
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL)- 2025లో భాగంగా శనివారం ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ థ్రిల్లర్ సినిమాను తలపించింది. నువ్వానేనా అన్నట్లుగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆఖరి బంతికి ఢిల్లీ క్యాపిటల్స్ విజయాన్ని అందుకుంది.
ముంబై నిర్ధేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి చేధించింది. అయితే ఈ మ్యాచ్‌లో రనౌట్‌పై థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయం తీవ్ర వివాదస్పదమైంది. సోషల్ మీడియా వేదికగా థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని నెటిజన్లు తప్పుబడుతున్నారు.
అసలేం జరిగిందంటే?
ఢిల్లీ విజయానికి ఆఖరి బంతికి రెండు పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో ముంబై స్పిన్నర్ సజనా వేసిన వేసిన బంతిని ఢిల్లీ బ్యాటర్ అరుందతి రెడ్డి కవర్స్ మీదగా షాట్ ఆడింది. అయితే షాట్ సరిగ్గా కనక్ట్ కాకపోవడంతో బంతి గాల్లోకి లేచింది. అక్కడే ఉన్న హర్మన్‌ప్రీత్ కౌర్ వెనక్కి పరుగెత్తి క్యాచ్‌ను అందుకునే ప్రయత్నం చేసింది.
కానీ బంతికి కిందకు సరైన సమయంలోకి చేరకపోవడంతో క్యాచ్‌ను అందకులేకపోయింది. వెంటనే బంతిని వికెట్ కీపర్ వైపు త్రో చేసింది. వికెట్ కీపర్ బాటియా దానిని అందుకొని వికెట్లను గిరాటేసింది. అప్పటికే అరుందతి రెండో పరుగు పూర్తి చేసుకుని స్టైకర్ ఎండ్‌వైపు వచ్చేసింది. కానీ స్టంప్స్‌ను వికెట్ కీపర్ గిరాటేయడంతో ఫీల్డ్ అంపైర్‌లు థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేశారు.
రిప్లేలో తొలుత వికెట్ కీపర్ బంతిని స్టంప్స్‌కు తాకించినప్పుడు లైట్లు వెలిగాయి. అప్పటికి ఆమె ఇంకా క్రీజులోకి చేరుకోలేదు. కానీ బెయిల్స్ పడేటప్పటికి మాత్రం అరుందతి క్రీజులోకి వచ్చినట్లు కన్పించింది. దీంతో థర్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని నాటౌట్‌గా ప్రకటించింది. దీంతో ముంబై ప్లేయర్లు షాక్ అయ్యారు. అంతకుముందు కూడా ఈ మ్యాచ్‌లో ఇటువంటి సంఘనటనలు రెండు చోటు చేసుకున్నాయి. అప్పుడు కూడా థర్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించారు.
రూల్స్ ఏమి చెబుతున్నాయి..
నిబంధన 29.1 ప్రకారం.. అంపైర్ రిప్లేలను పరిశీలిస్తున్నప్పుడు బ్యాటర్ క్రీజులోకి వచ్చేసారి జింగ్ బెయిల్స్ స్టంప్స్ నుంచి పైకి లేచేయా లేదా అన్నది మొదటి ఫ్రేమ్‌గా పరిగణించాలి. రెండో ఫ్రేమ్‌లో బెయిల్స్ పూర్తిగా స్టంప్స్‌తో సంబంధం కోల్పోయో లేదో చూడాలి.
చివరగా లైట్లు వెలిగినా బెయిల్స్ విడిపోయినప్పుడు మాత్రమే దానిని రనౌట్‌గా భావించాలి. బెయిల్స్ పడకుండా ఉంటే మాత్రం దానిని ఔట్‌గా పరిగణించరు. ఇప్పుడు ఢిల్లీ-ముంబై మ్యాచ్‌లో ఇదే జరిగింది. వికెట్ కీపర్ బంతిని స్టంప్స్‌ను తాకించినా.. బ్యాటర్ వచ్చే సమయానికి బెయిల్స్ కిందపడలేదు. అందుకే థర్డ్ అంపైర్‌గా ఔట్‌గా ప్రకటించారు.
— Lolzzz (@CricketerMasked) February 15, 2025
Comments
Please login to add a commentAdd a comment