Rakesh kumar
-
జస్టిస్ రాకేష్‌పై ‘సుప్రీం’ సీరియస్!
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులుగా ఉన్న సమయంలో జస్టిస్ రాకేష్ కుమార్, జస్టిస్ దొనడి రమేష్ తమ తీర్పులో అటు అత్యున్నత న్యాయస్థానం ఇటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఘటనపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. పక్షపాతంతో చేసిన ఆ అభ్యంతరకర, వివాదాస్పద వ్యాఖ్యలను ఆ తీర్పు నుంచి సుప్రీంకోర్టు తాజాగా తొలగించింది. ఇలాంటి అసంబద్ధ, పక్షపాత వ్యాఖ్యలతో పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తుతాయన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించింది. ఈమేరకు ఆ వ్యాఖ్యలను తీర్పు నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బేలా ఎం.త్రివేదీ, జస్టిస్ పంకజ్ మిత్తల్ ధర్మాసనం శుక్రవారం కీలక ఉత్తర్వులు వెలువరించింది. ఏం జరిగిందంటే...? మిషన్ బిల్డ్ ఏపీ కింద ప్రభుత్వ ఆస్తులను బహిరంగ వేలం ద్వారా విక్రయించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటిపై 2020 డిసెంబర్లో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రాకేష్ కుమార్, జస్టిస్ రమేష్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. విచారణ జరిగినప్పుడల్లా జస్టిస్ రాకేశ్‌కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి అభ్యంతరకర, ఘాటు వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీసిందా..? రాష్ట్రంలో ఆర్థిక అత్యాయక పరిస్థితి ఉందా? అంటూ వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాజ్యాల విచారణను గమనించిన ప్రతి న్యాయవాది జస్టిస్ రాకేష్ కుమార్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నట్లు అర్థం చేసుకున్నారు. ఈ ధోరణిని ఎన్నోసార్లు భరిస్తూ వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం చివరకు మీరు విచారిస్తే న్యాయం జరిగే అవకాశం లేదని, అందువల్ల ఈ వ్యాజ్యాల విచారణ నుంచి తప్పుకోవాలంటూ (రెక్యూజ్) జస్టిస్ రాకేష్ కుమార్‌ను కోరింది. ఆ మేరకు పిటిషన్ దాఖలు చేసింది. దీంతో జస్టిస్ రాకేష్ కుమార్ తీరు ప్రజలందరికీ తెలిసింది. ప్రభుత్వం న్యాయబద్ధంగా చేసిన అభ్యర్థనతో జస్టిస్ రాకేష్ కుమార్ అహం దెబ్బ తిన్నది. తనను విచారణ నుంచి తప్పుకోమనడం ధిక్కారపూర్వక చర్యే అవుతుందని జస్టిస్ రాకేష్ కుమార్, జస్టిస్ రమేష్‌ల ధర్మాసనం తీర్పు వెలువరించింది. ధర్మాసనం తరఫున జస్టిస్ రాకేష్ కుమారే తీర్పు రాశారు. విచారణ నుంచి తప్పుకోవాలన్న ప్రభుత్వ అభ్యర్థనను తిరస్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. కొలీజియంపై తీవ్ర వ్యాఖ్యలు సర్వ సాధారణంగా ప్రభుత్వం చేసిన అభ్యర్థన పట్ల అభ్యంతరం ఉంటే ఏ న్యాయమూర్తి అయినా ఉత్తర్వులు జారీ చేసి అంతటితో ఆగిపోతారు. జస్టిస్ రాకేష్ కుమార్ మాత్రం అలా ఆగలేదు. ఆ తీర్పు ద్వారా తన అసలు నైజాన్ని బయటపెట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకున్నారు. ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వంపైనే కాకుండా అప్పటి ఏపీ, తెలంగాణ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను బదిలీ చేసినందుకు సుప్రీంకోర్టు కొలీజియంపై సైతం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏకంగా 55 పేజీల తీర్పు వెలువరుస్తూ మిషన్ బిల్డ్‌పై దాఖలైన వ్యాజ్యాలతో సంబంధం లేని అంశాలను ప్రస్తావించారు. ఏ పిటిషనర్ ప్రస్తావించని అంశాలతోపాటు తమ ముందున్న కేసుతో సంబంధం లేని వివరాలను, వెబ్సైట్లలో ఉన్న వాటిని సైతం తీర్పులో పొందుపరిచారు. ప్రధానంగా ముఖ్యమంత్రి జగన్‌ను లక్ష్యంగా చేసుకుని ఆయన ప్రతిష్టను దెబ్బతీసేలా పలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్‌పై అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం బనాయించిన కేసుల గురించి తన తీర్పులో ప్రముఖంగా ప్రస్తావించారు. జగన్మోహన్రెడ్డి గురించి తనకు తెలియదని, తరువాత చాలా ఆసక్తికర విషయాలు తెలుసుకున్నానంటూ ఓ న్యాయమూర్తి చేయకూడని వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా గూగుల్‌లో ఖైదీ నెంబర్ 6093 అని టైప్ చేస్తే చాలా సమాచారం వస్తుందంటూ వ్యాఖ్యానించారు. తన పదవీ విరమణకు ఒక్క రోజు ముందు జస్టిస్ రాకేష్ కుమార్ ఈ వివాదాస్పద తీర్పును వెలువరించారు. ఆ మరుసటి రోజు ఆయన పదవీ విరమణ చేసి ఇంటికి వెళుతుండగా టీడీపీ కార్యకర్తలు, ఆ పార్టీ మద్దతుదారులు రోడ్డుకు ఇరువైపులా నిలబడి ఆయనను పసుపు పూలతో ముంచెత్తారు. ఆయనకు సాష్టాంగ నమస్కారాలు చేసి స్వామిభక్తిని చాటుకున్నారు. ‘సుప్రీం’ విస్మయం.. ఈ తీర్పుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2021లో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం జస్టిస్ రాకేష్ కుమార్ తీర్పుపై తీవ్ర విస్మయం వ్యక్తం చేసింది. ఆ తీర్పు తమను ఆందోళనకు గురి చేస్తోందంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. నిమిషం ఆలస్యం చేయకుండా జస్టిస్ రాకేష్ కుమార్ తీర్పు అమలుపై స్టే విధిస్తూ 2021 ఫిబ్రవరి 10న మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. అనంతరం ఈ వ్యాజ్యంపై జస్టిస్ బేలా త్రివేదీ ధర్మాసనం పలుమార్లు విచారణ జరిపింది. తాజాగా మరోసారి విచారించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వీ, ఎస్.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. జస్టిస్ రాకేష్ కుమార్ కేసుతో సంబంధం లేని అంశాలను ప్రస్తావించారని నివేదించారు. పలు అంశాలపై అవసరం లేని వ్యాఖ్యలు చేశారన్నారు. సుప్రీంకోర్టు కొలీజీయంపై కూడా విమర్శలు చేశారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల పాలనపరంగా పలు ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. ముఖ్యమంత్రి జగన్, రాష్ట్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు కొలీజియంను విమర్శిస్తూ జస్టిస్ రాకేష్ కుమార్ తన తీర్పులో చేసిన వ్యాఖ్యలను తొలగించాలని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఇందుకు ధర్మాసనం అంగీకరిస్తూ జస్టిస్ రాకేష్ కుమార్ వ్యాఖ్యలన్నింటినీ తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అత్యంత వివాదాస్పదుడు పాట్నా హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తూ న్యాయమూర్తిగా మారిన జస్టిస్ రాకేష్ కుమార్ న్యాయవ్యవస్థలో అత్యంత వివాదాస్పదుడిగా పేరుపొందారు. బిహార్ మహాదళిత్ వికాస్ మిషన్ ఫండ్ నిధుల విషయంలో ఐఏఎస్ అధికారి రామయ్య ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఆయన తోసిపుచ్చారు. అయితే కింది కోర్టు రామయ్యకు బెయిల్ ఇవ్వడాన్ని జస్టిస్ రాకేష్ కుమార్ తప్పుబడుతూ సుమోటోగా విచారణ జరిపారు. తాను బెయిల్ నిరాకరించిన వ్యక్తికి కింది కోర్టు బెయిల్ ఎలా ఇస్తుందని ప్రశ్నిస్తూ దీనిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. సివిల్ కోర్టులో అవినీతి జరుగుతోందంటూ సీబీఐ దర్యాప్తునకు ఆదేశించారు. పాట్నా హైకోర్టులో అవినీతి బహిరంగ రహస్యమంటూ ఓ తీర్పే రాశారు. అవినీతి విషయాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదన్నారు. జస్టిస్ రాకేష్ కుమార్ తీరును పాట్నా హైకోర్టు న్యాయమూర్తులందరూ సీరియస్‌గా తీసుకున్నారు. అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏపీ షాహీ నేతృత్వంలో 11 మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ప్రత్యేకంగా సమావేశమై జస్టిస్ రాకేష్ కుమార్ తీర్పును రద్దు చేసింది. జస్టిస్ రాకేష్ కుమార్ తీరుపై ఆ ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. అంతేకాకుండా ఆయనను కేసుల విచారణ బాధ్యత నుంచి తప్పించారు. అటు తరువాత సుప్రీంకోర్టు జస్టిస్ రాకేష్‌ను 2019లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేసింది. రాజ్యాంగ విచ్ఛిన్నమంటూ రభస ఏపీ హైకోర్టులో బాధ్యతలు స్వీకరించాక కొద్ది రోజులు మౌనం పాటించిన జస్టిస్ రాకేష్ కుమార్ ఆ తరువాత నిత్యం ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. చిన్న చిన్న కేసుల్లో కూడా ప్రభుత్వాన్ని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓ హెబియస్ కార్పస్‌పై తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో రాజ్యాంగ విచ్ఛినం జరిగిందంటూ విచారణ చేపట్టారు. పలు సందర్భాల్లో డీజీపీని ఆక్షేపించారు. రాజ్యాంగ విచ్ఛిన్నం అంశంపై తీర్పు రాసే అవకాశం కనిపించకపోవడంతో ముఖ్యమంత్రి జగన్‌ను లక్ష్యంగా చేసుకునేందుకు మిషన్ బిల్డ్ కేసును ఎంచుకున్నారు. బహుమానంగా ఎన్సీఎల్ఏటీ పదవి.. పదవీ విరమణ అనంతరం జస్టిస్ రాకేష్ కుమార్‌కు జాతీయ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) జుడీషియల్ సభ్యుడిగా అవకాశం దక్కింది. ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేసినందుకే ఎన్సీఎల్ఏటీ పదవి దక్కిందన్నది న్యాయవ్యవస్థలో అందరికీ తెలిసిన విషయమే. ఎన్సీఎల్టీలో కూడా ఆయన వివాదాస్పదంగా వ్యవహరించారు. ఏకంగా సుప్రీంకోర్టు ఆదేశాలనే ఉల్లంఘించారు. తనకు కావాల్సిన విషయం విచారణ చేపట్టారు. ఫినోలెక్స్ కేబుల్ వార్షిక సర్వసభ్య సమావేశం ఫలితాల విషయంలో ఏకపక్షంగా వ్యవహరించారు. దీంతో సుప్రీంకోర్టు ఆయనపై కన్నెర్ర చేసి కోర్టు ధిక్కార చర్యలకు ఉపక్రమించి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. రాకేష్ కుమార్ తీరు వల్ల ఎన్సీఎల్ఏటీ కుళ్లిపోయిందంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. దీంతో జస్టిస్ రాకేష్ కుమార్ బాగోతం దేశమంతా తెలిసిపోవడంతో గత్యంతరం లేక ఎన్సీఎల్ఏటీ జుడీషియల్ సభ్యుడి పదవికి రాజీనామా చేశారు. -
AP : జస్టిస్ రాకేష్ వివాదాస్పద తీర్పు రద్దు
ఏపీ హైకోర్టులో జడ్జిగా ఉన్నప్పుడు జస్టిస్ రాకేష్‌కుమార్ ఇచ్చిన వివాదస్పద తీర్పును రద్దు చేసింది సుప్రీంకోర్టు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ డిసెంబర్ 31, 2020న జస్టిస్ రాకేష్‌కుమార్ ఒక తీర్పు ఇచ్చారు. తన వ్యక్తిగత వ్యాఖ్యలను తీర్పులో చేర్చిన జస్టిస్ రాకేష్.. దాన్నే తీర్పుగా పేర్కొనడంపై అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. జస్టిస్ రాకేష్‌కుమార్ ఇచ్చిన తీర్పును అప్పట్లో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేయగా, ఆ పిటిషన్‌ను జస్టిస్ బేలా త్రివేదీ, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారణ జరిపింది. ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ సింగ్వీ, నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఈ కేసులో సుదీర్ఘ వాదనల అనంతరం సుప్రీంకోర్టు తుది తీర్పు ఇవ్వాళ ప్రకటించింది. కేసు పూర్వపరాలేంటీ? ప్రభుత్వ స్థలానికి సంబంధించిన వేలం వ్యవహారానికి సంబంధించి 2020లో ఓ పిటిషన్ ఏపీ హైకోర్టు ముందు దాఖలయింది. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, అలాగే వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకున్న జస్టిస్ రాకేష్ కుమార్.. తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ డిసెంబర్ 31, 2020న ఓ తీర్పు ఇచ్చారు. ఎలాంటి ఆధారాలు లేకుండా, రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయని, యంత్రాంగం లేదంటూ తన తీర్పులో వ్యాఖ్యలు చేశారు జస్టిస్ రాకేశ్‌కుమార్. శాసనవ్యవస్థమీదా, పోలీసు యంత్రాంగంమీద, మూడు రాజధానుల అంశంమీదా ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేసిన జస్టిస్ రాకేశ్‌కుమార్ వాటన్నింటిని తీర్పులో పొందుపరిచారు. సుప్రీంకోర్టుపైనే ఎదురుదాడి దీంతో పాటు ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ వ్యవహారంపైనా సుప్రీంకోర్టు కొలీజియంను తప్పుబడుతూ వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు జడ్జిలను బదిలీ చేయడాన్ని హైకోర్టుపై దాడిగా అభివర్ణించారు. నాడు హైకోర్టు జడ్జిగా జస్టిస్ రాకేష్ చేసిన తీర్పులో ఏకంగా సుప్రీంకోర్టు కొలిజీయంనే తప్పుబట్టారు. సర్వోన్నత న్యాయస్థానం ఏం చెప్పింది? కేసుల విచారణ జాప్యంపై, అలాగే అమరావతి భూముల కేసులో జస్టిస్ రాకేశ్‌కుమార్ ఇచ్చిన తీర్పు అంశాలనూ సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఇతర రాజ్యాంగ వ్యవస్థల విధుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుంటోందంటూ హైకోర్టు ఆరోపించడం జరికాదని సూచించింది సుప్రీంకోర్టు. జస్టిస్ రాకేష్ తీరును తీవ్రంగా తప్పుబట్టిన సుప్రీంకోర్టు.. ఒక హైకోర్టు జడ్జిగా తనకున్న విచక్షణాధికారాన్ని ఇష్టానుసారంగా వినియోగించలేరని, వ్యవస్థలను ఇబ్బంది పెట్టకూడదని తెలిపింది. ఒక హైకోర్టు జడ్జిగా సుప్రీంకోర్టు కొలీజియంను తప్పుపట్టే ముందు.. తాను కూడా రాజ్యాంగబద్ధమైన పోస్టులో ఉన్న విషయాన్ని రాకేష్‌కుమార్ గుర్తించకపోవడం శోచనీయమని పేర్కొంది. జస్టిస్ రాకేష్ కుమార్ పై ఆరోపణలేంటీ? వివాదాల్లో ఇరుక్కోవడం జస్టిస్ రాకేష్‌కుమార్‌కు ఇది కొత్తేమీ కాదు. నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ NCLATలో సభ్యుడిగా ఉన్న రాకేష్‌కుమార్ తీరును ఇటీవల సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టడంతో ఆయన ఆ పోస్టుకు రాజీనామా చేసి బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఫినోలెక్స్ కేబుల్స్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పక్కన పెట్టేందుకు ప్రయత్నించడంతో ఆయన వైఖరిని తీవ్రంగా తప్పుబట్టింది సర్వోన్నత న్యాయస్థానం. జస్టిస్ రాకేశ్‌కుమార్ కోర్టు ధిక్కరణపై ఇటీవల సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో పాట్నా హైకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు కోర్టంతా అవినీతిమయమయిందని నిరాధార ఆరోపణలు చేసి విమర్శల పాలయ్యారు. ఇదీ చదవండి: ఎల్లో మీడియా దుష్ప్రచారంపై సీఐడీ సీరియస్ -
జస్టిస్ రాకేష్ కుమార్ రాజీనామా
న్యూఢిల్లీ: నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (NCLAT) జ్యూడిషియల్ సభ్యుడు జస్టిస్ రాకేష్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. ట్రిబ్యునల్ పదవిలో భాగంగా జస్టిస్ రాకేష్‌కుమార్ తీసుకున్న నిర్ణయాలపై సుప్రీంకోర్టు గత వారం వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో సోమవారం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ అశోక్ భూషణ్, కేంద్ర న్యాయశాఖకు అందజేశారు. ఫినోలెక్స్ కేబుల్ కేసులో కోర్టు ధిక్కారణ చర్యలు ఎదుర్కొంటున్నారు జస్టిస్ రాకేష్‌కుమార్. కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశం(AGM) ఫలితాలపై యధాతథా సిత్థిని కొనసాగించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించి, ఎన్సీఎల్ఏటీ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంపై సీజేఐ జస్టిస్ డీవీ చంద్రచూడ్ తీవ్రంగా స్పందించారు. జస్టిస్ రాకేష్ కుమార్‌తోపాటు ఎన్సీఎల్ఏటీ టెక్నికల్ మెంబర్ అలోక్ శ్రీవాస్తపై కోర్టు ధిక్కరణ చర్యలకు ఆదేశాలిచ్చారు. కాగా జస్టిస్ రాకేష్ కుమార్ గంతో ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. ఏం జరిగింది? ఫినోలెక్స్ కేబుల్స్ వార్షిక సర్వ సభ్య సమావేశానికి సంబంధించిన కేసులో జస్టిస్ రాకేష్ కుమార్, జస్టిస్ అలోక్ శ్రీవాస్తవలతో కూడిన బెంచ్ ట్రిబ్యునల్ కొన్ని ఉత్తర్వులు ఇచ్చింది. కంపెనీ ఓనర్‌షిప్‌కు సంబంధించి ఇద్దరు సోదరులు ప్రకాష్ ఛాబ్రియా, దీపక్ ఛాబ్రియా మధ్య వివాదం నెలకొనడంతో విషయం ట్రిబ్యునల్‌కు చేరింది. కేసును విచారించిన జస్టిస్ రాకేష్‌కుమార్.. తాము తీర్పు వెలువరించేంతవరకు కంపెనీ యాన్యువల్ జనరల్ మీటింగ్ ఫలితాలపై స్టే విధించింది. సుప్రీంకోర్టులో ఏం జరిగింది? AGMలో ఫలితాలను వెల్లడించొద్దంటూ ట్రిబ్యునల్‌లో ఇచ్చిన తీర్పును ఫినోలెక్స్ కేబుల్స్ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. కేసును విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ట్రిబ్యునల్ ఇచ్చిన స్టేను సెప్టెంబర్ 20, 2023న తొలగించింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పిటిషనర్.. ట్రిబ్యునల్ ముందు ఉంచగా.. వాటిని పట్టించుకోలేదు. ఈ విషయాన్ని మళ్లీ సుప్రీంకోర్టుకు తెలిపారు పిటిషనర్. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్.. మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించాలంటూ ట్రిబ్యునల్ ఛైర్మన్ జస్టిస్ అశోక్ భూషణ్‌ను ఆదేశించారు. ఉద్దేశపూర్వకంగా సుప్రీంకోర్టు ఉత్తర్వులను పక్కనబెట్టినట్టు తేలితే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కోర్టు ధిక్కరణ తేలడంతో రాజీనామా సుప్రీంకోర్టులో తాము చేసింది కోర్టు ధిక్కరణ అని తేలడంతో జస్టిస్ రాకేష్‌కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయన లాయర్ PS పట్వాలియా సుప్రీంకోర్టుకు తెలిపారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘించే ఉద్దేశ్యం లేదని, అయితే కోర్టు ధిక్కరణ అని తేలినందున తన పదవి నుంచి జస్టిస్ రాకేష్‌కుమార్ తప్పుకున్నారని పట్వాలియా తెలిపారు. తనపై వచ్చిన అభియోగాలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని, ఇప్పటికే రాజీనామా ఇచ్చినందున ఈ కేసును మూసివేయాలని పట్వాలియా సుప్రీంకోర్టును కోరారు. సుప్రీంకోర్టు ఏం తేల్చింది? జస్టిస్ రాకేష్ తరపున పట్వాలియా చేసిన విజ్ఞప్తిని చీఫ్ జస్టిస్ DY చంద్రచూడ్, జస్టిస్ JB పార్డీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా స్వీకరించారు. "NCLAT పదవికి, ఆర్థిక శాఖ లా సెక్రటరీ పదవికి జస్టిస్ రాకేష్‌కుమార్ రాజీనామా చేసినట్టు ఆయన తరపు లాయర్ పట్వాలియా ప్రకటన చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పక్కనబెట్టే ప్రయత్నం జరిగిందని మేం నమ్ముతున్నాం. అక్టోబర్ 13న NCLATలో జరిగిన పరిణామాలకు సంబంధించిన వీడియో ఫుటేజ్‌ను చూశాం. కనీసం సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా తన ఆదేశాలను మార్చేందుకు ట్రిబ్యునల్ ఆసక్తి చూపలేదు. అయితే ఈ కేసును ఇంతటితో ముగిస్తున్నాం. " అని బెంచ్ తెలిపింది. జస్టిస్ రాకేష్‌కుమార్ గతమేంటీ? జస్టిస్ రాకేష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిగా పనిచేసిన సమయంలో అమరావతి రాజధాని అంశంపై ఉత్తర్వులిచ్చారు. ఈ ఉత్తర్వుల్లో పలు వివాదస్పద వ్యాఖ్యలు జోడించడంమే కాకుండా.. రాజ్యాంగ సంక్షోభం అంటూ కొన్ని కామెంట్లు చేశారు. దీనిపై రాష్ట్రప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేయగా.. జస్టిస్ రాకేష్‌కుమార్ ఇచ్చిన తీర్పును తీవ్రంగా తప్పుబట్టింది సుప్రీంకోర్టు. జస్టిస్ రాకేష్‌కుమార్ చేసిన వ్యాఖ్యలు ఆందోళనకరంగా ఉన్నాయని, రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందంటూ చేసిన వ్యాఖ్యలు సరికావని సూచించింది. -
