
మహిళల ప్రీమియర్ లీగ్-2025లో భాగంగా వడోదర వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఓ మార్పుతో బరిలోకి దిగింది.
ప్రేమ రావత్ స్ధానంలో స్పిన్నర్ ఏక్తా బిస్త్ తుది జట్టులోకి వచ్చింది. అదేవిధంగా ఢిల్లీ క్యాపిటల్స్ రెండు మార్పులు చేసింది. నికీ ప్రసాద్, కాప్సే స్ధానాల్లో మారిజాన్ కాప్,జెస్ జోనాసెన్ తుది జట్టులోకి వచ్చారు. కాగా ఈ రెండు జట్లు కూడా తమ తొలి మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి టోర్నీలో ముందుకు వెళ్లాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి.
తుది జట్లు
ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ ఎలెవన్: మెగ్ లానింగ్ (కెప్టెన్), షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, అనాబెల్ సదర్లాండ్, జెస్ జోనాసెన్, మారిజాన్ కాప్, సారా బ్రైస్ (వికెట్ కీపర్), శిఖా పాండే, రాధా యాదవ్, అరుంధతి రెడ్డి, మిన్ను మణి
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయింగ్ ఎలెవన్: స్మృతి మంధాన(కెప్టెన్), డానియెల్ వ్యాట్-హాడ్జ్, ఎల్లీస్ పెర్రీ, రఘ్వీ బిస్ట్, రిచా ఘోష్(వికెట్ కీపర్), కనికా అహుజా, జార్జియా వేర్‌హామ్, కిమ్ గార్త్, ఏక్తా బిష్త్, జోషిత VJ, రేణుకా ఠాకూర్
Comments
Please login to add a commentAdd a comment