
మహిళల ప్రీమియర్ లీగ్-2025లో ప్లే ఆఫ్స్ బెర్త్‌లు ఖారారు అయ్యాయి. ఈ మెగా ఈవెంట్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ జట్లు ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టాయి. పాయింట్ల పట్టికలో ఆఖరి రెండు స్ధానాల్లో నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, యూపీ వారియర్స్ ఇంటిముఖం పట్టాయి.
కాగా శనివారం యూపీతో తప్పకగెలవాల్సిన మ్యాచ్‌లో ఆర్సీబీ 12 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో మరోమ్యాచ్ మిగులూండగానే టోర్నీ నుంచి మంథాన సేన నిష్క్రమించింది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ గెలిచి ఉండింటే తమ ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండేవి.
డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన ఆర్సీబీ ఈ ఏడాది సీజన్‌లో దారుణ ప్రదర్శన కనబరిచింది. ప్రస్తుత సీజన్‌లో 7 మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ.. ఐదింట ఓటమిపాలైంది. ముఖ్యంగా ఈ ఏడాది ఎడిషన్‌లో ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంథాన దారుణ ప్రదర్శన కనబరిచింది. 7 మ్యాచ్‌లు ఆడి ఆమె కేవలం 144 పరుగులు మాత్రమే సాధించింది.
ఇక పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో ఉన్న జట్టు నేరుగా ఫైనల్‌కు ఆర్హత సాధిస్తోంది. ఆ తర్వాత రెండు మూడు స్ధానాల్లో ఉన్న జట్లు ఎలిమినేటర్ మ్యాచ్‌లో తలపడాల్సి ఉంటుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ 10 పాయింట్లతో టాప్ ప్లేస్‌లో ఉంది.
ఢిల్లీ జట్టు తమ లీగ్ మ్యాచ్‌లన్నీ ఆడేసింది. ఆ తర్వాత స్ధానాల్లో గుజరాత్ జెయింట్స్(8 పాయింట్లు), ముంబై ఇండియన్స్(8) ఉన్నాయి. గుజరాత్‌కు కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే మిగిలి ఉండగా.. ముంబై ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.
ముంబై తమ ఆఖరి రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్ధానానికి చేరుకునే ఛాన్స్ ఉంది. ముంబై తమ చివరి రెండు లీగ్ మ్యాచ్‌లు వరుసగా మార్చి 10న గుజరాత్ జెయింట్స్, మార్చి 11న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఆడనుంది. మార్చి 13న ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుండగా.. మార్చి 15న ముంబై వేదికగా తుదిపోరు జరగనుంది.
చదవండి: IML 2025: యువరాజ్, రాయుడు విధ్వంసం..సెమీస్‌కు చేరిన టీమిండియా
Comments
Please login to add a commentAdd a comment