West Indies Women Cricket Team
-
అంతర్గత విభేదాలు.. వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ సంచలన నిర్ణయం!
వెస్టిండీస్ మహిళల క్రికెట్ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ డియాండ్రా డాటిన్ సంచలన నిర్ణయం తీసుకుంది. డాటిన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. డాటిన్ తన నిర్ణయాన్ని సోషల్ మీడియా వేదికగా సోమవారం ప్రకటించింది. కాగా జట్టులో అంతర్గత విభేదాలు వల్ల డాటిన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న ఆమె దేశవాళీ క్రికెట్లో మాత్రం కొనసాగనున్నట్లు తెలిపింది. "14 ఏళ్ల నా అంతర్జాతీయ కెరీర్లో నాకు మద్దతుగా నిలిచిన వెస్టిండీస్ క్రికెట్‌కు, అభిమానులకు ధన్యవాదాలు. నేను చాలా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇకపై ప్రపంచ వ్యాప్తంగా దేశవాళీ క్రికెట్ ఆడేందుకు నేను ఎదురుచూస్తున్నాను” అని ట్విటర్లో డాటిన్ పేర్కొంది. కాగా డాటిన్ ప్రస్తుతం కామన్ వెల్త్‌గేమ్స్‌లో బార్బడోస్ జట్టు తరపున ఆడుతోంది. కామన్ వెల్త్‌గేమ్స్‌లో భాగంగా ఆగస్టు 3న భారత్ మహిళల జట్టుతో బార్బడోస్ తలపడనుంది. అయితే డాటిన్ ఈ మ్యాచ్‌కు ముందు రిటైర్మెంట్ ప్రకటించడం బార్బడోస్‌కు గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పుకోవాలి. ఇక 2008లో డాటిన్ విండీస్ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసింది. ఇప్పటి వరకు తన అంతర్జాతీయ కెరీర్లో 146 వన్డేలు, 126 టీ20ల్లో విండీస్‌కు ప్రాతినిధ్యం వహించింది. అదే విధంగా తొలి టీ20 ప్రపంచకప్ గెలిచిన విండీస్ జట్టులో డాటిన్ భాగంగా ఉంది. చదవండి: Eng VS SA: స్టబ్స్ అద్భుత విన్యాసం.. ఒంటిచేత్తో అవలీలగా! ఇలాంటి క్యాచ్ ఎప్పుడూ చూసి ఉండరు! Thanks to all for the love and support with in my past 14 years of playing cricket for West Indies! I look forward to be playing domestic cricket around the world pic.twitter.com/Vmw6AqpYQJ — Deandra Dottin (@Dottin_5) July 31, 2022 -
స్మృతి, జెమీమా అర్ధ సెంచరీలు
నార్త్ సౌండ్: వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను భారత మహిళల జట్టు 2–1తో గెలుచుకుంది. బుధవారం జరిగిన చివరి మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో విండీస్‌పై ఘన విజయం సాధించింది. ముందుగా విండీస్ మహిళలు 50 ఓవర్లలో 194 పరుగులకే ఆలౌటయ్యారు. కెప్టెన్ స్టెఫానీ టేలర్ (112 బంతుల్లో 79; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీ సాధించగా, కింగ్ (38) రాణించింది. అనంతరం భారత్ 42.1 ఓవర్లలో 4 వికెట్లకు 195 పరుగులు చేసింది. గాయం కారణంగా తొలి రెండు వన్డేలకు దూరమై... ఈ మ్యాచ్‌తోనే బరిలోకి దిగిన స్మృతి మంధాన (63 బంతుల్లో 74; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) దూకుడైన ఆటకు తోడు జెమీమా రోడ్రిగ్స్ (92 బంతుల్లో 69; 6 ఫోర్లు) కూడా అండగా నిలవడంతో జట్టు విజయం సులువైంది. వీరిద్దరు తొలి వికెట్‌కు 141 పరుగులు జోడించడం విశేషం. స్మృతి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలవగా... స్టెఫానీ టేలర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ పురస్కారం దక్కింది. -
భారత మహిళల జోరు
