Pink Panthers
-
తలైవాస్, పాంథర్స్ మ్యాచ్ టై
హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్లో వరుసగా రెండో మ్యాచ్ టైగా ముగిసింది. ఆఖరు రెయిడ్ వరకు ఉత్కంఠ రేపిన జైపూర్ పింక్ పాంథర్స్, తమిళ్ తలైవాస్ మ్యాచ్ 30-30తో టైగా ముగిసింది. హైదరాబాద్‌లోని జిఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో ఆదివారం జరిగిన ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్ లీగ్ దశ మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్, జైపూర్ పింక్ పాంథర్స్ సమవుజ్జీలుగా నిలిచి పాయింట్లను సమంగా పంచుకున్నాయి. జైపూర్ పింక్ పాంథర్స్ ఆటగాళ్లలో అర్జున్ (7 పాయింట్లు), వికాశ్ (6 పాయింట్లు), రెజా (3 పాయింట్లు), అంకుశ్ ( 4 పాయింట్లు) రాణించారు. తమిళ్ తలైవాస్ శిబిరం నుంచి సచిన్ (11 పాయింట్లు), నరేందర్ (3 పాయింట్లు) ఆకట్టుకునే ప్రదర్శన చేశారు. ప్రథమార్థంలో ఐదు పాయింట్ల వెనుకంజలో నిలిచిన తలైవాస్.. సచిన్ సూపర్ టెన్ షోతో ద్వితీయార్థంలో గొప్పగా పుంజుకుంది. జైపూర్ చేజేతులా విజయాన్ని దూరం చేసుకోగా.. తలైవాస్ ఓటమి నుంచి తప్పించుకుంది.జైపూర్ సమిష్టిగా.. :గత మ్యాచ్‌లో హర్యానా స్టీలర్స్ చేతిలో ఓడిన జైపూర్ పింక్ పాంథర్స్.. తమిళ్ తలైవాస్‌తో మ్యాచ్‌ను దూకుడుగా ఆరంభించింది. ఆరంభం నుంచి రెయిడింగ్‌లో, డిఫెన్స్‌లో పాయింట్లు సాధిస్తూ ఆధిక్యం నిలుపుకుంది. తొలి 20 నిమిషాల ఆట అనంతరం జైపూర్ పింక్ పాంథర్స్ 21-16తో ముందంజ వేసింది. ఐదు పాయింట్లతో తలైవాస్‌పై పైచేయి సాధించింది. తలైవాస్ రెయిడర్లు సచిన్, నరేందర్‌లు మూడేసి బోనస్ పాయింట్లు సాధించగా జైపూర్‌కు పోటీ ఇవ్వగలిగింది. జైపూర్‌లో అర్జున్ దేశ్వాల్కు వికాశ్, రెజా, అంకుశ్‌లు సహకరించారు. దీంతో పింక్ పాంథర్స్ ప్రథమార్థంలో విలువైన ఆధిక్యం సొంతం చేసుకుంది.పుంజుకున్న తలైవాస్ విరామ సమయం అనంతరం జైపూర్ పింక్ పాంథర్స్ నెమ్మదించగా.. తమిళ్ తలైవాస్ వరుసగా పాయింట్లు ఖాతాలో వేసుకుంది. కానీ జైపూర్ పింక్ పాంథర్స్ ఆధిక్యాన్ని నిలుపుకుంది. సచిన్ సూపర్ రెయిడ్‌కు తోడు విశాల్ సక్సెస్ఫుల్ రెయిడ్‌తో మరో మూడు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా 26-29తో పాయింట్ల అంతరాన్ని కుదించిన తమిళ్ తలైవాస్ ఆఖరు వరకు రేసులోనే నిలిచింది. ఆఖర్లో కూతలో, పట్టులో అదరగొట్టిన తలైవాస్ స్కోరు సమం చేసింది. సక్సెస్ఫుల్ రెయిడ్‌తో అంతరాన్ని ఓ పాయంట్‌కు కుదించి.. ఆఖరు కూతకు వచ్చిన జైపూర్ రెయిడర్ రెజాను అవుట్ చేసింది. దీంతో 30-30తో స్కోరు సమమైంది. -
జైపూర్, తలైవాస్ విజయం
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ 30–28 తేడాతో దబంగ్ ఢిల్లీపై విజయం సాధించింది. మరో పోరులో తమిళ్ తలైవాస్ 45–26 స్కోరుతో హర్యానా స్టీలర్స్‌ను చిత్తు చేసింది. రెండో రౌండ్‌కు ప్రజ్నేశ్ భారత ఆటగాడు ప్రజ్నేశ్ గుణేశ్వరన్ ఆస్ట్రేలియన్ ఓపెన్ క్వాలిఫయింగ్ టోర్నీలో రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. సోమవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో ప్రజ్నేశ్ 6–4, 6–3తో మూడో సీడ్ డానియెల్ ఇలాహి గలాన్ (కొలంబియా)ను ఓడించాడు. 73 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో ప్రజ్నేశ్ 6 ఏస్‌లు కొట్టాడు. తర్వాతి పోరులో అతను మ్యాక్సిమిలియన్ మార్టెరర్ (జర్మనీ)తో తలపడతాడు. -
తలైవాస్‌కు తొలి విజయం
నాగపూర్: ప్రొ కబడ్డీ లీగ్‌లో సచిన్ జట్టు తమిళ్ తలైవాస్‌కు మొదటి విజయం దక్కింది. బెంగళూరు బుల్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో తలైవాస్ 29–24తో బెంగళూరు బుల్స్‌పై నెగ్గింది. వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిన అనంతరం తమిళ్ జట్టు గెలుపు బోణీ చేయడం విశేషం. తలైవాస్ తరఫున కె. ప్రపంజన్ (6), అమిత్ హుడా (4) ఆకట్టుకున్నారు. బుల్స్ జట్టులో రోహిత్ కుమార్ (12) ఒంటరి పోరాటం చేశాడు. పింక్ పాంథర్స్ కూడా... ఐదో సీజన్లో జైపూర్ పింక్ పాంథర్స్ జట్టు తొలి విజయాన్ని సాధించింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో 30–28తో పుణేరి పల్టన్‌ను ఓడించింది. పుణేరి జట్టులో రైడర్ సందీప్ నర్వాల్ అత్యధికంగా 9 పాయింట్లు స్కోర్ చేశాడు. రోహిత్ చౌదరి 4 పాయింట్లు సాధించాడు. జైపూర్ జట్టు తరఫున మంజీత్ ఛిల్లర్ 9, జస్వీర్ సింగ్ 5 పాయింట్లు స్కోర్ చేశారు. -
ఆరంభం ఉత్కం‘టై’
♦ హైదరాబాద్‌లో అదిరిపోయిన ప్రొ కబడ్డీ ఆరంభం ♦ తెలుగు టైటాన్స్, పింక్ పాంథర్స్ మ్యాచ్ డ్రా సాక్షి, హైదరాబాద్ : తారళ తళుకులు... మిరుమిట్లు గొలిపే కాంతులు... నరాలు తెగే ఉత్కంఠతో ఆట... వెరసి హైదరాబాద్‌లో ప్రొ కబడ్డీ లీగ్‌కు అదిరిపోయే ఆరంభం లభించింది. అయితే గెలుపు అవకాశాన్ని ఆతిథ్య టైటాన్స్ జట్టు చేజార్చుకుంది. జైపూర్ పింక్ పాంథర్స్‌తో గచ్చిబౌలి స్టేడియంలో మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌ను 39-39తో డ్రాగా ముగించింది. హోరా హోరీగా సాగిన ఈ మ్యాచ్ ద్వారా ఇరు జట్లు మూడేసి పాయింట్లు సాధించాయి. మరో మ్యాచ్‌లో యు ముంబా 29-25 పాయింట్ల స్కోరుతో ఢిల్లీ దబాంగ్స్‌ను చిత్తు చేసింది. తొలి అర్ధభాగంలో టైటాన్స్ జోరు పింక్ పాంథర్స్‌తో మ్యాచ్‌లో తొలి అర్ధభాగం తెలుగు జట్టు అద్భుతంగా ఆడి ఆకట్టుకుంది. దీపక్ తొలి పాయింట్ అందించగా... సుకేశ్ హెగ్డే సూపర్ రైడ్‌తో ఒకేసారి మూడు పాయింట్లు తెచ్చాడు. ఇదే జోరులో జైపూర్‌ను ఆలౌట్ చేసి 10-2 ఆధిక్యంలోకి వెళ్లారు. మరోవైపు పాంథర్స్ ఆటగాడు రాజేశ్ నర్వాల్ వరుసగా రైడింగ్ పాయింట్లు తెస్తూ ఆ జట్టును కాపాడే ప్రయత్నం చేశాడు. తొలి అర్ధభాగంలో తెలుగు జట్టు 20-12తో స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది. ద్వితీయార్ధంలో కోలుకున్న జైపూర్: మ్యాచ్ ద్వితీయార్ధంతో పాంథర్స్ ఆటగాడు సోనూ నర్వాల్ ఒక్కసారిగా చెలరేగి వరుసగా పాయింట్లు కొల్లగొట్టాడు. వరుసగా ఆరు రైడ్లలో అతను ఆరు పాయింట్లు సాధించడం విశేషం. డిఫెన్స్‌లో కూడా ఆ జట్టు అద్భుతంగా ఆడటంతో ఒక్కసారిగా పాయింట్ల తేడా తగ్గుతూ వచ్చింది. మరో 10 నిమిషాలు మ్యాచ్ మిగిలి ఉన్న దశలో టైటాన్స్ 29-21తో ఆధిక్యంలో ఉంది. అయితే ఆ తర్వాత జైపూర్ ఏకంగా 18 పాయింట్లు కొల్లగొట్టింది. ప్రత్యర్థిని ఆలౌట్ చేసి పాంథర్స్ దూకుడు ప్రదర్శించింది. 35వ నిమిషంలో స్కోరు సమం చేసిన జైపూర్... ఆ వెంటనే ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో టైటాన్స్ రెండో సారి ఆలౌట్ అయింది. 37-39తో వెనుకబడిన దశలో రాహుల్ వరుసగా రెండు రైడింగ్ పాయింట్లు సాధించి జట్టును రక్షించాడు. చివరి నిమిషంలో రైడ్‌కు వెళ్లిన జైపూర్ ఆటగాడు జస్వీర్ ప్రత్యర్థి ఆటగాడిని తాకినట్లుగా గట్టిగా వాదించినా అంపైర్లు ఆ పాయింట్లు తిరస్కరించడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. తెలుగు టైటాన్స్ జట్టులో రాహుల్ చౌదరి 14, సుకేశ్ హెగ్డే 9 పాయింట్లు స్కోర్ చేయగా...జైపూర్ తరఫున సోనూ నర్వాల్ 13, రాజేశ్ నర్వాల్ 7 పాయింట్లు సాధించారు. అర్జున్ జాతీయ గీతాలాపన ప్రొ కబడ్డీ లీగ్‌లో మ్యాచ్‌లు ఏ నగరంలో జరిగినా ప్రతి రోజూ జాతీయ గీతాన్ని ఆలపిస్తారు. హైదరాబాద్‌లో తొలి రోజు సినీ హీరో, తెలుగు టైటాన్స్ బ్రాండ్ అంబాసిడర్ అల్లు అర్జున్ జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్య క్రమంలో సినీ నటుడు శ్రీకాంత్, తెలుగు టైటా న్స్ యజమాని శ్రీనివాస్, జాతీయ కబడ్డీ సం ఘం అధ్యక్షుడు జనార్ధన్ సింగ్ గెహ్లోట్ పాల్గొ న్నారు. పలువురు సెలబ్రిటీలు, భారీ సంఖ్యలో అభి మానులు మ్యాచ్ చూడటానికి వచ్చారు. ప్రొ కబడ్డీ లీగ్‌లో నేడు తెలుగు టైటాన్స్ ఁ బెంగాల్ వారియర్స్ రా. గం. 8.00 నుంచి స్టార్‌స్పోర్ట్స్-2లో ప్రత్యక్ష ప్రసారం -
పుణేరి పల్టన్ బోణీ
