ప్రొ కబడ్డీ విజేత జైపూర్ పాంథర్స్
- ఫైనల్లో 35-24తో ముంబై పై గెలుపు
- అభిషేక్ జట్టుకు రూ. 50 లక్షల ప్రైజ్‌మనీ
ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ టైటిల్ పోరులో బాలీవుడ్ స్టార్ అభిషేక్ బచ్చన్ జట్టు జైపూర్ పింక్ పాంథర్స్ దుమ్మురేపింది. ఆదివారం ముంబై లోని ఎన్‌ఎస్‌సీఐ స్టేడియుంలో జరిగిన ఫైనల్లో 35-24 తేడాతో యు ముంబ జట్టును చిత్తు చేసి విజేతగా నిలిచింది. వునీందర్ సింగ్ 7 రైడ్ పాయింట్లు, రాజేశ్ నర్వాల్ 5 రైడ్ పాయింట్లు సాధించి జట్టు విజయుంలో కీలకపాత్ర పోషించారు.
ముంబై కెప్టెన్ అనూప్ కువూర్ (11 రైడ్ పాయింట్లు) ఊహించినట్లే తన స్థాయికి తగ్గ ప్రదర్శనను కనబర్చాడు. అయితే జైపూర్ జట్టు డిఫెండింగ్ ద్వారా 13 పాయింట్లు సాధించి తవుకు తిరుగులేదని నిరూపించింది. తొలి అర్ధభాగం ఆరంభంలో జైపూర్ పాంథర్స్, ముంబై మధ్య హోరాహోరీ పోరు సాగింది. 4-2తో ముంబై ఆరంభంలో ఆధిక్యంలో ఉన్నా... ఆ తర్వాత పాంథర్స్ పుంజుకుని 8-6తో సత్తా చాటింది.
ద్వితీయూర్ధంలోనూ జైపూర్ పాంథర్స్ అదే జోరును కొనసాగించి చాంపియున్‌గా నిలిచింది. వుూడో స్థానం కోసం జరిగిన పోరులో పాట్నా పైరేట్స్ 29-22తో బెంగళూరు బుల్స్‌పై నెగ్గింది. విజేతగా నిలిచిన జైపూర్‌కు రూ. 50 లక్షల ప్రైజ్‌వునీ దక్కింది. రన్నరప్ ముంబై రూ. 25 లక్షలు, సెమీ ఫైనలిస్టులు పాట్నా పైరేట్స్, బెంగళూరు బుల్స్ జట్లు రూ. 12.5 లక్షల చొప్పున సొంతం చేసుకున్నాయి.