ప్రేక్షకులకు అనుమతి ఇస్తున్నట్లు రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. నవంబర్ 17న భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి టీ20 మ్యాచ్‌కు జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మేరకు కనీసం సింగిల్ డోస్ కోవిడ్-19 వ్యాక్సిన్ అయినా తీసుకున్నవారు మాత్రమే అనుమతించబడతారని ఆర్‌సిఏ ప్రకటించింది.
కోవిడ్-19 ప్రోటోకాల్‌లను పాటిస్తూనే స్టేడియంలో ప్రేక్షకుల ప్రవేశంపై రాష్ట్ర హోం శాఖ నుంచి అనుమతి తీసుకున్నట్లు ఆర్‌సిఏ సెక్రటరీ మహేంద్ర శర్మ తెలిపారు. ఇంగ్లండ్‌తో జరిగిన హోమ్ సిరీస్ తర్వాత అభిమానులను తొలి సారిగా అనుమతిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా న్యూజిలాండ్ రెండు టెస్ట్‌లు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది.
భారత టి20 జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వెంకటేశ్ అయ్యర్, యజువేంద్ర చహల్, అశ్విన్, అక్షర్ పటేల్, అవేశ్ ఖాన్, భువనేశ్వర్, దీపక్ చహర్, హర్షల్ పటేల్, మొహమ్మద్ సిరాజ్.
భారత్, న్యూజిలాండ్ టి20 సిరీస్ షెడ్యూల్
నవంబర్ 17: తొలి మ్యాచ్ (జైపూర్‌లో)
నవంబర్ 19: రెండో మ్యాచ్ (రాంచీలో)
నవంబర్ 21: మూడో మ్యాచ్ (కోల్‌కతాలో
చదవండి: Mushtaq Ahmed: టీమిండియాలో అంతర్గత విభేదాలు.. త్వరలోనే కోహ్లి రిటైర్‌మెంట్ అంటూ..
Comments
Please login to add a commentAdd a comment