T 20 match series
-
న్యూజిలాండ్ సిరీస్‌కు ముందు భారత అభిమానులకు గుడ్ న్యూస్...
India vs New Zealand T20I: న్యూజిలాండ్ సిరీస్‌కు ముందు భారత అభిమానులకు రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ గుడ్ న్యూస్ అందించింది. న్యూజిలాండ్‌తో జరగబోయే తొలి టీ20 మ్యాచ్‌కు ప్రేక్షకులకు అనుమతి ఇస్తున్నట్లు రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. నవంబర్ 17న భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి టీ20 మ్యాచ్‌కు జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మేరకు కనీసం సింగిల్ డోస్ కోవిడ్-19 వ్యాక్సిన్ అయినా తీసుకున్నవారు మాత్రమే అనుమతించబడతారని ఆర్‌సిఏ ప్రకటించింది. కోవిడ్-19 ప్రోటోకాల్‌లను పాటిస్తూనే స్టేడియంలో ప్రేక్షకుల ప్రవేశంపై రాష్ట్ర హోం శాఖ నుంచి అనుమతి తీసుకున్నట్లు ఆర్‌సిఏ సెక్రటరీ మహేంద్ర శర్మ తెలిపారు. ఇంగ్లండ్‌తో జరిగిన హోమ్ సిరీస్ తర్వాత అభిమానులను తొలి సారిగా అనుమతిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా న్యూజిలాండ్ రెండు టెస్ట్‌లు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. భారత టి20 జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వెంకటేశ్ అయ్యర్, యజువేంద్ర చహల్, అశ్విన్, అక్షర్ పటేల్, అవేశ్ ఖాన్, భువనేశ్వర్, దీపక్ చహర్, హర్షల్ పటేల్, మొహమ్మద్ సిరాజ్. భారత్, న్యూజిలాండ్ టి20 సిరీస్ షెడ్యూల్ నవంబర్ 17: తొలి మ్యాచ్ (జైపూర్‌లో) నవంబర్ 19: రెండో మ్యాచ్ (రాంచీలో) నవంబర్ 21: మూడో మ్యాచ్ (కోల్‌కతాలో చదవండి: Mushtaq Ahmed: టీమిండియాలో అంతర్గత విభేదాలు.. త్వరలోనే కోహ్లి రిటైర్మెంట్ అంటూ.. -
వైజాగ్‌లో టెస్టు, వన్డే హైదరాబాద్‌లో టి20
న్యూఢిల్లీ: ప్రపంచకప్ అనంతరం భారత్‌లో జరిగే ద్వైపాక్షిక సిరీస్‌ల షెడ్యూల్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సోమవారం ప్రకటించింది. 2019–20 సీజన్‌కుగానూ స్వదేశంలో జరుగనున్న 5 టెస్టులు, 9 వన్డేలు, 12 టి20ల్లో భారత్ వేర్వేరు జట్లతో తలపడనుంది. సెప్టెంబర్ 15న దక్షిణాఫ్రికాతో మొదలయ్యే ‘ఫ్రీడమ్ కప్’ ట్రోఫీతో ‘భారత హోమ్ సీజన్’ ప్రారంభమవుతుంది. ఫ్రీడమ్ కప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో మూడు టి20లు, మూడు టెస్టులు జరుగుతాయి. అక్టోబర్ 2 నుంచి 6 వరకు జరిగే తొలి టెస్టుకు వైజాగ్ ఆతిథ్యం ఇవ్వనుంది. అనంతరం నవంబర్‌లో భారత్‌లో పర్యటించనున్న బంగ్లాదేశ్ 3 టి20లు, రెండు టెస్టులు ఆడుతుంది. తర్వాత డిసెంబర్ 6 నుంచి 22 వరకు వెస్టిండీస్ పర్యటిస్తుంది. ఇందులో భాగంగా జరుగనున్న 3 టి20ల్లో చివరి మ్యాచ్‌కు హైదరాబాద్... 3 వన్డేల్లో రెండో మ్యాచ్‌కు వైజాగ్ వేదికలుగా ఉన్నాయి. డిసెంబర్ 6న ముంబైలో తొలి టి20, 8న తిరువనంతపురంలో రెండో టి20, 11న హైదరాబాద్‌లో మూడో టి20 జరుగుతాయి. డిసెంబర్ 15న చెన్నైలో తొలి వన్డే, 18న వైజాగ్‌లో రెండో వన్డే, 22న కటక్‌లో మూడో వన్డే జరుగుతాయి. తర్వాత జింబాబ్వేతో 3 మ్యాచ్‌ల టి20 సిరీస్ (జనవరి 5–10)... ఆస్ట్రేలియా (జనవరి 14–19), దక్షిణాఫ్రికా (మార్చి 12–18) లతో వరుసగా 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లు జరుగుతాయి. మార్చి 18న దక్షిణాఫ్రికాతో జరిగే చివరి మ్యాచ్‌తో భారత హోమ్ సీజన్ ముగుస్తుంది. -
భారత మహిళలదే సిరీస్
బంగ్లాతో రెండో టి20లో విజయం కాక్స్‌బజార్: బంగ్లాదేశ్ మహిళా క్రికెట్ జట్టుతో జరిగిన రెండో టి20 మ్యాచ్‌లోనూ భారత్ దుమ్మురేపింది. షేక్ కమాల్ అంతర్జాతీయ స్టేడియంలో మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో గెలిచింది. తద్వారా మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో ఖాయం చేసుకుంది. చివరి టి20 గురువారం ఇదే వేదికపై జరుగుతుంది. పూనమ్ యాదవ్ (2/9), జులన్ గోస్వామి (2/15) ధాటికి బంగ్లా 20 ఓవర్లలో కేవలం 65 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫర్గానా హోగ్ (36 బంతుల్లో 18; 1 ఫోర్) టాప్ స్కోరర్. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 12.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 66 పరుగులు చేసి నెగ్గింది. ఓపెనర్ మాధురి మెహతా (30 బంతుల్లో 23; 3 ఫోర్లు) రాణించింది. చివర్లో జులన్ గోస్వామి (13 బంతుల్లో 18; 4 ఫోర్లు) వేగంగా ఆడి త్వరగా మ్యాచ్‌ను ముగించింది.