బెంగాల్ వారియర్స్‌పై గెలుపు ప్రొ కబడ్డీ లీగ్-2 జైపూర్: బరిలో ఉన్న ఎనిమిది జట్లలో బోణీ కొట్టని జట్టుగా పేరున్న పుణేరి పల్టన్ ఎట్టకేలకు తొలి విజయాన్ని సాధించింది. ప్రొ కబడ్డీ లీగ్-2లో భాగంగా బెంగాల్ వారియర్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో పుణేరి పల్టన్ 33-29 పాయింట్ల తేడాతో గెలుపొందింది. దాంతో వరుసగా నాలుగు పరాజయాలకు బ్రేక్ వేస్తూ తమ ఖాతాలో తొలి విజయాన్ని జమచేసుకుంది. పాయింట్ల పట్టికలో చివరి రెండు స్థానాల్లో ఉన్న జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో పుణే జట్టుకు ప్రవీణ్ నివాలి తురుపుముక్కగా నిలిచాడు. ఆరంభంలో రెండు జట్లు హోరాహోరీగా తలపడినా... విరామ సమయానికి రెండు నిమిషాలముందు పుణే ఒక్కసారిగా విజృంభించింది. ప్రవీణ్ నివాలి రైడింగ్‌కు వెళ్లి ఒకేసారి మూడు పాయింట్లు సంపాదించడంతో పుణే 13-10తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత వజీర్ సింగ్ తన రైడింగ్‌లో రెండు పాయింట్లు సంపాదించడంతో పాటు బెంగాల్ ఆలౌట్ కావడంతో పుణే ఖాతాలో నాలుగు పాయింట్లు చేరాయి. విరామ సమయానికి పుణే 17-10తో ముందంజలో ఉంది. రెండో అర్ధభాగంలో పుణే ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంటూ విజయాన్ని ఖాయం చేసుకుంది. మరోవైపు డిఫెండింగ్ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఢిల్లీ దబాంగ్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో జైపూర్ జట్టు 27-35తో ఓడిపోయింది. ఈ సీజన్లో జైపూర్కిది ఐదో పరాజయం కావడం గమనార్హం. గురువారం జరిగే ఏకైక మ్యాచ్‌లో పట్నా పైరేట్స్‌తో తెలుగు టైటాన్స్ తలపడుతుంది. -
ఎట్టకేలకు నెగ్గిన జైపూర్
జైపూర్: వరుసగా నాలుగు పరాజయాలతో డీలా పడినట్లు కనిపించిన డిఫెండింగ్ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్ ఎట్టకేలకు బోణీ చేసింది. బెంగళూరు బుల్స్‌తో మంగళవారం జరిగిన ప్రొ కబడ్డీ లీగ్ మ్యాచ్‌లో జైపూర్ 36-23 పాయింట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. జస్వీర్ సింగ్, కుల్దీప్ సింగ్ రైడింగ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచి తమ జట్టుకు తొలి విజయాన్ని అందించారు. ఈ గెలుపుతో జైపూర్ జట్టు ఎనిమిది పాయింట్లతో లీగ్‌లో ఐదో స్థానంలో ఉంది. ఆరంభంలో బెంగళూరు దూకుడుగా ఆడి 15-10తో ఆధిక్యంలోకి వెళ్లింది. దాంతో జైపూర్‌కు మరో ఓటమి తప్పదా అనిపించింది. కానీ జైపూర్ ఆటగాళ్లు కుల్దీప్, జస్వీర్ తమ అనుభవాన్నంతా రంగరించి పోరాడారు. కుల్దీప్ ఒకే రైడ్‌లో మూడు పాయింట్లు సంపాదించి జైపూర్‌ను మళ్లీ మ్యాచ్‌లో నిలబెట్టాడు. ఆ తర్వాత ఇదే జోరును కొనసాగించిన జైపూర్ అనూహ్యంగా 29-20తో తొమ్మిది పాయింట్ల ఆధిక్యంలోకి వెళ్లింది. చివరిదాకా ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని విజయాన్ని ఖాయం చేసుకుంది. బుధవారం జరిగే మ్యాచ్‌ల్లో పుణేరి పల్టన్‌తో బెంగాల్ వారియర్స్; ఢిల్లీ దబాంగ్‌తో జైపూర్ పింక్ పాంథర్స్ తలపడతాయి. -
ప్రొ కబడ్డీ విజేత జైపూర్ పాంథర్స్
- ఫైనల్లో 35-24తో ముంబై పై గెలుపు - అభిషేక్ జట్టుకు రూ. 50 లక్షల ప్రైజ్‌మనీ ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ టైటిల్ పోరులో బాలీవుడ్ స్టార్ అభిషేక్ బచ్చన్ జట్టు జైపూర్ పింక్ పాంథర్స్ దుమ్మురేపింది. ఆదివారం ముంబై లోని ఎన్ఎస్సీఐ స్టేడియుంలో జరిగిన ఫైనల్లో 35-24 తేడాతో యు ముంబ జట్టును చిత్తు చేసి విజేతగా నిలిచింది. వునీందర్ సింగ్ 7 రైడ్ పాయింట్లు, రాజేశ్ నర్వాల్ 5 రైడ్ పాయింట్లు సాధించి జట్టు విజయుంలో కీలకపాత్ర పోషించారు. ముంబై కెప్టెన్ అనూప్ కువూర్ (11 రైడ్ పాయింట్లు) ఊహించినట్లే తన స్థాయికి తగ్గ ప్రదర్శనను కనబర్చాడు. అయితే జైపూర్ జట్టు డిఫెండింగ్ ద్వారా 13 పాయింట్లు సాధించి తవుకు తిరుగులేదని నిరూపించింది. తొలి అర్ధభాగం ఆరంభంలో జైపూర్ పాంథర్స్, ముంబై మధ్య హోరాహోరీ పోరు సాగింది. 4-2తో ముంబై ఆరంభంలో ఆధిక్యంలో ఉన్నా... ఆ తర్వాత పాంథర్స్ పుంజుకుని 8-6తో సత్తా చాటింది. ద్వితీయూర్ధంలోనూ జైపూర్ పాంథర్స్ అదే జోరును కొనసాగించి చాంపియున్‌గా నిలిచింది. వుూడో స్థానం కోసం జరిగిన పోరులో పాట్నా పైరేట్స్ 29-22తో బెంగళూరు బుల్స్‌పై నెగ్గింది. విజేతగా నిలిచిన జైపూర్‌కు రూ. 50 లక్షల ప్రైజ్‌వునీ దక్కింది. రన్నరప్ ముంబై రూ. 25 లక్షలు, సెమీ ఫైనలిస్టులు పాట్నా పైరేట్స్, బెంగళూరు బుల్స్ జట్లు రూ. 12.5 లక్షల చొప్పున సొంతం చేసుకున్నాయి. -
కార్పొరేట్ల కబడ్డీ కబడ్డీ ప్రారంభం
-
కార్పొరేట్ల కబడ్డీ కబడ్డీ..!
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్, హాకీ లీగ్, బ్యాడ్మింటన్ లీగ్ మొదలైన వాటి తర్వాత కార్పొరేట్లు ప్రస్తుతం కబడ్డీపై దృష్టి సారించారు. ఐపీఎల్ క్రికెట్ తరహాలోనే ప్రో కబడ్డీ లీగ్ (పీకేఎల్)కి శ్రీకారం చుట్టారు. కిషోర్ బియానీ మొదలుకుని రోనీ స్క్రూవాలా వ్యాపార దిగ్గజాలు దేశవాళీ కబడ్డీని ప్రోత్సహించే ప్రయత్నాల్లో పడ్డారు. ఇటీవలే జరిగిన పీకేఎల్ తొలి విడత వేలంలో కార్పొరేట్లు, బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ కూడా పోటీపడ్డారు. భారీ మొత్తాలు వెచ్చించి జాతీయ స్థాయి ఆటగాళ్లను దక్కించుకున్నారు. వేలంలో మొత్తం 96 మంది ప్లేయర్స్ కోసం ఎనిమిది టీమ్స్ పోటీపడ్డాయి. ఈ టీమ్‌లలో కోర్ గ్రీన్ గ్రూప్‌నకు