బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ 30–28 తేడాతో దబంగ్ ఢిల్లీపై విజయం సాధించింది. మరో పోరులో తమిళ్ తలైవాస్ 45–26 స్కోరుతో హర్యానా స్టీలర్స్‌ను చిత్తు చేసింది.
రెండో రౌండ్‌కు ప్రజ్నేశ్
భారత ఆటగాడు ప్రజ్నేశ్ గుణేశ్వరన్ ఆస్ట్రేలియన్ ఓపెన్ క్వాలిఫయింగ్ టోర్నీలో రెండో రౌండ్‌లోకి ప్రవేశించాడు. సోమవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో ప్రజ్నేశ్ 6–4, 6–3తో మూడో సీడ్ డానియెల్ ఇలాహి గలాన్ (కొలంబియా)ను ఓడించాడు. 73 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో ప్రజ్నేశ్ 6 ఏస్‌లు కొట్టాడు. తర్వాతి పోరులో అతను మ్యాక్సిమిలియన్ మార్టెరర్ (జర్మనీ)తో తలపడతాడు.
Comments
Please login to add a commentAdd a comment