ఇంగ్లండ్‌తో తొలి వన్డే.. సచిన్‌ వరల్డ్‌ రికార్డుపై కన్నేసిన కోహ్లి | Virat Kohli eyes Sachin Tendulkar's historic 19-year-old ODI record | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌తో తొలి వన్డే.. సచిన్‌ వరల్డ్‌ రికార్డుపై కన్నేసిన కోహ్లి

Published Tue, Feb 4 2025 9:43 AM | Last Updated on Tue, Feb 4 2025 11:36 AM

Virat Kohli eyes Sachin Tendulkar's historic 19-year-old ODI record

స్వదేశంలో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇంగ్లండ్‌ను మట్టి కరిపించిన టీమిండియా.. ఇప్పుడు అదే జట్టుతో వన్డేల్లో తలపడేందుకు సిద్దమైంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 సన్నహాకాల్లో భాగంగా భారత జట్టు ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి వన్డే నాగ్‌పూర్ వేదికగా గురువారం(ఫిబ్రవరి 6) జరగనుంది.

 ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే నాగ్‌పూర్‌కు చేరుకున్న ఇరు జట్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ వన్డే సిరీస్‌కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి, రిషబ్ పంత్‌, శ్రేయస్ అయ్యర్ వంటి స్టార్ ఆట‌గాళ్లు జ‌ట్టులోకి తిరిగొచ్చారు. మ‌రోవైపు ఇంగ్లండ్ జ‌ట్టులోకి సీనియ‌ర్ ఆట‌గాడు జో రూట్ ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ మ్యాచ్‌కు ముందు విరాట్ కోహ్లికి ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది.

స‌చిన్ రికార్డుపై క‌న్నేసిన కోహ్లి..
నాగ్‌పూర్ వ‌న్డేలో కోహ్లి మ‌రో 96 ర‌న్స్‌ చేస్తే.. అత్యంత‌వేగంగా వ‌న్డేల్లో 14,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆట‌గాడిగా విరాట్ రికార్డుల‌కెక్కుతాడు. ప్ర‌స్తుతం ఈ రికార్డు భార‌త క్రికెట్ దిగ్గ‌జం  సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. స‌చిన్ త‌న‌ 350వ వన్డే ఇన్నింగ్స్‌లో పాకిస్తాన్‌పై ఈ ఫీట్‌ను అందుకున్నాడు. 

కోహ్లి విష‌యానికి వ‌స్తే.. 283 వన్డే ఇన్నింగ్స్‌లలో 58.18 సగటుతో 13906 పరుగులు చేశాడు. స‌చిన్ త‌ర్వాతి స్ధానంలో శ్రీలంక లెజెండ్ కుమార్ సంగక్కర ఉన్నాడు. సంగ్క‌ర 378 ఇన్నింగ్స్‌ల‌లో  14,000 ప‌రుగుల మైలు రాయిని సాధించాడు. ఈ క్ర‌మంలో తొలి వ‌న్డేల్లో వీరిద్ద‌రి దిగ్గ‌జాల‌ను కోహ్లి అధిగ‌మించే అవ‌కాశ‌ముంది. కాగా వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌-2023 త‌ర్వాత కోహ్లి కేవ‌లం మూడు వ‌న్డేలు మాత్ర‌మే ఆడాడు. 

ఆ మూడు మ్యాచ్‌ల్లో 19.33 సగటుతో 58 (24, 14 మరియు 20)పరుగులు చేశాడు. అయితే కోహ్లి ప్ర‌స్తుతం చెప్పుకొద‌గ్గ ఫామ్‌లో అయితే లేడు. ఆస్ట్రేలియాతో జ‌రిగిన టెస్టు సిరీస్‌లో తీవ్ర నిరాశ‌ప‌రిచిన కోహ్లి.. 12 ఏళ్ల త‌ర్వాత రంజీ ట్రోఫీ బ‌రిలోకి కూడా దిగాడు. అక్క‌డ కూడా కింగ్ కోహ్లి నిరాశ‌ప‌రిచాడు. కేవ‌లం 6 ప‌రుగులు మాత్ర‌మే చేసి ఔట‌య్యాడు. దీంతో క‌నీసం ఇంగ్లండ్‌తో వ‌న్డే సిరీస్‌తోనైనా కోహ్లి త‌న ఫామ్‌ను అందుకోవాల‌ని అతడి అభిమానులు ఆశిస్తున్నారు.

జట్లు
భారత్: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా

ఇంగ్లండ్: హ్యారీ బ్రూక్, బెన్ డకెట్, జోరూట్, జాకోబ్ బెతెల్, లియామ్ లివింగ్‌స్టోన్, బ్రైడన్ కార్స్, జేమీ ఓవర్టన్, జోస్ బట్లర్, జేమీ స్మిత్, ఫిలిప్ సాల్ట్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, సకీబ్ మహ్మూద్, మార్క్ వుడ్.
చదవండి: సూర్యకుమార్‌.. అందుకు సమయం అసన్నమైంది: అశ్విన్‌
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement