
► 139 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన యూపీ వారియర్స్ అద్భుత బ్యాటింగ్ లైనప్‌తో సత్తా చాటింది. ఓపెనర్లు హీలీ (47 బంతుల్లో 96, 4x18, 6x1), వైద్య (31 బంతుల్లో 36, 4x5), రాణించడంతో వికెట్ నష్టపోకుండా విజయం సాధించింది.
► యూపీ వారియర్స్ వికెట్ నష్టపోకుండా విజయం దిశగా దూసుకెళ్తోంది. 11 ఓవర్లు ముగిసే సమయానికి 115 పరుగులు చేసింది. క్రీజులో వైద్య (29), హీలీ (79) పరుగులతో ఉన్నారు. మరో 24 పరుగులు చేస్తే యూపీ వారియర్స్ ఘన విజయాన్ని సొంతం చేసుకుంటుంది.
►139 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన యూపీ వారియర్స్.. 7 ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 66 పరుగులు చేసింది. క్రీజులో వైద్య(17), హీలీ(48) పరుగులతో ఉన్నారు.
3 ఓవర్లకు యూపీ స్కోర్: 32/0
139 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన యూపీ వారియర్స్.. 3 ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 32 పరుగులు చేసింది. క్రీజులో వైద్య(13) హీలీ(19) పరుగులతో ఉన్నారు.
4 వికెట్లతో చెలరేగిన ఎక్లెస్టోన్.. 138 పరుగులకే ఆర్సీబీ ఆలౌట్
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ.. 138 పరుగులకే ఆలౌటైంది. యూపీ వారియర్స్ స్పిన్నర్ సోఫి ఎక్లెస్టోన్ నాలుగు వికెట్లతో ఆర్సీబీ పతనాన్ని శాసించింది. ఆమెతో పాటు దీప్తిశర్మ 3 వికెట్లతో చెలరేగింది. ఇక బెంగళూరు బ్యాటర్లలో ఎల్లీస్ పెర్రీ(52), సోఫీ డివైన్(36) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచారు.
►15 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ 5 వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది. క్రీజులో పెర్రీ(37), రిచా ఘోష్ ఉన్నారు.
►11 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ మూడు వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది. క్రీజులో పెర్రీ(37), నైట్ ఉన్నారు.
►6 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ వికెట్ నష్టపోయి 59 పరుగులు చేసింది. క్రీజులో సోఫి డివైన్(33), పెర్రీ(22) పరుగులతో ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన ఆర్సీబీ
29 పరుగుల వద్ద ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన కెప్టెన్ మంధాన.. రాజేశ్వరీ గైక్వాడ్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరింది. క్రీజులో పెర్రీ, డివైన్ ఉన్నారు.
►3 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ వికెట్ నష్టపోకుండా 29 పరుగులు చేసింది. క్రీజులో సోఫి డివైన్(25), మంధాన(4) పరుగులతో ఉన్నారు.
మహిళల ప్రీమియర్ లీగ్‌లో యూపీ వారియర్స్ తో కీలక మ్యాచ్‌లో తలపడేందుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సిద్దమైంది. వరుసగా మూడు పరాజయాలను చవిచూసిన ఆర్సీబీ ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి ప్లేఆఫ్ రేసులో నిలవాలని భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: స్మృతి మంధాన(కెప్టెన్), సోఫీ డివైన్, ఎల్లీస్ పెర్రీ, హీథర్ నైట్, రిచా ఘోష్(వికెట్ కీపర్), ఎరిన్ బర్న్స్, శ్రేయంక పాటిల్, కనికా అహుజా, సహానా పవార్, కోమల్ జంజాద్, రేణుకా ఠాకూర్ సింగ్
యూపీ వారియర్జ్: అలిస్సా హీలీ(కెప్టెన్), శ్వేతా సెహ్రావత్, కిరణ్ నవ్‌గిరే, తహ్లియా మెక్‌గ్రాత్, దీప్తి శర్మ, గ్రేస్ హారిస్, దేవిక వైద్య, సిమ్రాన్ షేక్, సోఫీ ఎక్లెస్టోన్, అంజలి సర్వాణి, రాజేశ్వరి గయాక్వాడ్
చదవండి: IND vs AUS: క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రివ్యూ.. పరువు పోగట్టుకున్న రోహిత్, జడ్డూ! వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment