న్యూయార్క్: భారత సంతతికి చెందిన ఓ విద్యార్థి అమెరికాలో జరిగిన క్విజ్ పోటీలో లక్ష డాలర్ల (దాదాపు రూ. 66 లక్షలు) ప్రైజ్ మనీ గెలుచుకున్నాడు. బ్రౌన్ యూనివర్సిటీలో ప్రజారోగ్యం, ఆర్థిక శాస్త్రం కోర్సు తొలి ఏడాది చదువుతున్న ధ్రువ్ గౌర్ అనే యువకుడు జియోపార్డీ కాలేజ్ చాంపియన్‌షిప్ పేరుతో జరిగిన ఈ పోటీలో బహుమతి గెలుపొందాడు.
మరో 14 మందితో కలిసి పోటీలో పాల్గొన్న అతను శుక్రవారం విజేతగా నిలిచాడు. ఈ విజయంతో అతను ‘టోర్నమెంట్ ఆఫ్ చాంపియన్స్’ అనే మరో క్విజ్ పోటీలో పాల్గొనేందుకూ అర్హత సాధించాడు. జార్జియా రాష్ట్రానికి చెందిన ధ్రువ్ గతంలోనూ అనేక పోటీలు, ప్రవేశపరీక్షల్లో ప్రతిభ చాటాడు. అత్యంత తెలివైన వాళ్లయిన 14 మందిని ఓడించి తాను ఈ పోటీలో గెలుస్తానని తొలుత అస్సలు అనుకోలేదంటూ ధ్రువ్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment