bug bounty programme
-
ఈ ఒక్కపని చేస్తే చాలు రూ. 16 లక్షలు గెలిచే ఛాన్స్.. డోంట్ మిస్!
విడుదలైన కేవలం రెండు నెలల్లోనే వంద కోట్లమంది యూజర్లతో ప్రపంచాన్ని చుట్టేసిన చాట్‌జీపీటీ గురించి దాదాపు అందరికి తెలుసు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ టెక్నాలజీతో ఎన్నెన్నో అద్భుతాలు చేస్తున్న చాట్‌జీపీటీ యూజర్లకు 'ఓపెన్ఏఐ' (OpenAI) కంపెనీ ఒక బంపర్ ఆఫర్ ప్రకటించింది. కంపెనీ తెలిపిన సమాచారం ప్రకారం, చాట్‌జీపీటీలో ఎదురయ్యే సమస్యలను గుర్తించి చెప్పిన వారికి 20,000 డాలర్లు బహుమతిగా అందిస్తామని తెలుస్తోంది. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం ఇది సుమారు రూ. 16 లక్షల కంటే ఎక్కువే. ఈ కొత్త ప్లాట్ఫామ్లో బగ్‌లను గుర్తించి పరిష్కరించే కార్యక్రమంలో భాగంగానే ప్రోగ్రామర్స్, ఎథికల్ హ్యాకర్స్‌ను ప్రోత్సహిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. ప్రోగ్రామర్స్ లేదా ఎథికల్ హ్యాకర్స్ చాట్‌జీపీటీలో గుర్తించే బగ్ తీవ్రతను బట్టి బహుమతి ఉంటుంది. దీనికోసం ఓపెన్ ఏఐ బగ్ బౌంటీ ప్రోగ్రామ్ మంగళవారం నుంచి మొదలైంది. ఇందులో తక్కువ బహుమతి 200 డాలర్లు కాగా (రూ. 16,000 కంటే ఎక్కువ), గరిష్టంగా 20,000 డాలర్ల వరకు బహుమతి పొందవచ్చు. మీరు గుర్తించే బగ్ మీ ప్రైజ్ మనీని డిసైడ్ చేస్తుంది. టెక్నాలజీ ఇండస్ట్రీలో ఇలాంటి బగ్స్ గుర్తించడం సులభమే, కానీ సాఫ్ట్వేర్ సిస్టమ్స్‌లో బగ్ గుర్తించడం కష్టంతో కూడుకున్న పనే అనిచెబుతున్నారు. అయితే గతంలో సాఫ్ట్వేర్ సిస్టమ్స్‌లో కూడా బగ్స్ గుర్తించి బహుమతులు పొందిన సందర్భాలు చాలానే ఉన్నాయి. (ఇదీ చదవండి: బీకామ్ డ్రాప్ అవుట్.. బిజినెస్ టేకప్: ప్రియాంక్ సుఖిజా సక్సెస్ స్టోరీ) చాట్‌జీపీటీ ఏ విధంగా పనిచేస్తోందని పరిశీలించి ఇందులో ఏదైనా సమస్య లోపాలను గుర్తించినప్పుడు కంపెనీ దానిని పరిష్కరిస్తుంది. అయితే ప్రస్తుతం చాట్‌జీపీటీ ఆదరణ ఎక్కువగా ఉన్నప్పటికీ యూజర్లు, వారి డేటాతో ఏ విధంగా డీల్స్ చేస్తుందనేదానిపై స్పష్టత లేదు. ప్రైవసీ రూల్స్‌ను అతిక్రమిస్తున్న కారణంగా ఇటలీలో దీనిని బ్యాన్ చేశారు. అంతే కాకుండా కొన్ని వ్యాపార కంపెనీలు, నిపుణులు దీనిని నిలిపివేయాలని ఇది రాబోయే రోజుల్లో ఎక్కువమంది మీద ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు. -
ట్విటర్ బంపర్ ఆఫర్..! బగ్ గుర్తిస్తే భారీ పారితోషికం..!
ట్విటర్ తన యూజర్లకోసం ఆసక్తికర పోటీను ఏర్పాటు చేసింది, ట్విట్టర్లో యూజర్ల డేటాకు సంబంధించి తాను అందిస్తున్న సెక్యూరిటీపై తనకు తానే ఛాలెంజ్ విసురుకుంది. ట్విటర్లోని లోపాలను గుర్తిస్తే ఏకంగా రెండున్నర లక్షల రూపాయల బహుమతి అందిస్తామని ప్రకటించింది. హ్యాకర్లకు సవాల్ తమ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అల్గారిథంలో బగ్‌ను గుర్తిస్తే నగదు బహుమతిని అందిస్తామని ట్విటర్ ప్రకటించింది. బగ్ బౌంటీ ప్రోగ్రాంను ప్రవేశపెట్టడం ట్విటర్‌కి ఇదే తొలిసారి. ఈ ఏడాది హ్యాకర్ కన్వెన్షన్ ఈవెంట్‌ను డెఫ్ కాన్ ఏఐ (DEF CON AI) విలేజ్‌లో ఈ పోటీ జరగనుంది. ఈ విషయాన్ని తన బ్లాగ్ పోస్ట్‌లో ట్విటర్ ప్రకటించింది. మెషిన్ లెర్నింగ్ అల్గారిథం మోడళ్లలోని లోపాలను కనుగొనడం చాలా కష్టమని, హ్యాకర్లకు ఇదో సవాల్ అని పేర్కొంది. దాన్ని స్వీకరించి లోపాలను పట్టిస్తే భారీ బహుమతి ముట్టచెబుతామంది. యూజర్ల మేలు కోసమే కంపెనీకి చెందిన ముఖ్యమైన అల్గారిథం, ఇమేజ్ క్రాపింగ్ అల్గారిథంలోని లోపాన్ని గుర్తించడానికి ట్విట్టర్ ఈ పోటీని మేలోనే ప్రకటించింది. అంతేకాకుంగా అందుకు సంబంధించిన కోడ్‌ను యూజర్లకు అందుబాటులో ఉంచింది. యూజర్లను ప్రోత్సహించడం ద్వారా అల్గారిథంలో ఉన్న లోపాలను గుర్తిస్తేనే పరిష్కరించడం సులువు అవుతుందని ట్విటర్ పేర్కొంది. అందుకే యూజర్లను హ్యాకింగ్ నుంచి రక్షించడానికే ఈ పోటీ పెడుతున్నామంది. గోల్డెన్ ఛాన్స్ ఏథికల్ హ్యాకర్లు, రిసెర్చ్ కమ్యూనిటీ డెవలపర్లకు ఈ పోటీ సువర్ణావకాశమని ట్విటర్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ పోటీలతో విస్తృత స్థాయిలోని సమస్యలను గుర్తించడంలో సహాయపడుతుందని ట్విటర్ తెలిపింది. భారీ బహుమతి ట్విటర్ బిగ్ బౌంటీ ప్రోగ్రాంలో భాగంగా లోపాలను గుర్తించిన మొదటి, రెండో, మూడో స్థానాల్లో నిలిచిన వ్యక్తులకు వరుసగా $ 3,500 (సుమారు రూ. 2,60,242), $ 1,000 (సుమారు రూ. 74,369), $ 500 (సుమారు రూ. 37,184) నగదు బహుమతులను ట్విటర్ అందించనుంది. ట్విటర్ ఆగస్టు 8న డేఫ్ కాన్ ఏఐ విలేజ్‌లో హోస్ట్ చేస్తోన్న వర్క్ షాప్‌లో విజేతలను ప్రకటించనుంది. ఈ పోటీలో పాల్గొనే ఔత్సాహికులకు 2021 ఆగస్టు 6 వరకు ఎంట్రీలు చేయవచ్చును. -
బగ్ బగ్ దెయ్యం.. పట్టుకుంటే చాలు డబ్బులే డబ్బులు!
సూర్యచంద్రులు భూమి మీద కాకుండా ఆకాశంలో ఎందుకు ఉంటారో తెలుసా? బెడ్‌బగ్(నల్లి) బాధ భరించలేకే’ అంటాడు కవి చమత్కారంగా.‘బెడ్ బగ్’ సంగతి సరే, మరి ‘కంప్యూటర్ బగ్’ మాటేమిటి? అది బగ్ కాదు దెయ్యం అంటే కాదనేదేముంది!ఈ దెయ్యాన్ని చూసి పారిపోవాల్సిన పనిలేదు...పట్టుకుంటే చాలు డబ్బులే డబ్బులు! మనం ఒక అందమైన ఇల్లు కట్టుకున్నాం. ‘ఏ లోపం లేకుండా సకల జాగ్రత్తలు తీసుకున్నాం’ అని మురిసిపోతాం. ‘కాకి పిల్ల కాకికి ముద్దు’ అన్నట్లుగా మన ఇల్లు మనకు ముద్దుగానే కనిపించి ఏ లోపాన్ని కనిపించనివ్వదు. ‘మా ఇంటి నిర్మాణంలో లోపం కనిపెడితే డబ్బులు ఇస్తాం’ అని ఆ ఇంటియజమాని ప్రకటించాడు. అప్పుడు ఎవరో ఒకరు వచ్చి ‘ఇదిగో ఫలాన చోట లోపం ఉంది’ అని చూపించారనుకోండి, సదరు యజమాని ఆ వ్యక్తికి నజరానా ఇస్తాడు. ఇలాగే... సైబర్ క్రిమినల్స్ చొరబడకుండా ఉండేందుకు ప్రముఖ టెక్‌కంపెనీలు సెక్యూరిటీ ప్రోగ్రామ్స్‌ను అప్డేట్ చేస్తుంటాయి. అయినప్పటికీ ఎక్కడో ఒకచోట మిస్టేక్స్ జరుగుతూనే ఉంటాయి. ఈ లోపాలను కనిపెట్టిన వారికి కంపెనీలు నగదు బహుమతిని ఇస్తుంటాయి. ‘బగ్ బౌంటి’పై యూత్ ఆసక్తి చూపుతుంది. బహుమతుల గెలుపులో ‘యువతరం’ ముందుంటుంది. మైక్రోసాఫ్ట్,ఫేస్బుక్, యాహూ, మోజిల్లా కార్పోరేషన్, స్క్వైర్... మొదలైన దిగ్గజ సంస్థలు ‘బగ్‌బౌంటీ’లో భాగంగా కొంత మొత్తాన్ని కేటాయిస్తున్నాయి. మరోవైపు ‘యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్’లాంటి ఏజెన్సీలు కూడా ‘బగ్ బౌంటీ’లు ప్రకటిస్తున్నాయి. సింగపూర్ గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ(ఐసీటి)కి సంబంధించిన 13 విభాగాలలో ‘బగ్ బౌంటీ’ పథకం క్రింద ఆకర్షణీయమైన బహుమతులు ప్రకటించింది. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ‘బగ్‌బౌంటీ’ ప్రోగ్రాం క్రింద వందకోట్లకు పైగా కేటాయించింది. 58 దేశాల్లో 340 మంది రివార్డ్‌లను గెలుచుకున్నారు. గూగుల్ బగ్‌బౌంటీ రివార్డ్స్ కోసం 50 కోట్లకు పైగా కేటాయించింది. 62 దేశాల్లో 662 మంది రివార్డ్‌లు గెలుచుకున్నారు. బగ్ హంటర్స్ కోసం గూగుల్ ఇటీవలే బగ్హంటర్స్.గూగుల్.కామ్ అనే కొత్త ప్లాట్‌ఫామ్‌ను ప్రకటించింది. మన దేశం విషయానికి వస్తే...