
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025లో తొలి సూపర్ ఓవర్‌కు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికైంది. గురువారం ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్తాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపించింది. ఇరు జట్లు సమవుజ్జీలగా పోటీ పడిన ఈ మ్యాచ్ ఫలితాన్ని సూపర్ ఓవర్‌లో తేల్చారు. సూపర్ ఓవర్‌లో రాజస్తాన్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విక్టరీ సాధించింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. అనంతరం రాజస్తాన్ కూడా సరిగ్గా 188 పరుగులే చేసింది. దీంతో మ్యాచ్ టై సూపర్ ఓవర్‌కు దారి తీసింది. సూపర్ ఓవర్‌లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ 11 పరుగులు చేసింది.
రెండు రనౌట్లు అయ్యి నాలుగు బంతులే ఆడి తమ ఇన్నింగ్స్‌ను ముగించింది. ఆ తర్వాత ఢిల్లీ 12 పరుగుల టార్గెట్‌ను నాలుగు బంతుల్లోనే ఫినిష్ చేసింది. కాగా ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ రిటైర్డ్ రిటైర్డ్ హర్ట్ అయ్యాడు.
189 పరుగుల లక్ష్య చేధనలో సంజూ అద్బుతమైన టచ్‌లో కన్పించాడు. యశస్వి జైశ్వాల్‌తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. కానీ అనుహ్యంగా శాంసన్ గాయపడ్డాడు. 6 ఓవర్ వేసిన విప్రజ్ నిగమ్ బౌలింగ్‌లో శాంసన్ కట్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. అతను బంతిని మిస్ అయ్యాడు.
వెంటనే శాంసన్ తన పక్కటెముకల నొప్పితో బాధపడ్డాడు. వెంటనే ఫిజియో వచ్చి అతడికి చికిత్స అందించాడు. ఆ తర్వాతి బంతిని ఆడిన శాంసన్.. పరిగెత్తడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. ఈ క్రమంలోనే రిటైర్డ్ హర్ట్‌గా మైదానాన్ని వెనుదిరిగాడు. అనంతరం సూపర్ ఓవర్‌లో కూడా బ్యాటింగ్, ఫీల్డింగ్‌కు సంజూ రాలేదు. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత శాంసన్ తన గాయంపై అప్‌డేట్ ఇచ్చాడు.
"ప్రస్తుతం బాగానే ఉన్నాను. ఇప్పుడు మరీ అంత నొప్పిగా లేదు. కానీ ఆ సమయంలో తిరిగి వచ్చి బ్యాటింగ్ చేయడానికి సిద్ధంగా లేను. మా తర్వాతి మ్యాచ్‌కు ఇంకా రెండు రోజుల సమయం ఉంది. అంతలో పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తాను" అని శాంసన్ ధీమా వ్యక్తం చేశాడు.. శాంసన్ కేవలం 19 బంతుల్లోనే 31 పరుగులు చేశాడు.