NCLAT జ్యుడీషియరీ సభ్యుడిగా రాజీనామా
-
క్యాన్సర్‌తో ప్రముఖ దర్శకుడు మృతి.. ప్రముఖుల సంతాపం
ప్రముఖ దర్శకుడు రాకేష్ కుమార్(81)కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన నవంబర్10న తుదిశ్వాస విడిచారు. రాకేష్ కుమార్‌కు భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. నేడు(ఆదివారం) రాకేష్ కుమార్ సంస్మరణ సభని ఏర్పాటు చేసినట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. ఖూన్ పసిన, దో ఔర్ దో పాంచ్, మిస్టర్ నట్వర్ లాల్, యారనా, జానీ ఐ లవ్ యూ, దిల్ తుజ్ కో దియా, కౌన్ జీతా కౌన్ హార, కమాండర్ అండ్ సూర్యవంశీ వంటి పలు చిత్రాలకు రాకేష్ కుమార్ దర్శకత్వం వహించారు. ఆయన మరణం పట్ల పలువురు నటీనటులు సంతాపం తెలుపుతున్నారు. Deepest condolences to the family of Rakesh Kumar Ji , the filmmaker who gave us some great films like Natwarlaal, khoon Pasina, Do aur Do Paanch, Yaraana. May the almighty give the family strength and patience to bear this irreplaceable loss 🙏#rakeshkumar #condolences pic.twitter.com/TQQeX7KxZp — Naved Jafri (@NavedJafri_BOO) November 13, 2022 The great Dir Rakesh Kumar ji passed away. He directed some great blockbuster films with Amitabh Bachchan Khoon Pasina, Mr Natwarlal, Do Aur Do Paanch, Yaraana. Rakesh ji was the AD in films like Zanjeer, Hera Pheri & other RIP Thank you for the beautiful films #RakeshKumar pic.twitter.com/e5N3tY1j4m — Moses Sapir (@MosesSapir) November 13, 2022 -
డిసెంబర్ 9న మ్యాప్‌మైఇండియా ఐపీవో
న్యూఢిల్లీ: డిజిటల్ మ్యాపింగ్ సంస్థ మ్యాప్‌మైఇండియా ప్రతిపాదిత పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 1,040 కోట్లు సమీకరించనుంది. ఐపీవో డిసెంబర్ 9న ప్రారంభమై 13న ముగియనుంది. దీని కోసం షేరు ధర శ్రేణి రూ. 1,000–1,033గా ఉండనుంది. కనీసం 14 షేర్ల కోసం బిడ్ చేయాల్సి ఉంటుంది. మ్యాప్‌మైఇండియా ఐపీవో పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలోనే ఉంటుంది. ప్రస్తుత వాటాదారులు, ప్రమోటర్లు 1,00,63,945 షేర్లను విక్రయించనున్నారు. కంపెనీలో ప్రమోటర్లయిన రాకేశ్ కుమార్ వర్మకు 28.65 శాతం, రాశి వర్మకు 35.88 శాతం వాటాలు ఉన్నాయి. ఓఎఫ్ఎస్ కింద రాశి వర్మ 42.51 లక్షల వరకూ, క్వాల్కామ్ ఏషియా పసిఫిక్ 27.01 లక్షలు, జెన్రిన్ కంపెనీ 13.7 లక్షల షేర్లు, ఇతర వాటాదారులు 17.41 లక్షల షేర్లను విక్రయించనున్నారు. సీఈ ఇన్ఫో సిస్టమ్స్‌గా కూడా పేరొందిన మ్యాప్‌మైఇండియాలో అంతర్జాతీయ వైర్లెస్ టెక్నాలజీ దిగ్గజం క్వాల్కామ్, జపాన్ డిజిటల్ మ్యాపింగ్ కంపెనీ జెన్రిన్కు పెట్టుబడులు ఉన్నాయి. న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేసే ఈ కంపెనీ.. అధునాతన డిజిటల్ మ్యాప్‌లు, జియోస్పేషియల్ సాఫ్ట్వేర్, లొకేషన్ ఆధారిత ఐవోటీ టెక్నాలజీలను అందిస్తోంది. యాపిల్ మ్యాప్స్‌తో పాటు ఫోన్‌పే, ఫ్లిప్‌కార్ట్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎయిర్టెల్, హ్యుందాయ్ తదితర సంస్థలు కంపెనీకి క్లయింట్లుగా ఉన్నాయి. -
మాజీ జడ్జి రాకేశ్ నేతృత్వంలో సిట్ దర్యాప్తు
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ డెప్యూటీ సీఎం కేశవ్ మౌర్య, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాల పర్యటన సందర్భంగా లఖీమ్‌పూర్‌లో రైతుల ఆందోళన, తర్వాత చెలరేగిన హింసాత్మక ఘటనల కేసుల దర్యాప్తు ఇకపై మాజీ జడ్జి రాకేశ్ కుమార్ జైన్ నేత్వత్వంలో కొనసాగనుంది. పంజాబ్, హరియాణా హైకోర్టులో జస్టిస్.రాకేశ్ కుమార్ గతంలో జడ్జిగా సేవలందించారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన జాబితాలోని ఐజీ ర్యాంక్ అధికారి పద్మజ చౌహాన్‌సహా యూపీ మాతృరాష్ట్రంకాని ముగ్గురు ఐపీఎస్ అధికారులు ఇకపై రాష్ట్ర ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)లో భాగస్వాములుగా ఉంటారని సుప్రీంకోర్టు సీజే జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమాకోహ్లిల ధర్మాసనం వెల్లడించింది. సిట్ దర్యాప్తు పూర్తయ్యాక కోర్టులో చార్జ్‌షీట్ దాఖలుచేయాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితిపై జస్టిస్ జైన్ ఒక నివేదికను కోర్టుకు సమర్పించాకే కేసుల విచారణ మొదలవుతుందని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. నలుగురు రైతులుసహా ఎనిమిది మంది మృతికి కారణమైన అక్టోబర్ 3నాటి రైతుల ఆందోళన, హింసాత్మక ఘటనల కేసుల పారదర్శక దర్యాప్తు కోసం వేరే రాష్ట్రానికి చెందిన జడ్జిని నియమిస్తామని సుప్రీంకోర్టు తెలపగా, అందుకు యూపీ సర్కార్ ఇటీవలే అంగీకరించడం తెల్సిందే. ఈ నేపథ్యంలోనే దర్యాప్తు బృందానికి కొత్త పర్యవేక్షకుడిని కోర్టు బుధవారం నియమించింది. హరియాణాలోని హిస్సార్‌లో 1958 అక్టోబర్ ఒకటిన జస్టిస్ జైన్ జన్మించారు. బీకాం ఎల్ఎల్బీ పూర్తిచేసిన జైన్ పంజాబ్, హరియాణా హైకోర్టు బార్లో 1982లో పేరు నమోదు చేయించుకున్నారు. తర్వాత హిస్సార్ జిల్లా కోర్టులో ప్రాక్టీసు ప్రారంభించారు. 1983 నుంచి హైకోర్టులో కేసులు వాదించారు. -
జస్టిస్ రాకేష్ జడ్జిమెంట్‌పై సుప్రీంకోర్టు స్టే
సాక్షి, అమరావతి : మిషన్ బిల్డ్ ఆంధ్రప్రదేశ్ కేసులో జస్టిస్ రాకేష్ కుమార్ ఇచ్చిన తీర్పుపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్టే విధించింది. పదవీ విరణమణకు ఒక్కరోజు ముందు జస్టిస్ రాకేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు, తీర్పుపై స్టే విధిస్తూ న్యాయస్థానం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. జస్టిస్ రాకేష్ తీవ్ర వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లో ఏకంగా రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు విస్మయానికి గురిచేశాయి. ఆ తర్వాత అవి వ్యక్తిగత అభిప్రాయాలుగా న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. కాగా డిసెంబర్ 30న తీర్పును వెలువరించి, డిసెంబర్ 31న జస్టిస్ రాకేష్ పదవీ విరమణ చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించి, రాజ్యాంగం వైఫల్యం చెందిందా? లేదా? అన్న అంశంపై తేలుస్తామంటూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ అప్పీల్ దాఖలు చేసింది. రాజ్యాంగ వైఫల్యంపై అధికరణ 356 కింద రాష్ట్రపతి జోక్యం చేసుకోవచ్చే కానీ న్యాయస్థానాలు కాదని రాష్ట్ర ప్రభుత్వం తన అప్పీల్లో పేర్కొంది. హైకోర్టు ఆదేశాలు ఏ మాత్రం సబబు కాదని రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాదులు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టుకు నివేదించారు. హెబియస్ కార్పస్ పిటిషన్లలో రాజ్యాంగ వైఫల్యంపై విచారణ జరుపుతామన్న హైకోర్టు ఉత్తర్వులు సహేతుకం కాదన్నారు. ఈ అప్పీల్‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఏ.బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. కేసు పూర్వాపరాలను పరిశీలించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. అక్టోబర్ 1న హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులపై స్టే విధిస్తున్నట్లు స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాలు ఆందోళనకరంగా ఉన్నాయంటూ గతంలోనే న్యాయస్థానం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తమ వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారంటూ కొందరు హెబియస్ కార్పస్ పిటిషన్లు దాఖలు చేస్తే ఆ వ్యాజ్యాల్లో ఓ న్యాయస్థానం ఇలాంటి ఉత్తర్వులు జారీ చేయడం ఎప్పుడైనా, ఎక్కడైనా మనం చూశామా? అంటూ విస్మయం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయని ఆ న్యాయమూర్తులు భావించడానికి అంతగా ప్రభావితం చేసిన అంశాలేమున్నాయో అంతుబట్టడం లేదని వ్యాఖ్యానించింది. -
తీర్పు రాజకీయ కరపత్రం కాకూడదు!
