మహిళల క్రికెట్‌లో భాగంగా సౌతాఫ్రికా వుమన్స్ టీమ్‌తో ఇవాళ (జూన్ 28) మొదలైన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్లు స్మృతి మంధన (149), షఫాలీ వర్మ (165) సెంచరీల మోత మోగించారు. స్మృతి. షఫాలీ సెంచరీలతో చెలరేగడంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా 60 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 334 పరుగులు చేసింది. స్మృతి, శుభ సతీష్ (15) ఔట్ కాగా.. షఫాలీ, జెమీమా రోడ్రిగెజ్ (1) క్రీజ్‌లో ఉన్నారు. సౌతాఫ్రికా బౌలర్లలో డి క్లెర్క్, డెల్మి టక్కర్ తలో వికెట్ పడగొట్టారు.
భీకర ఫామ్‌లో స్మృతి..
సౌతాఫ్రికాతో సిరీస్‌లలో టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధన అరివీర భయంకర ఫామ్‌లో ఉంది. వన్డే సిరీస్‌లో వరుసగా రెండు సెంచరీలు, ఓ 90 ప్లస్ స్కోర్ చేసిన మంధన.. తాజాగా టెస్ట్‌ల్లో సెంచరీ చేసింది. మంధనకు టెస్ట్‌ల్లో ఇది రెండో సెంచరీ. స్మృతితో పాటు సెంచరీ చేసిన షఫాలీ వర్మకు టెస్ట్‌ల్లో ఇది తొలి సెంచరీ.
మ్యాచ్ హైలైట్స్..
టెస్ట్‌ల్లో స్మృతి మంధనకు రెండో సెంచరీ (ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా)
టెస్ట్‌ల్లో షఫాలీ వర్మకు తొలి సెంచరీ
ప్రస్తుత భారత మహిళల క్రికెటర్లలో స్మృతి మంధనవే అత్యధిక సెంచరీలు (2)
మహిళల టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం (స్మృతి, షఫాలీ-292 పరుగులు)
భారత మహిళల క్రికెట్ జట్టు తరఫున అత్యధిక భాగస్వామ్యం (స్మృతి, షఫాలీ-292 పరుగులు)
Comments
Please login to add a commentAdd a comment