
రాకేశ్ కుమార్‌కు రూ.12.80 లక్షలు
ప్రొ కబడ్డీ లీగ్ వేలం
ముంబై: ఆసియా గేమ్స్‌లో రెండు సార్లు స్వర్ణాలు సాధించిన స్టార్ ఆటగాడు రాకేశ్ కుమార్‌కు ప్రొ కబడ్డీ వేలంలో అత్యధిక ధర పలికింది. మంగళవారం జరిగిన ఈ వేలంలో అభిషేక్ బచ్చన్‌కు చెందిన జైపూర్ ఫ్రాంచైజీ పింక్ పాంథర్స్ రూ.12.80 లక్షలకు రాకేశ్‌ను కొనుగోలు చేసుకుంది. 32 ఏళ్ల ఈ రైడర్ నార్తర్న్ రైల్వే ఉద్యోగి. 2006, 2010 ఆసియా గేమ్స్‌లో భారత కబడ్డీ జట్టు తరఫున పాల్గొన్నాడు. 2007 ప్రపంచకప్ గెలుచుకున్న జట్టు సభ్యుడు కూడా. వేలంలో రెండో అత్యధిక ధర... రైడర్ దీపక్ నివాస్‌కు దక్కింది.
రూ.12.60 లక్షలకు విశాఖపట్నం ఫ్రాంచైజీ తెలుగు టైటాన్స్ ఈ ఆటగాడిని తీసుకుంది. అందుబాటులో ఉన్న నలుగురు పాక్ ఆటగాళ్ల నుంచి అతిఫ్ వహీద్, వాజిద్ అలీలను నాలుగు లక్షల చొప్పున తెలుగు టైటాన్స్ కొనుగోలు చేసుకుంది. ఈ వేలానికి 13 దేశాల నుంచి 96 మంది ఆటగాళ్లు అందుబాటులో ఉండగా బరిలో ఉన్న ఎనిమిది జట్లు 12 మంది చొప్పున కొనుగోలు చేసుకున్నాయి. జూలై 26 నుంచి ఆగస్టు 31 వరకు ఈ లీగ్ జరుగుతుంది.