నార్త్‌సౌండ్: వెస్టిండీస్‌తో జరుగుతున్న సిరీస్‌లో తొలి వన్డేలో ఓడిన భారత మహిళల జట్టు వెంటనే కోలుకుంది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన రెండో వన్డేలో భారత్ 53 పరుగుల తేడాతో విండీస్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. పూనమ్ రౌత్ (128 బంతుల్లో 77; 4 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించగా, కెప్టెన్ మిథాలీ రాజ్ (67 బంతుల్లో 40; 4 ఫోర్లు), హర్మన్ ప్రీత్ కౌర్ (52 బంతుల్లో 46; 4 ఫోర్లు) రాణించారు. అనంతరం వెస్టిండీస్ 47.2 ఓవర్లలో 138 పరుగులకే కుప్పకూలింది. క్యాంప్‌బెల్ (90 బంతుల్లో 39; 2 ఫోర్లు) టాప్‌స్కోరర్ కాగా...ముగ్గురు విభిన్న శైలి గల భారత స్పిన్నర్లు దీప్తి శర్మ, పూనమ్ యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్ తలా 2 వికెట్లు తీసి ప్రత్యర్థిని పడగొట్టారు. భారత్ 17 పరుగులకే ఓపెనర్లు ప్రియా పూనియా (5), జెమీమా (0) వికెట్లు కోల్పోయింది. ఈ దశలో పూనమ్ రౌత్, మిథాలీ కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. తొలి 9 ఓవర్లలో భారత్ ఇన్నింగ్స్‌లో ఒక్క ఫోర్ కూడా లేకపోగా, మిథాలీ తాను ఎదుర్కొన్న మూడో బంతిని బౌండరీకి తరలించి బోణీ చేసింది. పూనమ్ మరీ నెమ్మదిగా ఆడుతూ వికెట్ కాపాడుకునే ప్రయత్నం చేసింది. తన 70వ బంతికి గానీ ఆమె తొలి ఫోర్ కొట్టలేకపోయింది. వీరిద్దరు మూడో వికెట్‌కు 66 పరుగులు జోడించారు. అనంతరం పూనమ్‌తో జత కలిసిన హర్మన్ దూకుడుగా ఆడింది. పూనమ్ కూడా ధాటిని పెంచడంతో పరుగులు వేగంగా వచ్చాయి. 17.5 ఓవర్లలోనే వీరిద్దరు నాలుగో వికెట్‌కు 93 పరుగులు జత చేయడం విశేషం. ఆరు బంతుల వ్యవధిలో పూనమ్, హర్మన్ అవుటయ్యారు. వెస్టిండీస్ ఇన్నింగ్స్ మొదటినుంచి తడబడుతూనే సాగింది. ఎవరూ భారత స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కోలేకపోయారు. కెప్టెన్ స్టెఫానీ టేలర్ (20) విఫలం కావడంతో ఆ జట్టు విజయంపై ఆశలు కోల్పోయింది. సిరీస్‌లో ఇరు జట్లు 1–1తో సమంగా నిలవగా చివరి వన్డే ఇదే వేదికపై బుధవారం జరుగుతుంది. -
అంతా సింగిల్ డిజిట్.. 46కే ప్యాకప్!
ప్రొవిడెన్స్ (గయానా) : మహిళా టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ ఆతిథ్య జట్టు, డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్ చేతిలో చిత్తుగా ఓడింది. భారత కాలమాన ప్రకారం శనివారం ఉదయం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 8 వికెట్ల నష్టానికి 106 పరుగుల చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లా.. విండీస్ బౌలర్ దియాంద్రా డాటిన్(5/6) దాటికి బంగ్లా బ్యాట్స్ఉమెన్ అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. దీంతో బంగ్లా 46 పరుగులకే కుప్పకూలడంతో విండీస్ 60 పరుగుల తేడాతో విజయం సాధించింది. బంగ్లా బ్యాట్స్ఉమెన్లో ఫర్గానా హక్ (8) పరుగులే అత్యధికం కావడం విశేషం. చదవండి: జస్ట్.. ఇది ఆరంభమే : హర్మన్ ప్రీత్ హర్మన్ హరికేన్ -
టి20 ఫైనల్లో ఆస్ట్రేలియా
మిర్పూర్: మహిళల టి20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా జట్టు ఫైనల్లో అడుగు పెట్టింది. గురువారమిక్కడ జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై ఆసీస్ టీమ్ 8 పరుగుల తేడాతో గెలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది. విల్లాని 35, హీలీ 30, లానింగ్ 29 పరుగులు చేశారు. 141 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. డొటిన్(40), కింగ్(36) రాణించినా విండీస్ ఓడిపోయింది. దీంతో మూడోసారి ఆస్ట్రేలియా ఫైనల్లోకి అడుగుపెట్టింది. రేపు జరిగే రెండో సెమీస్‌లో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో ఫైనల్లో ఆసీస్ తలపడుతుంది.