మహారాష్ట్రకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి మయూర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ‘బగ్’ కనిపెట్టి 22 లక్షలకు పైగా బహుమతిని గెలుచుకున్నాడు. ఇరవై సంవత్సరాల సెల్ఫ్–టాట్ సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ ఆదిత్సింగ్ (దిల్లీ) మైక్రోసాఫ్ట్ అజ్యూర్స్ క్లౌడ్ప్లాట్ఫామ్లో ఆర్సీయి (రిమోట్కోడ్ ఎగ్జిక్యూషన్) బగ్‌ను కనిపెట్టి 22 లక్షల పైచిలుకు బహుమతిని గెలుచుకుంది. చెన్నైకి చెందిన లక్ష్మణ్ ముత్తయ్య మైక్రోసాప్ట్ ‘ఐడెంటిటీ బౌంటీ ప్రోగ్రాం’లో సుమారు 22 లక్షలకు పైగా గెలుచుకున్నాడు. మధురైకి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి టీకే కిశోర్ ఫేస్బుక్లో ప్రైవసీకి భంగం కలిగించే బగ్‌ను కనిపెట్టి లక్ష రూపాయల వరకు గెలుచుకున్నాడు. 22 లక్షలు ఎక్కడా? లక్ష రూపాయలు ఎక్కడా? అని ఆశ్చర్యపోతున్నారా! విషయమేమిటంటే ‘బగ్’ను కనిపెట్టగానే లక్షలకు లక్షలు ఇస్తారని కాదు. ‘బగ్’ వల్ల ఎంత ఎక్కువ ముప్పు ఉంది? అనేదాన్ని బట్టే బహుమతి మొత్తం ఆధారపడి ఉంటుంది. టెక్నాలజీలో కొమ్ములు తిరిగిన వారు మాత్రమే బౌంటీలో బహుమతులు గెలుచుకోవడం లేదు. ఆసక్తి ఉండి, అది అధ్యయనంగా మారి, విశ్లేషణ సామర్థ్యం, సృజనతో సెల్ఫ్–టాట్ సైబర్ ఎక్స్‌పర్ట్‌లుగా తమను తాము మలుచుకున్న అదితిలాంటి వారు ఎందరో ఉన్నారు. ‘మాకు కాస్తో కూస్తో తెలుసు. ఇంకా తెలుసుకోవాలని ఉంది’ అని ఆశించేవారి కోసం ఆన్లైన్ బగ్‌బౌంటీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇక మీదే ఆలస్యం. -
గూగుల్ బంపర్ ఆఫర్, వేలుకాదు కోట్లు చెల్లిస్తాం
గూగుల్ యూజర్లకు శుభవార్త చెప్పింది. వేర్ బిలిటీ రివార్డ్ ప్రోగ్రాం (వీఆర్పీ)ప్రోగ్రాంలో భాగంగా లక్షలు కాదు కోట్లు చెల్లిస్తామని ప్రకటించింది. గూగుల్‌లో లోపాల్ని(బగ్) గుర్తించిన వారికి వీఆర్పీ -2022 లో భాగంగా రూ.29 మిలియన్ల డాలర్లకు పైగా చెల్లించినట్లు..11 సంవత్సరాల వ్యవధిలో గూగుల్‌కు చెందిన టూల్స్‌లో 11,055 మిస్టేక్స్ గుర్తించినట్లు.. అందుకుగాను రూ.218 కోట్ల బహుమతి అందించినట్లు తెలిపింది. అదే సమయంలో ఈ వీఆర్పీ ప్రోగ్రాంలో మార్పులు చేస్తున్నట్లు చెప్పింది. వీఆర్పీ ప్రోగ్రాంకు బదులు 'బగ్ హంటర్' పేరుమీద కొత్త వెబ్ సైట్‌ను లాంచ్ చేసింది. తద్వారా గూగుల్‌కు చెందిన గూగుల్ సెర్చ్ ఇంజిన్, ఆండ్రాయిడ్, గూగుల్ క్రోమ్, గూగుల్ ప్లేస్టోర్లలో ఎర్రర్స్ గుర్తించవచ్చని, ఆ ప్రాసెస్ అంతా ఈ వెబ్సైట్ ద్వారా జరుగుతున్నట్లు చెప్పింది. అంతేకాదు గామిఫికేషన్ సాఫ్ట్వేర్ వ్యవస్థను గూగుల్ డెవలప్ చేయాలని భావిస్తోంది.