ముంబైకి వారియర్స్‌ చెక్‌!  | WPL 2024: Defending Champion Mumbai Indians Lost By 7 Wickets, Check Score Details Inside- Sakshi
Sakshi News home page

WPL 2024 MI Vs UPW: ముంబైకి వారియర్స్‌ చెక్‌! 

Published Thu, Feb 29 2024 12:09 AM | Last Updated on Thu, Feb 29 2024 9:43 AM

Defending champion Mumbai Indians lost - Sakshi

7 వికెట్లతో యూపీ గెలుపు 

కిరణ్‌ నవ్‌గిరే ధనాధన్‌ ఫిఫ్టీ 

బెంగళూరు: మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) రెండో సీజన్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ను యూపీ వారియర్స్‌ నిలువరించింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో యూపీ ఓపెనర్‌ కిరణ్‌ నవ్‌గిరే (31 బంతుల్లో 57; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ స్వరూపాన్ని ఒంటిచేత్తో మార్చేసింది. దీంతో 7 వికెట్లతో గెలిచిన వారియర్స్‌ ఈ సీజన్‌లో బోణీకొట్టింది.

మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. ఓపెనర్‌ హేలీ మాథ్యూస్‌ (47 బంతుల్లో 55; 9 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధసెంచరీ సాధించింది. మరో ఓపెనర్‌ యస్తిక భాటియా (22 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్‌)తో కలిసి తొలి వికెట్‌కు 50 పరుగులు జోడించింది. కెపె్టన్‌ నట్‌సీవర్‌ బ్రంట్‌ (19; 2 ఫోర్లు), అమెలియా కెర్‌ (23; 1 ఫోర్, 1 సిక్స్‌) పెద్దగా మెరిపించలేకపోయారు.

 అనంతరం యూపీ వారియర్స్‌ 16.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. ఓపెనర్లు కిరణ్‌ నవ్‌గిరే, కెపె్టన్‌ అలిసా హీలీ (29 బంతుల్లో 33; 5 ఫోర్లు) చెలరేగారు. ఇద్దరు తొలి వికెట్‌కు 9 ఓవర్లలోనే 94 పరుగులు జోడించి గెలిచేందుకు అవసరమైన పునాదిని మెరుపు వేగంతో వేశారు.

అయితే స్వల్ప వ్యవధిలో కిరణ్‌తో పాటు తాహ్లియా మెక్‌గ్రాత్‌ (1), కెపె్టన్‌ హీలీ నిష్క్రమించారు. కానీ తర్వాత వచ్చిన గ్రేస్‌ హారిస్‌ (17 బంతుల్లో 38 నాటౌట్‌; 6 ఫోర్లు, 1 సిక్స్‌), దీప్తిశర్మ (20 బంతుల్లో 27 నాటౌట్‌; 4 ఫోర్లు) ధాటిగా ఆడి మ్యాచ్‌ను ముగించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement