ఆర్సీబీతో మ్యాచ్‌.. ఢిల్లీ జట్టులోకి స్టార్‌ ప్లేయర్లు | WPL 2025 DCW vs RCBW: Rcb won the toss, Elected to Feld Frist, Playing XI | Sakshi
Sakshi News home page

WPL 2025: ఆర్సీబీతో మ్యాచ్‌.. ఢిల్లీ జట్టులోకి స్టార్‌ ప్లేయర్లు

Published Mon, Feb 17 2025 7:41 PM | Last Updated on Mon, Feb 17 2025 8:25 PM

WPL 2025 DCW vs RCBW: Rcb won the toss, Elected to Feld Frist, Playing XI

మ‌హిళ‌ల ప్రీమియ‌ర్ లీగ్‌-2025లో భాగంగా వ‌డోద‌ర వేదిక‌గా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఓ మార్పుతో బ‌రిలోకి దిగింది.

ప్రేమ రావత్ స్ధానంలో స్పిన్న‌ర్ ఏక్తా బిస్త్ తుది జ‌ట్టులోకి వ‌చ్చింది. అదేవిధంగా ఢిల్లీ క్యాపిట‌ల్స్ రెండు మార్పులు చేసింది. నికీ ప్ర‌సాద్‌, కాప్సే స్ధానాల్లో మారిజాన్ కాప్,జెస్ జోనాసెన్ తుది జ‌ట్టులోకి వ‌చ్చారు. కాగా ఈ రెండు జ‌ట్లు కూడా త‌మ తొలి మ్యాచ్‌ల్లో విజ‌యం సాధించాయి. ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి టోర్నీలో ముందుకు వెళ్లాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి.

తుది జట్లు
ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ ఎలెవన్‌: మెగ్ లానింగ్ (కెప్టెన్‌​), షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, అనాబెల్ సదర్లాండ్, జెస్ జోనాసెన్, మారిజాన్ కాప్, సారా బ్రైస్ (వికెట్ కీపర్‌), శిఖా పాండే, రాధా యాదవ్, అరుంధతి రెడ్డి, మిన్ను మణి

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయింగ్ ఎలెవన్‌: స్మృతి మంధాన(కెప్టెన్‌), డానియెల్ వ్యాట్-హాడ్జ్, ఎల్లీస్ పెర్రీ, రఘ్వీ బిస్ట్, రిచా ఘోష్(వికెట్ కీపర్‌), కనికా అహుజా, జార్జియా వేర్‌హామ్, కిమ్ గార్త్, ఏక్తా బిష్త్, జోషిత VJ, రేణుకా ఠాకూర్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement