
విండీస్ మహిళల ఆనందం
ప్రొవిడెన్స్ (గయానా) : మహిళా టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ ఆతిథ్య జట్టు, డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్ చేతిలో చిత్తుగా ఓడింది. భారత కాలమాన ప్రకారం శనివారం ఉదయం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 8 వికెట్ల నష్టానికి 106 పరుగుల చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లా.. విండీస్ బౌలర్ దియాంద్రా డాటిన్(5/6) దాటికి బంగ్లా బ్యాట్స్‌ఉమెన్ అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. దీంతో బంగ్లా 46 పరుగులకే కుప్పకూలడంతో విండీస్ 60 పరుగుల తేడాతో విజయం సాధించింది. బంగ్లా బ్యాట్స్‌ఉమెన్‌లో ఫర్గానా హక్ (8) పరుగులే అత్యధికం కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment