మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) మూడో సీజన్‌కు సర్వం సిద్ధమవుతుండగా... కొన్ని జట్లు గాయపడిన ప్లేయర్ల స్థానాలను భర్తీ చేసుకున్నాయి. యూపీ వారియర్స్ ఫ్రాంచైజీ అలీసా హీలీ (ఆ్రస్టేలియా) కాలి పాదం గాయంతో సీజన్ మొత్తానికి దూరమవడంతో ఆమె స్థానాన్ని వెస్టిండీస్ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ చినెల్లి హెన్రీతో భర్తీ చేసుకుంది.
ఇప్పటివరకు 62 అంతర్జాతీయ టి20లు ఆడిన జమైకన్ ఆల్‌రౌండర్ 22 వికెట్లు తీయడంతో పాటు 473 పరుగులు చేసింది. రూ.30 లక్షల ప్రాథమిక ధరతో ఆమెను తీసుకున్నట్లు ఫ్రాంచైజీ తెలిపింది. గాయం కారణంగా డబ్ల్యూపీఎల్ టోర్నీకి దూరమవడం బాధాకరమని హీలీ చెప్పింది.
ఆమె ఇటీవల మహిళల యాషెస్ సిరీస్‌లో ఆ్రస్టేలియాకు సారథిగా వ్యవహరించింది. డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB Women) ఫ్రాంచైజీ రెండు మార్పులు చేసింది. వ్యక్తిగత కారణాలతో 35 ఏళ్ల వెటరన్ ఆల్‌రౌండర్ సోఫీ డివైన్ (న్యూజిలాండ్), కేట్ క్రాస్ (ఇంగ్లండ్)లిద్దరూ ఈ సీజన్ నుంచి తప్పుకోవడంతో వారి స్థానాలను ఆ్రస్టేలియా ప్లేయర్లు హీథెర్ గ్రాహమ్, కిమ్ గార్త్‌లతో భర్తీ చేసుకుంది. వీళ్లిద్దరిని చెరో రూ. 30 లక్షల ఫీజుతో తీసుకున్నట్లు ఆర్‌సీబీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 14 నుంచి వడోదరలో డబ్ల్యూపీఎల్ మూడో సీజన్ పోటీలు జరుగుతాయి.
ఆర్సీబీ మహిళల జట్టు
స్మృతి మంధాన (కెప్టెన్), సబ్బినేని మేఘన, రిచా ఘోష్, ఎల్లీస్ పెర్రీ, జార్జియా వేర్‌హామ్, శ్రేయాంక పాటిల్, ఆశా శోభనా, రేణుకా సింగ్, సోఫీ మోలినెక్స్, ఏక్తా బిష్త్, హీథెర్ గ్రాహమ్, కిమ్ గార్త్, కనికా అహుజా, డాని వ్యాట్, ప్రేమ రావత్,జోషిత విజె, రాఘవి బిస్త్ ,, జాగ్రవి పవార్.
యూపీ జట్టు
చినెల్లి హెన్రీ, అంజలి సర్వాణి, దీప్తి శర్మ, గ్రేస్ హారిస్, కిరణ్ నవ్‌గిరే, రాజేశ్వరి గయాక్‌వాడ్, శ్వేతా సెహ్రావత్, సోఫీ ఎక్లెస్టోన్, తహ్లియా మెక్‌గ్రాత్, వృందా దినేష్, సైమా ఠాకోర్, పూనమ్ ఖేమ్నార్, చౌమరి సుల్తానా, చౌమరి సుల్తానా.
చదవండి: ఇంగ్లండ్‌తో తొలి వన్డే.. సచిన్ వరల్డ్ రికార్డుపై కన్నేసిన కోహ్లి
Comments
Please login to add a commentAdd a comment