చెందిన విశాఖపట్నం జట్టు, ఉదయ్ కోటక్ సారథ్యంలోని పుణే ఫ్రాంచైజీ, కాస్మిక్ గ్లోబల్ మీడియా నేతృత్వంలోని బెంగళూరు, యస్ బ్యాంక్ ఎండీ రాణా కపూర్ కుమార్తె రాధా కపూర్‌కి చెందిన ఢిల్లీ ఫ్రాంచైజీ, రోనీ స్క్రూవాలా సారథ్యంలోని ముంబై జట్టు ఉన్నాయి. అభిషేక్ బచ్చన్‌కి చెందిన జైపూర్ టీమ్, ఫ్యూచర్ గ్రూప్ అధినేత కిషోర్ బియానీకి చెందిన కోల్‌కతా ఫ్రాంచైజీ, వ్యాపారవేత్త రాజేష్ షా టీమ్‌లు కూడా వేలంలో పాల్గొన్నాయి. కామెంటేటర్ చారు శర్మ సారథ్యంలోని మషాల్ స్పోర్ట్స్ సంస్థ ఈ కాన్సెప్టునకు రూపకల్పన చేసింది. ఒక్కొక్క టీమ్‌పై గరిష్టంగా రూ. 60 లక్షలు మాత్రమే వ్యయం చేసేందుకు వీలుంటుంది. ప్లేయర్లతో ఫ్రాంచైజీలు రెండేళ్ల కాంట్రాక్టులు కుదుర్చుకుంటాయి. రెండేళ్ల తర్వాత.. ఫ్రాంచైజీలు ఇతరత్రా ప్లేయర్లను కూడా తీసుకోవడానికి వీలుంటుంది. జూలై 26న ప్రారంభమయ్యే లీగ్‌ను స్టార్ ఇండియా స్పోర్ట్స్ నెట్వర్క్ ప్రసారం చేయనుంది. ప్రతీ టీమ్ తన సొంత ఊరిలో నాలుగు గేమ్స్ ఆడుతుంది. పెట్టుబడి ఏటా 5 కోట్లు..: ఫ్రాంచైజీ ఫీజు, స్పోర్ట్ డెవలప్మెంట్ ఇన్వెస్ట్మెంట్లు, ఇతరత్రా వ్యయాలు కలిపి ఒక్కో ఫ్రాంచైజీ ఏటా సుమారు రూ. 5 కోట్లు దాకా వెచ్చించాల్సి వస్తుంది. పదేళ్ల పాటు ఫ్రాంచైజీ హక్కుల కోసం కార్పొరేట్లు ఏటా దాదాపు రూ. 1 కోటి నుంచి 1.5 కోట్ల దాకా వెచ్చిస్తున్నారు. టీమ్ స్పాన్సర్షిప్, గేట్ ఫీజు, ప్రైజ్ మనీ రూపంలో ఫ్రాంచైజీలు ఆదాయం సమకూర్చుకోవచ్చు. -
రాకేశ్ కుమార్‌కు రూ.12.80 లక్షలు
ప్రొ కబడ్డీ లీగ్ వేలం ముంబై: ఆసియా గేమ్స్‌లో రెండు సార్లు స్వర్ణాలు సాధించిన స్టార్ ఆటగాడు రాకేశ్ కుమార్‌కు ప్రొ కబడ్డీ వేలంలో అత్యధిక ధర పలికింది. మంగళవారం జరిగిన ఈ వేలంలో అభిషేక్ బచ్చన్‌కు చెందిన జైపూర్ ఫ్రాంచైజీ పింక్ పాంథర్స్ రూ.12.80 లక్షలకు రాకేశ్‌ను కొనుగోలు చేసుకుంది. 32 ఏళ్ల ఈ రైడర్ నార్తర్న్ రైల్వే ఉద్యోగి. 2006, 2010 ఆసియా గేమ్స్‌లో భారత కబడ్డీ జట్టు తరఫున పాల్గొన్నాడు. 2007 ప్రపంచకప్ గెలుచుకున్న జట్టు సభ్యుడు కూడా. వేలంలో రెండో అత్యధిక ధర... రైడర్ దీపక్ నివాస్‌కు దక్కింది. రూ.12.60 లక్షలకు విశాఖపట్నం ఫ్రాంచైజీ తెలుగు టైటాన్స్ ఈ ఆటగాడిని తీసుకుంది. అందుబాటులో ఉన్న నలుగురు పాక్ ఆటగాళ్ల నుంచి అతిఫ్ వహీద్, వాజిద్ అలీలను నాలుగు లక్షల చొప్పున తెలుగు టైటాన్స్ కొనుగోలు చేసుకుంది. ఈ వేలానికి 13 దేశాల నుంచి 96 మంది ఆటగాళ్లు అందుబాటులో ఉండగా బరిలో ఉన్న ఎనిమిది జట్లు 12 మంది చొప్పున కొనుగోలు చేసుకున్నాయి. జూలై 26 నుంచి ఆగస్టు 31 వరకు ఈ లీగ్ జరుగుతుంది.