అదే సమయంలో గామిఫికేషన్‌లో ఎర్రర్స్‌ను గుర్తించిన వారికి 'అవార్డులు, బ్యాడ్జ్‌లను' కేటాయిస్తుంది. అంతేకాదు జాబ్ చేయాలనుకుంటే వీఆర్పీ బృందంతో కలిసి పనిచేయోచ్చని కంపెనీ తెలిపింది. 84దేశాల్లో గూగుల్ తొలిసారి వీఆర్పీ ప్రోగ్రాంను అందుబాటులోకి తెచ్చినప్పుడు ఆయా అప్లికేషన్స్‌లో ఎన్ని ఎర్రర్స్ గుర్తిస్తారనే విషయంపై అవగాహనలేదు. కానీ తొలిసారి వీఆర్పీ సభ్యులు సహకారంతో 0-20 ఎర్రర్స్ ను గుర్తిస్తారనే అంచనా ఉంది. కానీ అనూహ్యంగా 25 బగ్‌లను గుర్తించి అంచనాల్ని తల్లకిందులు చేసినట్లు గూగుల్ తన బ్లాగ్ లో ప్రస్తావించింది. కాగా, బగ్స్ ను గుర్తించేందుకు 84 దేశాల్లో పెయిడ్ రీసెర్చర్స్ ఉన్నట్లు స్పష్టం చేసింది. అంతేకాదు కొత్తగా మార్పులు చేసిన ఈ వీఆర్పీ ప్రోగ్రాం ద్వారా ఔత్సాహికులు తమ స్కిల్స్‌ను డెవలప్ చేసుకోవచ్చని సూచించింది. -
ఆ సైట్‌ను హ్యాక్ చేస్తే 1,50,000 డాలర్లు
వాషింగ్టన్: అమెరికా రక్షణ శాఖ (డీవోడి) తన సైబర్ సెక్యూరిటీ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉందో పరీక్షించాలనుకుంటోంది. దీని కోసం హ్యాకర్లను ఆహ్వానిస్తోంది. తమ సైబర్ సెక్యూరిటీ వ్యవస్థను హ్యాక్‌చేసి అందులో లోపాలను కనిపెట్టిన వారికి 1,50,000 డాలర్ల రివార్డును ప్రకటించింది. తమ ఈ ‘బగ్ బౌంటీ ప్రోగ్రామ్’ ఏప్రిల్ 18వ తేదీ నుంచి ప్రారంభమై మే నెల 12వ తేదీ వరకు కొనసాగుతోందని, ఈ మధ్యకాలంలోనే హ్యాకర్లు తమ సైట్‌ను హ్యాక్ చేయాల్సి ఉంటుందని రక్షణ మంత్రి ఆశ్ కార్టర్ ఓ పత్రికా ప్రకటనలో తెలిపారు. అమెరికా సామాజిక భద్రత నెంబర్ ఉన్న హ్యాకర్లు మాత్రమే ఈ పోటీలో పాల్గొనాలని, వారి నేర చరితను పరిశీలించేందుకు కూడా అంగీకరించాలని షరతు విధించారు. తమ సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలో లోపాలను కనుగొనేందుకు ఫేస్బుక్, గూగుల్ లాంటి సంస్థలు కూడా ఇలాంటి బగ్ బౌంటీ పోటీలను నిర్వహించాయి. ఇటీవల ఊబర్ సంస్థ కూడా తమ టాక్స్ యాప్‌లో లోపాలను కనుగొనేందుకు ఇలాంటి పోటీనే ఆహ్వానించి పదివేల డాలర్ల రివార్డును ప్రకటించింది.