ఒక న్యాయమూర్తి రిటైర్ అయిన తర్వాత రోడ్డుకు రెండు వైపులా కొంతమంది అమరావతి వాసులు నిలబడి వీడ్కోలు చెప్పడం జరిగింది. వీరంతా ఎలాంటి సంకేతం ఇచ్చారు? ఏపీలో పౌరుల హక్కులను కాపాడలేకపోతున్నామంటూ హైకోర్టువారు గంపగుత్తగా వ్యాఖ్యలు చేశారు. అదేదో ప్రతిపక్ష పార్టీ అందంటే వారి రాజకీయ అవసరం అర్థం చేసుకోవచ్చు. కానీ ఒక జడ్జిగారు అలా మాట్లాడారంటే ఏమని అనుకోవాలి? ఏపీలో రాజ్యాంగం విచ్ఛిన్నం అయిందంటూ చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తప్పుపడితే, దానికి ఎందుకు సమాధానం ఇవ్వలేకపోయారు? న్యాయమూర్తులకు రాజకీయ దురుద్దేశాలు ఆపాదించకూడదు. కానీ న్యాయమూర్తులు కూడా తమ తీర్పులను రాజకీయ ప్రసంగాలుగా మార్చరాదు. కొద్దికాలం క్రితం సుప్రీంకోర్టులో రిటైర్ అయిన జడ్జి దీపక్ గుప్తా ఒక వ్యాఖ్య చేశారు. న్యాయవ్యవస్థ ధనికులకు, శక్తిమంతులకు మాత్రమే అధికంగా ఉప యోగపడుతోందని అన్నారు. ఈ వ్యాఖ్య ఎంత అర్థవంతమైనదో ఏపీ హైకోర్టు జడ్జి జస్టిస్ రాకేశ్ కుమార్ రిటైర్ అయిన తర్వాత ఆయనకు వీడ్కోలు చెప్పిన వారిని చూస్తే తెలుస్తుంది. రోడ్డుకు రెండు వైపులా కొంతమంది అమరావతి ప్రాంతవాసులు నిలబడి ఆయనకు వీడ్కోలు చెప్పడం జరిగింది. వీరంతా ఏం కోరుతున్నారు? మిగిలిన రాష్ట్రం ఎటైనా పోనీ, తమ భూములకు మాత్రం కోట్ల విలువ ఉండాలని ఆశిస్తున్నారు. అలాంటివారు ఒక న్యాయమూర్తికి వీడ్కోలు తెలిపా రంటే ఎలాంటి సంకేతం ఇచ్చారు? అలాగే కొన్ని నెలల క్రితం హైకోర్టుకు వెళ్లే న్యాయమూర్తులకు రోడ్డుపై నిలబడి దండాలు పెట్టారు. వారి వినతులను ఆలకించిన గౌరవ హైకోర్టు వారు, అదే సమయంలో కొందరు నిరసన బ్యాడ్జీలు పెట్టుకున్నారని మండి పడ్డారు. నిరసన చెప్పడం తప్పే కావచ్చు. కానీ దండాలు పెట్టడం మాత్రం సమర్థనీయమా ఆలోచించాలి. ఇక రాకేశ్ కుమార్ గారు కొన్నాళ్ల క్రితం ఏపీలో రాజ్యాంగ విచ్ఛిన్నత జరిగిందంటూ ఆయనకు ఆయనే భావించి, కొందరు పిటిషనర్లను ఆ మేరకు పిటిషన్ వేయండని అడగటంపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ముప్పై ఏళ్లలో ఎన్నడైనా ఇలాంటి తీర్పు చూశామా అని చీఫ్ జస్టిస్ బాబ్డే వ్యాఖ్యానించారంటేనే అది ఎలాంటి తీర్పో విశ్లేషించుకోవచ్చు. దానికి సమాధానం చెప్పలేని రాకేశ్ కుమార్ సుప్రీంకోర్టు కొలీజియం ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌ను, తెలంగాణ చీఫ్ జస్టిస్‌ను బదిలీ చేయడాన్ని తప్పు పట్టినట్లు వ్యాఖ్యానించారు. మరి ఇది కోర్టు ధిక్కరణ కిందకు రాదా అంటే వస్తుందని న్యాయనిపుణులు అంటున్నారు. పైగా ముఖ్యమంత్రి జగన్ రాసిన లేఖ ఆధారంగానే ఈ రెండు రాష్ట్రాల చీఫ్ జస్టిస్‌లు బదిలీ అయ్యారని ప్రజలు అనుకునే అవకాశం ఉందని ఆయన అన్నారు. దీనివల్ల జగన్‌కు ఏదో అనుచిత లబ్ధి వచ్చిందని అనడం దారుణంగా ఉంది. తెలంగాణ సీజేపై జగన్ ఎక్కడా ఫిర్యాదు చేయలేదే? దానికి, జగన్‌కు ఏమి సంబంధం ఉందని రాకేశ్ గారు కనిపెట్టారో తెలియదు. జగన్ కేసుల గురించి, ఆయన జైలులో ఉన్నప్పుడు కేటాయించిన నంబర్ గురించి కూడా జడ్జి గారు మాట్లాడారంటే ఆయన ద్వేషంతోనో, లేదా మరే ఉద్దేశంతోనో ఇలాంటి తీర్పు ఇచ్చారని కొందరు న్యాయనిపుణులు వ్యాఖ్యానిస్తు న్నారు. న్యాయమూర్తులకు రాజకీయ దురుద్దేశాలు ఆపాదించ కూడదు. అలాగే న్యాయమూర్తులు కూడా తమ తీర్పులను రాజకీయ ప్రసంగాలుగా మార్చరాదు. ఇదే సందర్భంలో జస్టిస్ రాకేశ్‌ను పట్నా హైకోర్టు నుంచి ఎందుకు బదిలీ చేశారో గుర్తుకు తెచ్చుకోవాలని మరో న్యాయ ప్రముఖుడు అన్నారు. అక్కడ కొందరు జడ్జీలపై ఈయన ఆరోపణ చేయడం, వారంతా దానిని ఖండించడం, ఈయనకు కేసులు విచారణకు ఇవ్వకుండా ఉండాలని నిర్ణయించడం, తదుపరి అక్కడ నుంచి బదిలీ చేయడం జరిగాయి. అప్పుడే సుప్రీంకోర్టు కొలీజియంపై ఎందుకు ఈయన దావా వేయలేదని మరో ప్రముఖ లాయర్ ప్రశ్నిం చారు. మూడు రాజధానుల కేసు గురించి, శాసనమండలి రద్దు గురించి, చివరికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వివాదం గురించి కూడా తీర్పులో రాయవలసిన అవసరం ఏమిటి? అసలు కేసు ఏమిటి? రాజ్యాంగం విచ్ఛిన్నం అంటూ గతంలో వ్యాఖ్యలు చేసినందున మిషన్ బిల్డ్ ఏపీ కేసును జస్టిస్ రాకేశ్ కుమార్ విచారించడానికి వీలు లేదని ప్రభుత్వ తరపు న్యాయవాది పిటిషన్ వేశారు. అంటే ఈ న్యాయమూర్తి నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని పరోక్షంగా చెప్పడమే కదా. అలాంటప్పుడు విజ్ఞత కలిగిన ఏ జడ్జి అయినా ఆ కేసు నుంచి తప్పుకుంటారని చెబుతారు. కానీ ఆయన ఆ పని చేయకపోగా, ఆ పిటిషన్‌ను కొట్టివేసి, ఆ పిటిషన్ వేసిన ప్రభుత్వ అధికారిపై కోర్టు ధిక్కార కేసు పెట్టాలని తీర్పిచ్చారు. తన రిటైర్మెంట్కు ఒక రోజు ముందు ఇలాంటి తీర్పు ఇవ్వడం అంటే ఆయన ఉద్దేశాలు ఏమిటో తెలుస్తున్నాయని కొందరు అంటున్నారు. జడ్జీలకు దురుద్దేశాలు ఆపాదించకూడదు కానీ, కొన్నాళ్ల క్రితం ఇదే కేసులో వాదించిన పోలీసు శాఖ తరపు న్యాయవాది ఎస్.ఎస్. ప్రసాద్... జడ్జి రాకేశ్ కుమార్ ఈ కేసులో ముందుకు వెళితే రాజకీయ దురుద్దేశం ఆపాదించవలసి వస్తుందని ఆనాడే చెప్పారు. అయినా జడ్జి గారు పట్టించుకోకుండా తన రాజకీయ ప్రసంగం మాదిరి తీర్పు ఇచ్చే శారు. ఈయనతో పాటు ఉన్న మరో జడ్జి రమేష్ మాత్రం ఈ వ్యాఖ్య లతో తనకు సంబంధం లేదని స్పష్టంగా చెప్పారట. ప్రభుత్వంలో ఏవైనా లోపాలు ఉంటే వాటిని ప్రస్తావించడం తప్పు కాదు. అది కూడా ఆయా విషయాలపై ఎవరైనా పిటిషన్లు వేస్తే తీర్పులు ఇవ్వవచ్చు. అలాకాకుండా జడ్జీలు వారికి వారే ఏవో ఊహిం చుకుని తీర్పులు ఇచ్చేయడం మొదలుపెడితే ఈ విషయం ఎక్కడిదాకా వెళుతుంది? శాసనమండలి రద్దు తీర్మానం గురించి జడ్జిగారికి ఏమి సంబంధం? ఆయన ఆ కేసును విచారిస్తుంటే సంబంధిత ప్రశ్నలు వేయవచ్చు. అలాకాకుండా దేశంలో ఎప్పుడూ శాసన మండలి రద్దు జరగనట్లుగా మాట్లాడితే వారికి ఉన్న సమాచార జ్ఞానం ఏమిటన్న ప్రశ్న వస్తుంది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాసనమండలి రద్దు చేయాలని శాసనసభ తీర్మానాలు చేయడం, ఆ తర్వాత కొంత కాలానికి అది రద్దు కావడం కూడా జరిగింది. ఇప్పుడు మండలి రద్దు అవుతుందా, లేదా అన్నది కేంద్రం నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. అది వేరే సంగతి. కానీ జడ్జిగారికి ఏమి సంబంధం? శాసనసభకు అసలు హక్కులు ఉండవనీ, మొత్తం పాలన వ్యవస్థను కూడా తామే నడుపుతామనీ గౌరవ న్యాయమూర్తులు భావిస్తే అది సమంజసం అవుతుందా? ఏపీలో పౌరుల హక్కులను కాపాడలేకపోతున్నా మంటూ గంపగుత్తగా వ్యాఖ్యలు చేయడం కూడా సమర్థనీయం కాదు. అదేదో ప్రతిపక్ష పార్టీ అందంటే వారి రాజకీయ అవసరం అర్థం చేసుకోవచ్చు. కానీ ఒక జడ్జిగారు అలా మాట్లాడా రంటే ఏమని అనుకోవాలి? హైకోర్టు మీద ప్రభుత్వం యుద్ధం చేస్తోందని హైకోర్టువారు వ్యాఖ్యానించారు కానీ నిజానికి హైకోర్టువారే ఏపీ ప్రభుత్వంపై యుద్ధం చేస్తున్నారని ప్రజలలో ఏర్పడిన అభిప్రాయం. రాజ్యాంగం విచ్ఛిన్నం అయిందంటూ చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తప్పు పడితే, మరి దానికి జస్టిస్ రాకేశ్ ఎందుకు సమాధానం ఇవ్వలేక పోయారు? రాజకీయ నేతల కేసుల గురించి ప్రస్తావిస్తున్న న్యాయ మూర్తి, న్యాయవ్యవస్థ అంతా కడిగిన ముత్యంలా ఉందని చెప్ప గలరా? ఆయనే ఒకప్పుడు న్యాయవ్యవస్థలో అవినీతిపై ఏమి మాట్లా డింది తెలియదా? తాజాగా ఏపీ హైకోర్టులో వచ్చిన ఒక తీర్పు గురించి తెలియదా? న్యాయవ్యవస్థలోని వారిపై అవినీతి కేసులు వస్తే అసలు విచారణే జరపరాదనీ, అసలు ఆ వార్తలే ప్రచారం చేయరాదనీ ఆదేశాలు ఇవ్వడాన్ని ఎలా సమర్థిస్తారు? కొన్ని కేసుల్లో నెలల తరబడి కొందరిని జైళ్లలో ఉంచే కోర్టులు, మరికొందరి విషయంలో భిన్నంగా ఎందుకు వ్యవహరిస్తున్నాయి? ప్రతిపక్ష నేత చంద్రబాబు ఓటుకు నోటు కేసులో ఆయనకేమి సంబంధం అని ప్రశ్నించిన జడ్జిగారు కూడా ఉన్నారు. ఒక నేతకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిన ఒక న్యాయ మూర్తికి ఆయన రిటైర్ అయిన వెంటనే ప్రభుత్వంలో పెద్ద పదవి కూడా వచ్చింది. అవన్నీ సమర్థనీయమని గౌరవ రాకేశ్ కుమార్ భావి స్తున్నారా? ఒక హైకోర్టు జడ్జికి సుప్రీంకోర్టు జడ్జిగా ప్రమోషన్ వచ్చింది. కానీ అప్పుడు ఆయనపై ఒక కేసు పెండింగులో ఉందన్న సమాచారం బయటకు వచ్చింది. దాంతో వెంటనే రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడుకుని ఆ కేసును ఎత్తివేయించుకున్నారే! రాజకీయ నేతలు తమపై వచ్చిన కేసులు విత్‌డ్రా చేసుకుంటే తప్పు అయితే ఇది రైటు అవుతుందా? ఏ వ్యవస్థలో అయినా మంచి, చెడు ఉండవచ్చు. కానీ న్యాయ వ్యవస్థ మాత్రం చెడుకు దూరంగా ఉండాలి. ప్రభావాలకు లోను కాకుండా ఉండాలి. రాకేశ్ కుమార్ వల్ల న్యాయ వ్యవస్థ ప్రతిష్ట పెరి గిందా, తగ్గిందా ఆయనే ఆలోచించుకోవాలి. జనం దృష్టిలో మాత్రం ఆయన రాసిన తీర్పు అంతా రాజకీయ ప్రసంగంగానే మిగిలిపోయిం దన్న విమర్శను ఎదుర్కోక తప్పదు. న్యాయ వ్యవస్థ భ్రష్టు పట్టేలా ఎవరూ వ్యవహరించరాదని సలహా ఇవ్వడం తప్ప మనం ఏమి చేయగలం? న్యాయవ్యవస్థకు ఆ పరిస్థితి ఎదురైతే సమాజానికి ప్రమాదం. ఇదంతా న్యాయ వ్యవస్థ బాగుపడాలని తప్ప, జడ్జీలపై అగౌరవంతో కాదనీ, ధిక్కార స్వరం అసలు కాదనీ న్యాయమూర్తులు భావిస్తే అదే పదివేలు. -వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు కొమ్మినేని శ్రీనివాసరావు -
