
ముంబై ఇండియన్స్‌పై ఘనవిజయం
మెగ్ లానింగ్, షఫాలీ మెరుపులు
రాణించిన జెస్ జొనాసెన్, మిన్ను మణి
బెంగళూరు: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 టోర్నమెంట్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. బౌలర్ల సమష్టి కృషికి ఓపెనర్లు మెగ్ లానింగ్, షఫాలీ వర్మ మెరుపులు తోడవడంతో శుక్రవారం జరిగిన పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 9 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది.
హర్మన్‌ప్రీత్ (16 బంతుల్లో 22; 2 ఫోర్లు, 1 సిక్స్), హేలీ మాథ్యూస్ (22; 4 ఫోర్లు), సివర్ బ్రంట్ (18), అమేలియా కెర్ (17), అమన్‌జ్యోత్ కౌర్ (17) తలా కొన్ని పరుగులు చేశారు. ఢిల్లీ బౌలర్లలో జెస్ జొనాసెన్, మిన్ను మణి చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ 14.3 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 124 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ మెగ్ లానింగ్ (49 బంతుల్లో 60 నాటౌట్; 9 ఫోర్లు), ఓపెనర్ షఫాలీ వర్మ (28 బంతుల్లో 43; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగారు.
వీరిద్దరూ తొలి వికెట్‌కు 85 పరుగులు జోడించారు. షఫాలీ అవుటయ్యాక జెమీమా రోడ్రిగ్స్ (15 నాటౌట్; 2 ఫోర్లు)తో కలిసి మెగ్ లానింగ్ లాంఛనాన్ని పూర్తి చేసింది. ముంబై బౌలర్లలో అమన్‌జ్యోత్ కౌర్ ఏకైక వికెట్ పడగొట్టింది. జెస్ జొనాసెన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. లీగ్‌లో 6 మ్యాచ్‌లాడిన ఢిల్లీ క్యాపిటల్స్ 4 విజయాలు, 2 పరాజయాలతో 8 పాయింట్లు ఖాతాలో వేసుకొని అగ్రస్థానానికి దూసుకెళ్లింది.
5 మ్యాచ్‌ల్లో 3 విజయాలు, 2 పరాజయాలతో 6 పాయింట్లు సాధించిన ముంబై ఇండియన్స్ పట్టిక రెండో స్థానంలో ఉంది. నేడు జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) తలపడుతుంది.
స్కోరు వివరాలు
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: యస్తిక భాటియా (సి) సారా (బి) శిఖ 11; హేలీ మాథ్యూస్ (సి) షఫాలీ వర్మ (బి) అనాబెల్ 22; సివర్ బ్రంట్ (సి అండ్ బి) జెస్ జొనాసెన్ 18; హర్మన్‌ప్రీత్ (ఎల్బీడబ్ల్యూ) (బి) జెస్ జొనాసెన్ 22; అమేలియా కెర్ (సి) అనాబెల్ (బి) మిన్ను 17; సజన (సి) లానింగ్ (బి) మిన్ను 5; అమన్‌జ్యోత్ (నాటౌట్) 17; కమలిని (బి) జెస్ జొనాసెన్ 1; సంస్కృతి గుప్తా (సి) జెమీమా (బి) మిన్ను 3; కలిత (రనౌట్) 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 123. వికెట్ల పతనం: 1–35, 2–35, 3–73, 4–83, 5–100, 6–101, 7–104, 8–115, 9–123. బౌలింగ్: మరిజానె కాప్ 3–0–16–0; శిఖ పాండే 4–1–16–1; జెస్ జొనాసెన్ 4–0–25–3; అనాబెల్ సదర్లాండ్ 4–0–21–1; టిటాస్ సాధు 2–0–24–0; మిన్ను మణి 3–0–17–3.
ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: మెగ్ లానింగ్ (నాటౌట్) 60; షఫాలీ వర్మ (సి) అమేలియా కెర్ (బి) అమన్‌జ్యోత్ 43; జెమీమా రోడ్రిగ్స్ (నాటౌట్) 15; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (14.3 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి) 124. వికెట్ల పతనం: 1–85; బౌలింగ్: షబ్నమ్ ఇస్మాయిల్ 4–0–26–0; సివర్ బ్రంట్ 2–0–27–0; హేలీ మాథ్యూస్ 2–0–16–0; అమేలియా కెర్ 2–0–20–0; అమన్‌జ్యోత్ కౌర్ 2–0–12–1; సంస్కృతి గుప్తా 1.3–0–14–0; కలిత 1–0–9–0.
Comments
Please login to add a commentAdd a comment