Google Announces New Bug Bounty Platform For Bug Hunters - Sakshi
Sakshi News home page

గూగుల్‌ బంపర్‌ ఆఫర్‌, వేలుకాదు కోట్లు చెల్లిస్తాం

Published Thu, Jul 29 2021 10:50 AM | Last Updated on Thu, Jul 29 2021 3:39 PM

Google Announces New Bug Hunter Platform - Sakshi

గూగుల్‌ యూజర్లకు శుభవార్త చెప్పింది. వేర్ బిలిటీ రివార్డ్ ప్రోగ్రాం (వీఆర్పీ)ప్రోగ్రాంలో భాగంగా లక్షలు కాదు కోట్లు చెల్లిస్తామని ప్రకటించింది. గూగుల్‌లో లోపాల్ని(బగ్‌) గుర్తించిన వారికి వీఆర్పీ -2022 లో భాగంగా రూ.29 మిలియన్ల డాలర్లకు పైగా చెల్లించినట్లు..11 సంవత్సరాల వ్యవధిలో గూగుల్‌కు చెందిన టూల్స్‌లో 11,055 మిస్టేక్స్‌ గుర్తించినట్లు.. అందుకుగాను రూ.218 కోట్ల బహుమతి అందించినట్లు తెలిపింది.

 
అదే సమయంలో ఈ వీఆర్పీ ప్రోగ్రాంలో మార్పులు చేస్తున్నట్లు చెప్పింది. వీఆర్పీ ప్రోగ్రాంకు బదులు 'బగ్‌ హంటర్‌' పేరుమీద కొత్త వెబ్‌ సైట్‌ను లాంచ్‌ చేసింది. తద్వారా  గూగుల్‌కు చెందిన గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌, ఆండ్రాయిడ్‌, గూగుల్‌ క్రోమ్‌, గూగుల్‌ ప్లేస‍్టోర్‌లలో ఎర్రర్స్‌ గుర్తించవచ్చని, ఆ ప్రాసెస్‌ అంతా ఈ వెబ్‌సైట్‌ ద్వారా జరుగుతున్నట్లు చెప్పింది.


అంతేకాదు గామిఫికేషన్ సాఫ్ట్‌వేర్‌ వ్యవస్థను గూగుల్‌ డెవలప్‌ చేయాలని భావిస్తోంది.అదే సమయంలో గామిఫికేషన్‌లో ఎర్రర్స్‌ను గుర్తించిన వారికి 'అవార్డులు, బ్యాడ్జ్‌లను'  కేటాయిస్తుంది. అంతేకాదు జాబ్‌ చేయాలనుకుంటే  వీఆర్పీ బృందంతో కలిసి పనిచేయోచ్చని కంపెనీ తెలిపింది.
84దేశాల్లో


గూగుల్‌ తొలిసారి వీఆర్పీ ప్రోగ్రాంను అందుబాటులోకి తెచ్చినప్పుడు ఆయా అప్లికేషన్స్‌లో ఎన్ని ఎర్రర్స్‌ గుర్తిస్తారనే విషయంపై అవగాహనలేదు. కానీ తొలిసారి వీఆర్పీ సభ్యులు సహకారంతో 0-20 ఎర్రర్స్‌ ను గుర్తిస్తారనే అంచనా ఉంది. కానీ అనూహ్యంగా 25 బగ్‌లను గుర్తించి అంచనాల్ని తల్లకిందులు చేసినట్లు గూగుల్‌ తన బ‍్లాగ్‌ లో ప్రస్తావించింది. కాగా, బగ్స్‌ ను గుర్తించేందుకు 84 దేశాల్లో పెయిడ్‌ రీసెర‍్చర్స్‌ ఉన్నట్లు స్పష్టం చేసింది. అంతేకాదు కొత్తగా మార్పులు చేసిన ఈ వీఆర్పీ ప్రోగ్రాం ద్వారా ఔత్సాహికులు తమ స్కిల్స్‌ను డెవలప్‌ చేసుకోవచ్చని సూచించింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement