![Pro Kabaddi League Announces Season 10 Player Auction Dates - Sakshi](/styles/webp/s3/article_images/2023/07/4/HARYANA-GUJARAT1.gif.webp?itok=AqhdHB0z)
ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్ కోసం ఆటగాళ్ల వేలం కార్యక్రమం సెప్టెంబర్ 8, 9వ తేదీల్లో ముంబైలో జరగనుంది. స్వదేశీ, విదేశీ ఆటగాళ్లను ‘ఎ’, ‘బి’, ‘సి’, ‘డి’ కేటగిరీలుగా విభజించారు. ‘ఎ’ కేటగిరీలో ఉన్న వారి కనీస ధర రూ. 30 లక్షలుగా... ‘బి’ కేటగిరీ ప్లేయర్లకు కనీస ధర రూ. 20 లక్షలు... ‘సి’ కేటగిరీ ఆటగాళ్ల కనీస ధర రూ. 13 లక్షలుగా... ‘డి’ కేటగిరీ క్రీడాకారుల కనీస ధర రూ. 9 లక్షలుగా నిర్ణయించారు.
వేలంలో 500కుపైగా క్రీడాకారులు బరిలో ఉన్నారు. తొమ్మిదో సీజన్‌లో పాల్గొన్న ఆటగాళ్లలో ఆరుగురిని అట్టిపెట్టుకునే సౌలభ్యం ఆయా ఫ్రాంచైజీలకు ఉంది. మొత్తం 12 జట్లు ఈ లీగ్‌లో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment