
మహిళల ప్రీమియర్ లీగ్-2025లో భాగంగా రెండో మ్యాచ్‌లో వడోదరగా వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ ఉమెన్స్, ముంబై ఇండియన్స్ ఉమెన్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్ టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ మెగ్ లానింగ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
ఈ మ్యాచ్‌తో భారత మహిళల జట్టు అండర్-19 కెప్టెన్ నికీ ప్రసాద్ ఢిల్లీ క్యాపిటల్స్ తరపున డబ్ల్యూపీల్ అరంగేట్రం చేసింది. ఇటీవల జరిగిన మహిళల అండర్-19 ప్రపంచకప్‌లో 17 ఏళ్ల నికీ అద్బుతమైన ప్రదర్శన కనబరిచింది. ఆమె సారథ్యంలోనే భారత్ విశ్వవిజేతగా నిలిచింది.
మరోవైపు స్కాట్లాండ్ వికెట్ కీపర్ బ్యాటర్ సారా జెన్నిఫర్ బ్రైస్ కూడా ఢిల్లీ తరపున డబ్ల్యూపీఎల్‌లోకి అడుగుపెట్టింది. అదేవిధంగా హర్మాన్ ప్రీత్ కౌర్ కెప్టెన్‌గా తన 150వ మ్యాచ్ ఆడనుంది. హర్మాన్ ముంబై సారథిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
తుది జట్లు
ఢిల్లీ క్యాపిటల్స్ ఉమెన్ ప్లేయింగ్ ఎలెవన్: మెగ్ లానింగ్ (కెప్టెన్), షఫాలీ వర్మ, అలిస్ క్యాప్సీ, జెమిమా రోడ్రిగ్స్, అన్నాబెల్ సదర్లాండ్, నికి ప్రసాద్, సారా జెన్నిఫర్ బ్రైస్ (వికెట్ కీపర్), శిఖా పాండే, అరుంధతి రెడ్డి, మిన్ను మణి, రాధా యాదవ్
ముంబై ఇండియన్స్ ఉమెన్ ప్లేయింగ్ : యాస్తికా భాటియా (వికెట కీపర్), హేలీ క్రిస్టెన్ మాథ్యూస్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), నాట్ స్కివర్-బ్రంట్, అమేలియా కెర్, సజీవన్ సజన, అమంజోత్ కౌర్, జింటిమణి కలితా, సంస్కృతి గుప్తా, షబ్నిమ్ ఇస్మాయిల్, సైకా ఇషాక్