విడుదలైన కేవలం రెండు నెలల్లోనే వంద కోట్లమంది యూజర్లతో ప్రపంచాన్ని చుట్టేసిన చాట్‌జీపీటీ గురించి దాదాపు అందరికి తెలుసు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ టెక్నాలజీతో ఎన్నెన్నో అద్భుతాలు చేస్తున్న చాట్‌జీపీటీ యూజర్లకు 'ఓపెన్ఏఐ' (OpenAI) కంపెనీ ఒక బంపర్ ఆఫర్ ప్రకటించింది.
కంపెనీ తెలిపిన సమాచారం ప్రకారం, చాట్‌జీపీటీలో ఎదురయ్యే సమస్యలను గుర్తించి చెప్పిన వారికి 20,000 డాలర్లు బహుమతిగా అందిస్తామని తెలుస్తోంది. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం ఇది సుమారు రూ. 16 లక్షల కంటే ఎక్కువే. ఈ కొత్త ప్లాట్‌ఫామ్‌లో బగ్‌లను గుర్తించి పరిష్కరించే కార్యక్రమంలో భాగంగానే ప్రోగ్రామర్స్, ఎథికల్ హ్యాకర్స్‌ను ప్రోత్సహిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.
ప్రోగ్రామర్స్ లేదా ఎథికల్ హ్యాకర్స్ చాట్‌జీపీటీలో గుర్తించే బగ్ తీవ్రతను బట్టి బహుమతి ఉంటుంది. దీనికోసం ఓపెన్ ఏఐ బగ్ బౌంటీ ప్రోగ్రామ్ మంగళవారం నుంచి మొదలైంది. ఇందులో తక్కువ బహుమతి 200 డాలర్లు కాగా (రూ. 16,000 కంటే ఎక్కువ), గరిష్టంగా 20,000 డాలర్ల వరకు బహుమతి పొందవచ్చు. మీరు గుర్తించే బగ్ మీ ప్రైజ్ మనీని డిసైడ్ చేస్తుంది.
టెక్నాలజీ ఇండస్ట్రీలో ఇలాంటి బగ్స్ గుర్తించడం సులభమే, కానీ సాఫ్ట్‌వేర్ సిస్టమ్స్‌లో బగ్ గుర్తించడం కష్టంతో కూడుకున్న పనే అనిచెబుతున్నారు. అయితే గతంలో సాఫ్ట్‌వేర్ సిస్టమ్స్‌లో కూడా బగ్స్ గుర్తించి బహుమతులు పొందిన సందర్భాలు చాలానే ఉన్నాయి.
(ఇదీ చదవండి: బీకామ్ డ్రాప్ అవుట్.. బిజినెస్ టేకప్: ప్రియాంక్ సుఖిజా సక్సెస్ స్టోరీ)
చాట్‌జీపీటీ ఏ విధంగా పనిచేస్తోందని పరిశీలించి ఇందులో ఏదైనా సమస్య లోపాలను గుర్తించినప్పుడు కంపెనీ దానిని పరిష్కరిస్తుంది. అయితే ప్రస్తుతం చాట్‌జీపీటీ ఆదరణ ఎక్కువగా ఉన్నప్పటికీ యూజర్లు, వారి డేటాతో ఏ విధంగా డీల్స్ చేస్తుందనేదానిపై స్పష్టత లేదు. ప్రైవసీ రూల్స్‌ను అతిక్రమిస్తున్న కారణంగా ఇటలీలో దీనిని బ్యాన్ చేశారు. అంతే కాకుండా కొన్ని వ్యాపార కంపెనీలు, నిపుణులు దీనిని నిలిపివేయాలని ఇది రాబోయే రోజుల్లో ఎక్కువమంది మీద ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment