కబడ్డీ మ్యాచ్‌కు కోహ్లి.. | Kohli to attend Pro Kabaddi Match | Sakshi
Sakshi News home page

కబడ్డీ మ్యాచ్‌కు కోహ్లి..

Published Fri, Jul 26 2019 1:35 PM | Last Updated on Fri, Jul 26 2019 1:36 PM

Kohli to attend Pro Kabaddi Match - Sakshi

ముంబై: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి శనివారం ముంబైలో జరుగనున్న ప్రొ కబడ్డీ మ్యాచ్‌కు ముఖ్య అతిథిగా హాజరుకానున్నాడు.  ఈ మేరకు కోహ్లి షెడ్యూల్‌ ఖరారైనట్లు ప్రొ కబడ్డీ నిర్వాహకులు మీడియాకు వెల్లడించారు. ముంబై వేదికగా యు ముంబై-పుణెరి పల్టాన్‌ల మధ్య జరుగనున్న మ్యాచ్‌కు కోహ్లి హాజరు కానున్నట్లు తెలిపారు.

ప్రపంచకప్‌లో సెమీస్‌ నుంచి టీమిండియా వైదొలిగిన తర్వాత స్వదేశానికి చేరుకున్న కోహ్లి.. త్వరలో చేపట్టబోయే వెస్టిండీస్‌ పర్యటన సైతం మూడు ఫార్మాట్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. విండీస్‌ పర్యటన నుంచి విశ్రాంతి తీసుకుంటాడని తొలుత భావించారు. కాగా, అందుకు సంబంధించి కోహ్లి ఎటువంటి స్పష్టత ఇవ్వకపోవడంతో అతన్నే కెప్టెన్‌గా నియమిస్తూ బీసీసీఐ సెలక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 3 నుంచి వెస్టిండీస్‌తో నెల రోజుల పాటు మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టు మ్యాచ్‌లు టీమిండియా ఆడనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement