
మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును మరోసారి దురదృష్టం వెంటాడింది. డబ్ల్యూపీఎల్-2025లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఫైనల్లో 8 పరుగుల తేడాతో ఢిల్లీ ఓటమి పాలైంది. దీంతో వరుసగా మూడోసారి ఫైనల్‌కు చేరిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు మరోసారి నిరాశే ఎదురైంది.
ఇక ఈ ఫైనల్ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లలో ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ హర్మన్‌ప్రీత్ కౌర్ (44 బంతుల్లో 66; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్ కాగా... నాట్ సివర్ బ్రంట్ (28 బంతుల్లో 30; 4 ఫోర్లు) రాణించింది.
కాప్ పోరాడినా..
అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 141 పరుగులకు పరిమితమైంది. లక్ష్య చేధనలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు శుభారంభం లభించలేదు. ఓపెనర్లు లానింగ్(13), షెఫాలీ వర్మ(4) ఆదిలోనే పెవిలియన్‌కు చేరారు. ఆ సమయంలో రోడ్రిగ్స్(30) కాసేపు అలరించింది.
ఓ దశలో 67 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి ఢిల్లీ కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన ఆల్‌రౌండర్ మరిజాన్ కాప్ ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురుదాడికి దిగింది. బౌండరీల వర్షం కురిపిస్తూ ఢిల్లీని విజయానికి దగ్గరగా తీసుకువెళ్లింది. ఆమె క్రీజులో ఉండడంతో ఢిల్లీ విజయం లాంఛనమే అంతా భావించారు.
అయితే 18 ఓవర్‌లో కాప్ భారీ షాట్‌కు ప్రయత్నించి తన వికెట్ కోల్పోవడంతో ఒక్కసారిగా మ్యాచ్ ముంబై వైపు మలుపు తిరిగిపోయింది. తర్వాత వచ్చిన బ్యాటర్లు ఢిల్లీని గెలిపించలేకపోయారు. కాప్ (26 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40 పరుగులు చేసింది. అంతకుముందు బౌలింగ్‌లోనూ రెండు వికెట్లతో సత్తాచాటింది.
కన్నీళ్లు పెట్టుకున్న కాప్..
ఇక ఈ ఓటమి అనంతరం కాప్ భావోద్వేగానికి లోనైంది. మ్యాచ్ ముగిసిన తర్వాత మైదానంలోకి వచ్చిన కాప్ కన్నీళ్లు పెట్టుకుంది. సహచరులు కాప్‌ను ఓదర్చారు. ఆమెతో కెప్టెన్ మెగ్ లానింగ్ సైతం కంటితడి పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్‌కు అభిమానులు సపోర్ట్‌గా నిలుస్తున్నారు. ఓడినా మీరు మా మనసులు గెలిచారు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.
DC lost 3rd Consecutive Final of wpl
Feeling sad for #DC #WPL2025Final #WPLFinal pic.twitter.com/Kyk6ehqScu— Rajkumar Saini (@Dr_Raj23) March 16, 2025
3 seasons, 3 finals and 3 losses in final
Feel for Delhi 🥲 @wplt20 @DelhiCapitals #WPLFinal #WPL2025 pic.twitter.com/TBxGn8CIoJ— Psycho Naidu (@eshwarnaidu5313) March 15, 2025
Comments
Please login to add a commentAdd a comment