![ప్రొ కబడ్డీ లీగ్–5 విజేతకు రూ.3 కోట్లు](/styles/webp/s3/article_images/2017/09/5/61500148601_625x300.jpg.webp?itok=SjJl6GBF)
ప్రొ కబడ్డీ లీగ్–5 విజేతకు రూ.3 కోట్లు
మొత్తం ప్రైజ్‌మనీ రూ.8 కోట్లు
న్యూఢిల్లీ: తొలి సీజన్ నుంచి అనూహ్య ఆదరణతో దూసుకెళుతున్న ప్రొ కబడ్డీ లీగ్‌లో ఈసారి ప్రైజ్‌మనీ కూడా భారీగా పెరిగింది. గత సీజన్‌లో రూ.6 కోట్లుగా ఉన్న ఈ మొత్తం ఈసారి రూ. 8 కోట్లకు పెరిగింది. విజేతగా నిలిచిన జట్టు రూ.3 కోట్లు దక్కించుకుంటుంది. రన్నరప్‌కు రూ. కోటీ 80 లక్షలు లభిస్తాయి.
మూడో స్థానం పొందిన జట్టుకు రూ. కోటీ 20 లక్షలు అందజేస్తారు. ‘అత్యంత విలువైన ఆటగాడు’ అవార్డు పొందిన వారికి రూ.15 లక్షలు దక్కుతాయి. ఓవరాల్‌గా లీగ్‌లో 12 జట్ల మధ్య 138 మ్యాచ్‌లు జరుగుతాయి. ఈనెల 28న హైదరాబాద్‌లో మొదలయ్యే సీజన్ ఆరంభ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌తో తమిళ్ తలైవాస్ ఆడుతుంది. అక్టోబరు 28న ఫైనల్ జరుగుతుంది.