‘ఎంత బలవంతులైనా ఢీకొట్టే వ్యక్తిగా చూపిస్తుంది’
సాక్షి, కృష్ణా : నందివాడ మండలం జొన్నపాడు గ్రామంలో ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలినాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయయూర్తి రాకేష్ కుమార్ జడ్జిమెంట్‌లో చేసిన వ్యాఖ్యలపై మంత్రి స్పందించారు. పదవీ విరమణ చేసి వెళ్లిన న్యాయమూర్తి రాకేష్ కుమార్.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురించి గూగుల్ సెర్చ్ చేస్తే ఏదో వస్తుందని అంటున్నారని, కానీ తను సెర్చ్ చేస్తే ఆయన కుటుంబ నేపథ్యం వస్తోందన్నారు. 2009లో రాజకీయాల్లోకి వచ్చినప్పటినుంచి ఇప్పటి వరకు, అవతలి వైపు ఎంత బలవంతులు ఉన్నా ఢీ కొట్టే వ్యక్తిగా చూపిస్తుందని పేర్కొన్నారు. దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయనివిధంగా సంక్షేమ పథకాలు అమలు చేసిన వ్యక్తిగా గూగుల్‌లో కనపడుతుందన్నారు. ‘‘చూసే వాళ్ళు ఏది కావాలంటే అదే గూగుల్‌లో వస్తుంది. పదవీ విరమణ చేసిన న్యాయమూర్తి గుగూల్ సెర్చ్ చేస్తే ఏదో వచ్చిందని ఆర్డర్ కాపీలో పెట్టాడు. గూగుల్‌లో చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ పేరు నొక్కినా అదే వస్తుంది. అయితే తాము వెదికితే మాత్రం సీఎం జగన్ ఎవరి ముందు తలవంచరు. దేశ చరిత్రలో నలభై సంవత్సరాల చరిత్ర గల పార్టీలతో ఆయన ఢీకొట్టినట్లు మాకు కనిపిస్తుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఏ మంచి పనిచేసినా అడ్డం పడాలనే దుర్మార్గులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. ఎంతమంది కలిసి అడ్డుపడ్డా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇచ్చిన ప్రతి హమీని అమలు చేస్తారు. సీఎం జగన్ రాష్ట్రంలో ప్రజలను, దేవుడిని, దివంగత నేత రాజశేఖరరెడ్డిని నమ్మి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారు. దేవుడి ఆశీస్సులు తో పాటు మీ ఆశీస్సులతో నిజాయితీగా, అవినీతి లేని పాలన చేస్తున్నారు. దేవుడి ఆశీస్సులు, రాజశేఖరరెడ్డి ఆశీస్సులు ఎప్పుడూ సీఎంకు ఉంటాయి. మీ అందరి దీవెనలు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి ఉండాలి. రాష్ట్రంలోకి చాలామంది వస్తుంటారు, పోతుంటారు. వారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు’’ అని పేర్కొన్నారు. ‘‘సీఎం వైఎస్ జగన్ మీ కోసమే ఉన్నారు. ఇచ్చిన ప్రతి వాగ్ధానం అమలు చేస్తారు’’ అని ప్రజలకు హామీ ఇచ్చారు. -
జస్టిస్ రాకేశ్‌కుమార్ పదవీ విరమణ
సాక్షి, అమరావతి: రాష్ట్ర హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ రాకేశ్‌కుమార్ గురువారం పదవీ విరమణ చేశారు. గత ఏడాది నవంబర్ 9న పాట్నా హైకోర్టు నుంచి బదిలీపై ఇక్కడికి వచ్చిన ఆయన 13 నెలల పాటు ఇక్కడ ఉన్నారు. పదవీ విరమణ అనంతర కార్యక్రమం తరువాత గురువారం రాత్రే ఆయన కుటుంబ సమేతంగా తన స్వస్థలం పాట్నా కు వెళ్లిపోయారు. ప్రతి న్యాయమూర్తి పదవీ విరమణ సందర్భంగా ఏర్పాటు చేసే అధికారిక వీడ్కోలు కార్యక్రమాన్ని హైకోర్టు ఈసారి ఏర్పాటు చేయలే దు. ప్రధాన న్యాయమూర్తి కోర్టు హాలులో న్యాయమూర్తులంతా సమావేశం కావడం సంప్రదాయంగా వస్తోంది. కరోనా నేపథ్యంలో ఈ వీడ్కోలు కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైకోర్టు నిర్వహించింది. అయితే తనకు అధికారిక వీడ్కోలు కార్యక్రమం వద్దని జస్టిస్ రాకేశ్‌కుమారే తిరస్కరించినట్లు హైకోర్టు వర్గాలు చెబుతున్నాయి. దీంతో న్యాయమూర్తులు జడ్జిల లాంజ్‌లోనే జస్టిస్ రాకేశ్ కుమార్ దంపతులను సత్కరించారు. తరువాత తెలుగుదేశం పార్టీ న్యాయవాదులు జస్టిస్ రాకేశ్ కుమార్‌ను ఆయన చాంబర్లో ప్రత్యేకంగా కలిసి సత్కరించి, జ్ఞాపికను బహూకరించారు. చివరిగా న్యాయమూర్తులందరూ కారు వరకు వచ్చి జస్టిస్ రాకేశ్‌కుమార్‌కు వీడ్కోలు పలికారు. జస్టిస్ రాకేశ్‌కుమార్ కారులో వెళుతూ రోడ్డుకు ఇరువైపులా నిల్చున్న అమరావతి రైతుల్ని చూసి కారును స్లో చేసి, కారు తలుపు తీశారు. దీంతో రైతులు ఆయన వద్దకు వెళ్లి కండువాలతో సత్కరించి, జ్ఞాపికలు బహూకరించారు. ఆయన నవ్వుతూ వాటిని స్వీకరించారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా విమానాశ్రయానికి వెళ్లిపోయారు. ఇదిలా ఉంటే.. సిక్కిం హైకోర్టుకు బదిలీ అయిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి జనవరి 4న అక్కడ ప్రమాణం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. -
నన్ను తప్పుకోమని కోరటం ధిక్కారపూర్వక చర్యే!
సాక్షి,అమరావతి: అనుమానం నిజమైంది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాకేశ్ కుమార్ గురించి రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని రోజులూ వ్యక్తం చేస్తూ వచ్చిన ఆందోళన వాస్తవమేనని తేలింది. రిటైరవటానికి ఒక్క రోజు ముందు జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిస్ దొనడి రమేశ్‌లతో కూడిన ధర్మాసనం అటు సుప్రీంకోర్టుపై, ఇటు ముఖ్యమంత్రిపై, రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఏ పిటిషనరు కూడా వాదనల్లో లేవనెత్తని అంశాలను, అసలు పిటిషన్లో కూడా లేని అంశాలను... తమ ముందున్న కేసుతో సంబంధం లేని వివరాలను, ఫేక్ వెబ్సైట్లలో, సోషల్ మీడియాలో పొందుపరిచిన పలు అంశాలను ధర్మాసనం తన తీర్పులో ప్రస్తావించింది. ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేకున్నా సీఎం వైఎస్ జగన్ గురించి అభ్యంతరకరంగా తన తీర్పులో తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అంతేకాక సుప్రీంకోర్టు గురించి, సుప్రీంకోర్టు కొలీజియం గురించి కూడా పలు వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్‌ల బదిలీలను ధర్మాసనం పరోక్షంగా తప్పుపట్టింది. బదిలీ విషయంలో సుప్రీంకోర్టు కొలీజియం తీరుపై కూడా ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది. ధర్మాసనం తన 55 పేజీల్లో ఎక్కువ శాతాన్ని ఈ కేసుతో సంబంధం లేని విషయాల గురించి ప్రస్తావించడానికి కేటాయించింది. ఆ వ్యాఖ్యలు చూసే.. రెక్యూజ్ పిటిషన్ అసలు ఈ కేసు ఏంటంటే... మిషన్ బిల్డ్ ఏపీ కింద ప్రభుత్వ ఆస్తులను బహిరంగ వేలం ద్వారా విక్రయించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కొందరు సవాలు చేశారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిగినపుడల్లా జస్టిస్ రాకేశ్ కుమార్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. దీంతో ఈ కేసును ఆయన విచారించకూడదని, ఆయనకు ప్రభుత్వంపై ముందే ఒక స్థిరాభిప్రాయం ఉన్నట్టు కనిపిస్తోంది కనక ఆయన విచారిస్తే న్యాయం జరిగే అవకాశం ఉండదని, కేసును వేరే బెంచ్‌కు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అభ్యరి్థంచింది. న్యాయవ్యవస్థ నిష్పాక్షికంగా ఉండటమే కాదు. నిష్పాక్షికంగా ఉన్నట్టు కనిపించాలి కూడా... అనే సూత్రాన్ని అనుసరించి ఇక్కడ అలా కనిపించటం లేదు కనక ఆయన ‘రెక్యూజ్’ కావాలంటూ పిటిషన్ దాఖలు చేసింది. కానీ ఈ విచారణ నుంచి తప్పుకోవటానికి జస్టిస్ రాకేశ్ కుమార్ నిరాకరించారు. రెక్యూజ్ పిటిషన్‌పై కూడా తానే విచారణ చేపట్టారు. చివరకు పదవీ విరమణకు ఒక్కరోజు ముందు... రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను తోసిపుచ్చుతూ ఉత్తర్వులిచ్చారు. అంతేకాదు!! జస్టిస్ రాకేశ్ కుమార్‌ను విచారణను నుంచి తప్పుకోవాలని ప్రభుత్వం తరఫున మిషన్ మిల్డ్ కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ అభ్యరి్థంచటం కోర్టు ధిక్కార చర్యే అవుతుందని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రభుత్వ అభ్యర్థన హానికరమైనదని, అది ఏ మాత్రం సాధ్యం కానిదని తెలిపింది. ప్రవీణ్ కుమార్ ప్రమాణపూర్వకంగా తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారంటూ... ఆయన అఫిడవిట్లో పేర్కొన్న అంశాలకు ఏ ఆధారాలూ లేవంది. పెర్జురీ (తప్పుడు ఆఫిడవిట్) కింద ప్రవీణ్‌కుమార్‌పై క్రిమినల్ ప్రాసిక్యూషన్‌కు చర్యలు తీసుకోవాలని, ఈ మేరకు సంబంధిత కోర్టులో ఫిర్యాదు చేయాలని హైకోర్టు రిజిష్ట్రార్ జనరల్‌ను ఆదేశించింది. అలాగే కోర్టు ధిక్కార చర్యలు ఎందుకు తీసుకోరాదో వివరణ ఇవ్వాలని ప్రవీణ్‌కుమార్‌ను ఆదేశిస్తూ ఆయనకు ఆరు వారాలు గడువిచి్చంది. తదుపరి విచారణను 2021 ఫిబ్రవరి రెండో వారానికి వాయిదా వేసింది. జస్టిస్ రాకేశ్‌కుమార్ రెక్యూజల్ కోసం ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను తప్పుపట్టిన ధర్మాసనం, ప్రభుత్వం నుంచి ఇలాంటి అభ్యర్థనను ఆశించలేదని తెలిపింది. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఏదైనా సాధ్యమేనని, ఇలాంటి చర్యలకు న్యాయస్థానాలు భయపడవని వ్యాఖ్యానించింది. అకస్మాత్తుగా తీర్పు వెలువరించిన ధర్మాసనం మిషన్ బిల్డ్ ఏపీ కేసు విచారణకు వచ్చినపుడల్లా జస్టిస్ రాకేశ్‌కుమార్ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీసిందా.. రాష్ట్రంలో ఆర్థిక అత్యాయక పరిస్థితి ఉందా? అన్నారు. దీనిపై ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ వ్యాజ్యాలపై మీరు (జస్టిస్ రాకేశ్ కుమార్) విచారణ జరిపితే, మాకు న్యాయం జరిగే పరిస్థితి ఉండదని పేర్కొంటూ... ఆయన విచారణ నుంచి తప్పుకోవాలని కోరుతూ ప్రభుత్వం తరఫున ప్రవీణ్‌కుమార్ రెక్యూజ్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ రాకేశ్ ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా జస్టిస్ రాకేశ్ కుమార్, ప్రభుత్వం చెబుతున్న వ్యాఖ్యలను తాను చేయలేదన్నారు. కానీ దీన్ని అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తోసిపుచ్చారు. ప్రవీణ్‌కుమార్ స్వయంగా విన్నారని, అలాగే తాను, తన తోటి న్యాయవాదులు కూడా విన్నామని చెప్పారు. అనంతరం ధర్మాసనం తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. నిజానికి బుధవారం నాటి కేసుల విచారణ జాబితాలో ఈ కేసు లేదు. అకస్మాత్తుగా ఈ కేసులో తీర్పును వెలువరిస్తున్నట్లు ధర్మాసనం ఈ కేసుతో సంబంధం ఉన్న న్యాయవాదులకు తెలియజేయటం గమనార్హం. (న్యాయమే నెగ్గుతుంది: సీఎం వైఎస్ జగన్) -
తప్పుకోవాలని కోరే పరిస్థితులు మీరే కల్పించారు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఆస్తులను వేలం ద్వారా విక్రయించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాల్లో జరుగుతున్న విచారణ నుంచి మిమ్మల్ని (జస్టిస్ రాకేశ్‌కుమార్) తప్పుకోవాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసే పరిస్థితులు మీరే కల్పించారని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం జస్టిస్ రాకేశ్‌కుమార్‌కు స్పష్టంచేసింది. ఈ విషయాన్ని బరువెక్కిన బాధాతప్త హృదయంతో చెబుతున్నామని ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వివరించారు. కేవలం న్యాయం చేయడమే కాదని, న్యాయం చేసినట్లు కూడా కనిపించాల్సిన బాధ్యత కూడా న్యాయస్థానాలపై ఉందన్నారు. ప్రజామోదంతో ఎన్నికైన ప్రభుత్వాన్ని న్యాయబద్ధంగా నిర్వర్తించాల్సిన విధులను నిర్వర్తించకుండా అడ్డుకున్నారని తెలిపారు. ప్రభుత్వాన్ని ఊపిరి ఆడనివ్వకుండా చేయడమే కాక, వాదన వినిపించకుండా గొంతు కూడా నొక్కారని వివరించారు. దీనిపై స్పందించిన జస్టిస్ రాకేశ్‌కుమార్.. విచారణ సందర్భంగా ఎన్నో అంటుంటామని, సమాధానాలు రాబట్టేందుకు పలు ప్రశ్నలు అడుగుతుంటామని, వాటికి సమాధానం ఇస్తే సరిపోతుందన్నారు. తాను ఈ వ్యాజ్యాల్లో విచారణ సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వం అభ్యంతరం చెబుతూ, ఈ రెక్యూజ్ (విచారణ నుంచి తప్పుకోవడం) పిటిషన్ దాఖలు చేసిందన్నారు. ఆ వ్యాఖ్యలు తాను చేశానో లేదో ప్రస్తుత ధర్మాసనంలో ఉన్న తన సోదరి జడ్జి జస్టిస్ ఉమాదేవి చెప్పలేరని, అందువల్ల అప్పటి బెంచ్‌లో ఉన్న జస్టిస్ డి.రమేశ్‌తో కలిసి ప్రభుత్వ పిటిషన్ (రెక్యూజ్) విచారిస్తానని జస్టిస్ రాకేశ్ తెలిపారు. అందులో భాగంగా విచారణను ఈ నెల 28కి వాయిదా వేశారు. అలాగే, ప్రభుత్వం దాఖలు చేసిన రెక్యూజ్ పిటిషన్‌పై పిటిషనర్లు కావాలనుకుంటే ఈ నెల 23 నాటికి కౌంటర్లు దాఖలు చేయవచ్చునని తెలిపారు. ఈ మేరకు జస్టిస్ రాకేశ్, జస్టిస్ ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. మిషన్ బిల్డ్ ఏపీ కింద ప్రభుత్వ భూములను వేలం ద్వారా విక్రయించాలన్న సర్కారు నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఈ వ్యాజ్యాలపై జస్టిస్ రాకేశ్ ధర్మాసనం విచారణ జరుపుతోంది. ఇటీవల ఈ వ్యాజ్యాల విచారణ సందర్భంగా జస్టిస్ రాకేశ్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాగే, వ్యంగ్య వ్యాఖ్యలు కూడా చేశారు. దీనిపై ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. ఈ వ్యాజ్యాల్లో ఆయన పక్షపాతంతో వ్యవహరించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తంచేస్తూ, విచారణ నుంచి ఆయనను తప్పుకోవాలని కోరుతూ రెక్యూజ్ పిటిషన్ దాఖలు చేసింది. మిగిలిన వ్యాజ్యాలతో పాటు ఈ రెక్యూజ్ పిటిషన్‌పై కూడా ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. కోర్టులతో పనిలేకుండా అన్నీ ప్రభుత్వం చేస్తుందని మీ ఉద్దేశమా? పిటిషనర్ల తరఫు న్యాయవాదుల్లో ఒకరైన బి.నళిన్‌కుమార్ వాదనలు వినిపిస్తూ.. ఈ ధర్మాసనం సభ్యుడిగా ఉండాలా? లేక విచారణ నుంచి తప్పుకోవాలా? అన్నది మీరు (జస్టిస్ రాకేశ్‌కుమార్) మాత్రమే స్వయంగా తీసుకోవాల్సిన నిర్ణయమని చెప్పారు. ఈ సమయంలో.. ప్రజామోదంతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలను న్యాయబద్ధమైన విధులను నిర్వర్తించకుండా అడ్డుకుంటున్నారని అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి చెప్పారు. దీనికి జస్టిస్ రాకేశ్‌కుమార్ స్పందిస్తూ, ప్రజలు పూర్తిస్థాయి తీర్పునిచ్చారు కాబట్టి, న్యాయస్థానాలతో పనిలేకుండా అన్నీ మేమే (ప్రభుత్వం) చేసేస్తామన్నది మీ ఉద్దేశమా? అంటూ ప్రశ్నించారు. అది తన ఉద్దేశంతో ఎంతమాత్రం కాదని పొన్నవోలు తెలిపారు. నా చివరి దశలో ఇలాంటి పిటిషన్లు వస్తాయనుకోలేదు.. అనంతరం జస్టిస్ రాకేశ్‌కుమార్ స్పందిస్తూ, జస్టిస్ రమేశ్‌తో కలిసే ఈ రెక్యూజ్ పిటిషన్‌ను విచారించడం సబబుగా ఉంటుందని తెలిపారు. పదవీ విరమణ దశలో తనపై ఇలాంటి పిటిషన్లు వస్తాయని అనుకోలేదని, చివరి శ్వాస వరకు న్యాయవ్యవస్థ ప్రతిష్టను కాపాడేందుకు ప్రయత్నిస్తానని జస్టిస్ రాకేశ్ వ్యాఖ్యానించారు. -
ఏపీ హైకోర్టు ఉత్తర్వులు ఆందోళనకరం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాంగం వైఫల్యం చెందిందా? లేదా?.. అనేది తేలుస్తామంటూ ఈ ఏడాది అక్టోబర్ 1న హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తమవారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారంటూ కొందరు హెబియస్ కార్పస్ పిటిషన్లు దాఖలు చేస్తే ఆ వ్యాజ్యాల్లో ఓ న్యాయస్థానం ఇలాంటి ఉత్తర్వులు జారీ చేయడం ఎప్పుడైనా, ఎక్కడైనా మనం చూశామా? అంటూ విస్మయం వ్యక్తం చేసింది. ఇన్నేళ్ల మీ అనుభవంలో మీరైనా ఇలాంటి ఉత్తర్వులు చూశారా? అంటూ ప్రతివాదుల తరఫు న్యాయవాదిని కూడా ప్రశ్నించింది. రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయని ఆ న్యాయమూర్తులు భావించడానికి అంతగా ప్రభావితం చేసిన అంశాలేమున్నాయో అంతుబట్టడం లేదని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో రాజ్యాంగం వైఫల్యం చెందిందా? లేదా? అన్న అంశాన్ని తేలుస్తామంటూ జస్టిస్ రాకేశ్ కుమార్ నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులపై తాజాగా సుప్రీంకోర్టు ‘స్టే’ విధించింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఈ ‘స్టే’ ఉత్తర్వులు అమలులో ఉంటాయని స్పష్టం చేస్తూ ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. క్రిస్మస్, సంక్రాంతి సెలవులు ముగిసిన తరువాత దీనిపై తదుపరి విచారణ చేపడతామని ప్రకటించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే, న్యాయమూర్తులు ఏఎస్ బొప్పన్న, వి.రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. సుమోటోగా హైకోర్టు విచారణ.. తమ వారిని పోలీసులు అన్యాయంగా అదుపులోకి తీసుకున్నారని, వారిని కోర్టు ముందు హాజరుపరిచేలా ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టులో పలు హెబియస్ కార్పస్ పిటిషన్లు దాఖలు కావడం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై జస్టిస్ రాకేశ్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే అకస్మాత్తుగా ధర్మాసనం రాష్ట్రంలో రాజ్యాంగం వైఫల్యం చెందిందా? లేదా? అన్న అంశంపై తేలుస్తామని, ఆ దిశగా వాదనలు వినిపించాలని ప్రభుత్వ, పోలీసుల తరఫు న్యాయవాదులను ఆదేశిస్తూ అక్టోబర్ 1న ఉత్తర్వులు జారీ చేసింది. రాజ్యాంగం వైఫల్యం చెందినట్లు పిటిషనర్లు ఎవరూ పేర్కొనకున్నా, ఎలాంటి పిటిషన్ దాఖలు చేయకపోయినా కూడా ధర్మాసనం సుమోటోగా విచారణ ప్రారంభించింది. గత కొద్ది వారాలుగా రోజూ వారీ విచారణ ప్రారంభించింది. విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ వస్తోంది. అయితే అసలు రాజ్యాంగ వైఫల్యంపై విచారణ జరిపే పరిధి హైకోర్టుకు లేదని, అందువల్ల అక్టోబర్ 1న జారీ చేసిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం రీకాల్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ రీకాల్ పిటిషన్‌ను జస్టిస్ రాకేశ్ కుమార్ ఒక్క నిమిషంలోనే కొట్టి వేశారు. కావాలంటే దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లవచ్చని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించి, రాజ్యాంగం వైఫల్యం చెందిందా? లేదా? అన్న అంశంపై తేలుస్తామంటూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ అప్పీల్ దాఖలు చేసింది. రాజ్యాంగ వైఫల్యంపై అధికరణ 356 కింద రాష్ట్రపతి జోక్యం చేసుకోవచ్చే కానీ న్యాయస్థానాలు కాదని రాష్ట్ర ప్రభుత్వం తన అప్పీల్లో పేర్కొంది. ఈ అప్పీల్‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఏ.బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ (ఎస్జీ) తుషార్ మెహతా, రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్, పోలీసుల తరఫున సీనియర్ న్యాయవాది సర్వ సత్యనారాయణ ప్రసాద్ తదితరులు హాజరయ్యారు. హైకోర్టు ఉత్తర్వులు సబబు కాదు... హైకోర్టు ఆదేశాలు ఏ మాత్రం సబబు కాదని రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాదులు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టుకు నివేదించారు. హెబియస్ కార్పస్ పిటిషన్లలో రాజ్యాంగ వైఫల్యంపై విచారణ జరుపుతామన్న హైకోర్టు ఉత్తర్వులు సహేతుకం కాదన్నారు. ఈ సమయంలో కేసు పూర్వాపరాలను పరిశీలించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. అక్టోబర్ 1న హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులపై స్టే విధిస్తున్నాం.. అని స్పష్టం చేసింది. రెండింటినీ వేర్వేరుగా చూడటం లేదు.. ప్రతివాది తరఫున సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా (తెలుగుదేశం పార్టీ తరఫున ప్రతీ కేసులో వాదనలు వినిపిస్తుంటారు) జోక్యం చేసుకుంటూ 14 హెబియస్ కార్పస్ పిటిషన్లను హైకోర్టు విచారించిందని, ఆ సందర్భంగా రాజ్యాంగం వైఫల్యం చెందిందా? లేదా? అన్న అంశంపై కూడా విచారణ జరపాలని నిర్ణయించిందని తెలిపారు. దీనిపై జస్టిస్ బాబ్డే స్పందిస్తూ తాము రెండింటినీ వేర్వేరుగా చూడటం లేదన్నారు. అసలు ఈ రోజు ఏం చెప్పదలచుకున్నారో స్పష్టంగా చెప్పండి.. అని లూథ్రానుద్దేశించి సీజే వ్యాఖ్యానించారు. తమ ముందున్న హెబియస్ కార్పస్ పిటిషన్లలో కనిపించిన అంశాల ఆధారంగా హైకోర్టు రాజ్యాంగం వైఫల్యం చెందిందా? లేదా? అన్న అంశంపై విచారణ జరుపుతోందని లూథ్రా పేర్కొన్నారు. హైకోర్టు అలాంటి ఉత్తర్వులెలా ఇవ్వగలదు? దీనిపై సుప్రీంకోర్టు ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రంలోని వ్యవస్థలన్నీ (శాసన, న్యాయ, కార్యనిర్వాహక) కుప్పకూలిపోయానని భావించినప్పుడు హైకోర్టు మాత్రం రాజ్యాంగ వైఫల్యంపై అలాంటి ఉత్తర్వులు ఎలా ఇవ్వగలదని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే ప్రశ్నించారు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు సబబేనా? అని అడిగారు. అసలు రాజ్యాంగం వైఫల్యం చెందిందని భావించేందుకు న్యాయమూర్తులను ప్రభావితం చేసినంత అంశాలు ఏమున్నాయో తమకు అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. ఇన్నేళ్లలో ఎప్పుడైనా చూశారా? కాగా రాజ్యాంగం వైఫల్యంపై హైకోర్టు కేవలం ప్రశ్న మాత్రమే లేవనెత్తిందని, అవి ఆదేశాలు కాదని సిద్దార్థ లూథ్రా పేర్కొనగా.. మీరెంత కాలం నుంచి న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారని సీజే ప్రశ్నించారు. 29 ఏళ్లుగా న్యాయవాద వృత్తిలో ఉన్నానని లూథ్రా బదులివ్వడంతో ఇన్నేళ్లలో ఎప్పుడైనా ఏ కోర్టయినా ఇలాంటి కేసుల్లో (హెబియస్ కార్పస్) రాజ్యాంగం వైఫల్యంపై విచారణ జరుపుతామంటూ ఉత్తర్వులు ఇవ్వడం చూశారా? అంటూ జస్టిస్ బాబ్డే తిరిగి ప్రశ్నించారు. హైకోర్టు ఉత్తర్వులు అత్యున్నత న్యాయస్థానమైన తమకు ఆందోళన కలిగిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. అనంతరం హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధిస్తూ సీజే ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. -
‘రాజ్యాంగం వైఫల్యం’పై విచారణ నిరవధిక వాయిదా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రాజ్యాంగం వైఫల్యం చెందిందా? లేదా?.. అన్న అంశంపై విచారణ జరుపుతున్న జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిస్ ఉమాదేవిలతో కూడిన హైకోర్టు ధర్మాసనం తదుపరి విచారణను నిరవధికంగా వాయిదా వేసింది. రాజ్యాంగ వైఫల్యంపై హైకోర్టు జరుపుతున్న విచారణకు సంబంధించి తదుపరి చర్యలన్నీ నిలిపివేస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం స్టే ఉత్తర్వులు ఇవ్వడంతో ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన విషయాన్ని ప్రభుత్వ న్యాయవాది వైఎన్ వివేకానంద తెలియచేయడంతో జస్టిస్ రాకేశ్ ధర్మాసనం దీన్ని రికార్డు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసి అనంతరం బెంచ్ దిగి వెళ్లిపోయింది. అంతకు ముందు ఉదయం 11.30 గంటలకు విచారణ ప్రారంభం కాగానే రాజ్యాంగ వైఫల్యంపై విచారణ జరుపుతామన్న హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేశామని, అది కొద్దిసేపట్లో విచారణకు రానుందని ప్రభుత్వ న్యాయవాది వివేకానంద నివేదించారు. అందువల్ల ఈ వ్యాజ్యాల్లో విచారణను సోమవారానికి వాయిదా వేయాలని కోరగా అందుకు జస్టిస్ రాకేశ్ ధర్మాసనం నిరాకరిస్తూ మధ్యాహ్నం 2.15 గంటలకు విచారణ జరుపుతామని పేర్కొంది. వాయిదా సమస్యే లేదు.. మధ్యాహ్నమే విచారణ శుక్రవారం మధ్యాహ్నం బదులు విచారణను సోమవారం చేపట్టాలని ఈ వ్యాజ్యాల్లో ప్రభుత్వం తరపున హాజరవుతున్న సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి కూడా అభ్యర్థించారు. రాజ్యాంగ వైఫల్యంపై విచారణ జరిపే నిమిత్తం జారీ చేసిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని కోరుతూ ప్రభుత్వం దాఖలు చేసిన రీకాల్ పిటిషన్‌ను కొట్టివేస్తూ హైకోర్టు ఈ నెల 14న ఇచ్చిన ఉత్తర్వుల కాపీ తమకు అందలేదని తెలిపారు. రిజిస్ట్రీ సర్టిఫైడ్ కాపీ బదులు ఈ-మెయిల్ ద్వారా సాఫ్ట్ కాపీని పంపిందని, ఇది కోర్టు ఆదేశాలను అమలు చేయడం కిందకు రాదన్నారు. ఈ-మెయిల్ కాపీని తాము తదుపరి (పై కోర్టుల్లో సవాలు చేసేందుకు) వినియోగించడం సాధ్యం కాదని, అందువల్ల సర్టిఫైడ్ కాపీని ఇప్పించాల్సిన అవసరం ఉందని, విచారణ సోమవారం చేపట్టాలని నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. అయితే జస్టిస్ రాకేశ్ కుమార్ ఇందుకు నిరాకరిస్తూ మధ్యాహ్నమే విచారణ జరిపి తీరుతామని స్పష్టం చేశారు. వాయిదా వేస్తే మిన్ను విరిగి మీద పడదు... ఈ సమయంలో ప్రభుత్వం తరఫున హాజరవుతున్న మరో సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి స్పందిస్తూ మధ్యాహ్నం కాకుండా విచారణను సోమవారానికి వాయిదా వేయాలని కోరారు. తనకు వ్యక్తిగతమైన ఇబ్బంది ఉందని, అందుకే వాయిదా అడుగుతున్నానని తెలిపారు. వాయిదా వేయడం వల్ల వచ్చిన నష్టం ఏమీ లేదని, మిన్ను విరిగి మీద పడదని పేర్కొన్నారు. వ్యక్తిగత ఇబ్బంది ఉందని అభ్యర్థించినప్పుడు విచారణను వాయిదా వేయడం ఏపీ హైకోర్టు సంప్రదాయమని గుర్తు చేశారు. అయితే వాయిదా వేసేందుకు ధర్మాసనం నిరాకరించింది. న్యాయం జరుగుతుందన్న నమ్మకాన్ని కలిగించాలి... ఈ సమయంలో మోహన్‌రెడ్డి, జస్టిస్ రాకేశ్ కుమార్ల మధ్య వాడివేడిగా వాదనలు జరిగాయి. మధ్యాహ్నం విచారించి తీరుతామని జస్టిస్ రాకేశ్ స్పష్టం చేయగా ఇది అన్యాయమని, న్యాయస్థానానికి ఎంతమాత్రం తగదని మోహన్‌రెడ్డి నివేదించారు. కోర్టు ప్రొసీడింగ్స్ అన్నింటినీ కోర్టు రికార్డింగ్ (బ్లూజీన్స్ యాప్ ద్వారా వీడియో రికార్డింగ్) చేస్తోందన్న విషయం తెలుసని, తన వాదన రికార్డు కావాలన్న ఉద్దేశంతోనే కోర్టు అన్యాయంగా వ్యవహరిస్తోందని చెబుతున్నానని మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే తనను విచారణ నుంచి తప్పుకోవాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారని జస్టిస్ రాకేశ్ పేర్కొనగా ప్రతి దానిని విచారించాల్సిన బాధ్యత మీపై (ధర్మాసనం) ఉందని మోహన్‌రెడ్డి గుర్తు చేశారు. అలాగే న్యాయం జరుగుతుందన్న నమ్మకం కలిగించాలన్నారు. కోర్టుగా తాము తమ విధులను నిర్వర్తిస్తున్నామని జస్టిస్ రాకేశ్ వ్యాఖ్యానించగా ఎలాంటి పక్షపాతం లేకుండా, ముందస్తుగానే నిర్ణయానికి రాకుండా విచారణ జరపాల్సిన బాధ్యత మీపై ఉందని మోహన్‌రెడ్డి సమాధానమిచ్చారు. తాము తమ ప్రమాణం మేరకు నడుచుకుంటున్నామని, దాని నుంచి పక్కకు వెళ్లబోమని జస్టిస్ రాకేశ్ పేర్కొనగా మధ్యాహ్నం విచారణకు తాను హాజరుకాబోవడం లేదని, సోమవారం వాదనలు వినిపిస్తానని మోహన్‌రెడ్డి బదులిచ్చారు. వాయిదా కోరడం దుర్వినియోగం చేసినట్లా? ‘మీరు ఏం కావాలో అది చేసుకోండి... రాష్ట్ర ప్రభుత్వం రోజుకో న్యాయవాదిని నియమిస్తోంది’ అని జస్టిస్ రాకేశ్ వ్యాఖ్యానించగా.. ఎవరిని న్యాయవాదిగా నియమించుకోవాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ఇష్టమని మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఇదే రీతిలో కేసును వాయిదా వేయాలా? వద్దా? అన్నది తమ ఇష్టమని జస్టిస్ రాకేశ్ వ్యాఖ్యానించారు. మీరు కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేయాలనుకుంటే చేయవచ్చని జస్టిస్ రాకేశ్ వ్యాఖ్యానించగా మోహన్‌రెడ్డి ఘాటుగా స్పందిస్తూ వ్యక్తిగత ఇబ్బందుల వల్ల విచారణ వాయిదా వేయాలని కోరడం కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేయడం ఎలా అవుతుందని ప్రశ్నించారు. న్యాయవాదుల అభ్యర్థనను కోర్టు ఇలా భావిస్తుంటే తాము చేయగలిగింది ఏమీ లేదన్నారు. తిరిగి మధ్యాహ్నం విచారణ ప్రారంభం కాగానే సుప్రీంకోర్టులో ఏం జరిగిందని జస్టిస్ రాకేశ్ కుమార్ ప్రశ్నించారు. రాజ్యాంగ వైఫల్యంపై ఈ ధర్మాసనం జరుపుతున్న విచారణపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందని ప్రభుత్వ న్యాయవాది వివేకానంద తెలిపారు. దీంతో దీన్ని రికార్డు చేసుకున్న జస్టిస్ రాకేశ్ ధర్మాసనం తమ ముందున్న వ్యాజ్యాలపై విచారణను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసి బెంచ్ దిగి వెళ్లిపోయింది. 31న పదవీ విరమణ.. ఈలోపే నిర్ణయం వెలువరించేలా! తమవారిని పోలీసులు అక్రమంగా నిర్భంధించారంటూ హైకోర్టులో దాఖలైన వ్యాజ్యాలపై విచారణ జరుపుతూ వచ్చిన జస్టిస్ రాకేశ్, జస్టిస్ ఉమాదేవిల ధర్మాసనం అకస్మాత్తుగా రాష్ట్రంలో రాజ్యాంగం వైఫల్యం చెందిందా? లేదా? అనే అంశాన్ని తేలుస్తామంటూ అక్టోబర్ 1న ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 31న జస్టిస్ రాకేశ్ కుమార్ పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా ఈ వ్యాజ్యాలపై విచారణను ముగించాలన్న ఉద్దేశంతో ధర్మాసనం రోజూవారీ విచారణ ప్రారంభించింది. విచారణ సందర్భంగా జస్టిస్ రాకేశ్ పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రాజ్యాంగ వైఫల్యం జరిగిందని ఏ పిటిషనర్ పేర్కొనలేదని, పిటిషనర్లు కోరకుండా ఆ అంశంపై విచారణ జరపడం సరికాదని, అసలు ఆ అంశంపై విచారణ జరిపే పరిధి హైకోర్టుకు లేదని, అందువల్ల అక్టోబర్ 1న జారీ చేసిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో రీకాల్ పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్‌ను ఒక్క నిమిషంలో కొట్టివేసిన జస్టిస్ రాకేశ్ కుమార్ ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్‌ను వాదనలు వినిపించేందుకు, సుప్రీంకోర్టు తీర్పులను ప్రస్తావించేందుకు అనుమతించలేదు. కౌంటర్ దాఖలు చేసేందుకు సైతం అనుమతినివ్వలేదు. జస్టిస్ రాకేశ్ కుమార్ ఈ వ్యాజ్యంలో ఏ నిర్ణయం వెలువరించాలో ముందస్తుగానే ఓ నిర్ణయానికి వచ్చి విచారణ జరుపుతున్నారని, దీనివల్ల తమకు న్యాయం లభించదని భావిస్తూ విచారణ నుంచి జస్టిస్ రాకేశ్ తప్పుకోవాలంటూ (రెక్యూజల్) రాష్ట్ర ప్రభుత్వం ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది. ఇదే సమయంలో జస్టిస్ రాకేశ్ ధర్మాసనం జారీ చేసిన అక్టోబర్ 1 నాటి ఉత్తర్వులను, రీకాల్ పిటిషన్‌ను కొట్టివేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ దాఖలు చేసింది. -
జస్టిస్ రాకేష్ కుమార్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ‘రాజ్యాంగ సంక్షోభం’ అంశం విచారణలపై సుప్రీంకోర్టు శుక్రవారం స్టే ఇచ్చింది. ప్రభుత్వ ఎస్ఎల్పీ పిటిషన్‌ని విచారించిన కోర్టు.. దీనితో ముడిపడి ఉన్న ఇతర పిటిషన్లపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను నిలిపి వేస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాక హైకోర్టు జస్టిస్ రాకేష్ కుమార్, జస్టిస్ ఉమాదేవి బెంచ్ ఆదేశాలు, విచారణను కోర్టు తప్పుపట్టింది. హైకోర్టు ఆదేశాలు ఆందోళనకరంగా ఉన్నాయంటూ అత్యున్నత న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఏపీలో రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందని జస్టిస్ రాకేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు సరికాదని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఎస్ బోబ్డే స్పష్టం చేశారు. ఇక రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌ని వ్యతిరేకించిన న్యాయవాది సిద్దార్థ లూథ్రాపై సుప్రీంకోర్టు మండిపడింది. ‘మీరు ఎన్నాళ్ల నుంచి ప్రాక్టీసు చేస్తున్నారు.. గతంలో ఇలాంటి ఆదేశాలు ఎప్పుడైనా ఇచ్చారా’ అంటూ కోర్టు సిద్దార్థ లూథ్రాను ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో కనీసం హెబియస్ కార్పస్ పిటిషన్లపై విచారణకు అనుమతించాలన్న సిద్దార్థ లూథ్రా అభ్యర్థనని కోర్టు తిరస్కరించింది. రాజ్యంగం సంక్షోభంలో ఉందనే భావనతో జడ్జి ప్రభావితం అయినందున అన్ని విచారణలపైన స్టే విధిస్తున్నామని సుప్రీంకోర్టు వెల్లడించింది. సెలవుల తర్వాత తదుపరి విచారణ చేస్తామని తెలిపింది. (చదవండి: ప్రభుత్వ పిటిషన్‌పై విచారణ జరపాల్సిందే) -
ప్రభుత్వ పిటిషన్‌పై విచారణ జరపాల్సిందే
-
ప్రభుత్వ పిటిషన్‌పై విచారణ జరపాల్సిందే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రాజ్యాంగం వైఫల్యం చెందిందన్న అంశంపై జరుగుతున్న విచారణ నుంచి జస్టిస్ రాకేశ్‌కుమార్‌ను తప్పుకోవాలని కోరుతూ అనుబంధ పిటిషన్ దాఖలు చేశామని దానిపై ముందు విచారణ జరపాల్సిన అవసరముందని ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి జస్టిస్ రాకేశ్‌కుమార్ ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ తీవ్రమైనదని, దానిపై విచారణ జరపకుండా, అలా పక్కన పడేయడానికి వీల్లేదని ప్రభుత్వం తరఫున మరో సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డి హైకోర్టుకు నివేదించారు. విచారణ నుంచి తప్పుకోవాలని తాము చాలా గౌరవప్రదంగా కోరుతున్నామని, ఆ దిశగానే వాదనలు వినిపిస్తామన్నారు. మొదట ప్రభుత్వ పిటిషన్‌ను విచారించేందుకు నిరాకరించిన, జస్టిస్ రాకేశ్‌కుమార్ ఆ తరువాత అందుకు సమ్మతించి శుక్రవారం విచారణ జరుపుతామన్నారు. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రాకేశ్‌కుమార్, జస్టిస్ ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులిచ్చింది. అంతకుముందు.. పోలీసులపై దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్లు గురువారం విచారణకు వచ్చాయి. చదవండి: (చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలి) ప్రభుత్వ న్యాయవాది చింతల సుమన్ స్పందిస్తూ, జస్టిస్ రాకేశ్‌కుమార్‌ను విచారణ నుంచి తప్పుకోవాలని ప్రభుత్వం అనుబంధ పిటిషన్ దాఖలు చేసిందని.. అది విచారణకు రాలేదని, అందువల్ల తమ అనుబంధ పిటిషన్‌తో పాటు అన్నీ వ్యాజ్యాలను శుక్రవారం విచారించాలని అభ్యర్థించారు. కానీ, దీనిని తోసిపుచ్చిన జస్టిస్ రాకేశ్‌కుమార్, రాజ్యాంగం వైఫల్యం అంశంపై విచారణ కొనసాగుతుందని స్పష్టంచేశారు. వాదనలు వినిపిస్తే వినిపించాలని, లేకపోతే విచారణను ముగిస్తానన్నారు. ఈ సమయంలో సీవీ మోహన్‌రెడ్డి స్పందిస్తూ, ముందుస్తుగానే ఓ నిర్ణయానికి వచ్చేసి, ఈ కేసును విచారించడం సమర్థనీయం కాదని తెలిపారు. ఈ సమయంలో జస్టిస్ రాకేశ్ జోక్యం చేసుకుంటూ, నేను అలాంటి పిటిషన్‌ను విచారించబోనని తెలిపారు. ఈ పిటిషన్ వేయకూడదనే అనుకున్నాం ప్రభుత్వం ఈ పిటిషన్‌ను దాఖలు చేయకూడదనే అనుకున్నదని, ఆయితే మీరు (జస్టిస్ రాకేశ్) పిటిషన్ దాఖలు చేసే పరిస్థితులు కల్పించారని మోహన్‌రెడ్డి చెప్పారు. సుమన్ స్పందిస్తూ.. ప్రభుత్వ రీకాల్ పిటిషన్‌ను కొట్టేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను తమకు అందజేయాలని ఆదేశాలిచ్చినా ఇప్పటివరకు తమకు అందలేదని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఉచితంగా కాపీ ఇవ్వరని జస్టిస్ రాకేశ్ వ్యాఖ్యానించగా, తాము డబ్బు కట్టే దరఖాస్తు చేసుకున్నామని సుమన్ సమాధానమిచ్చారు. కాపీ రాకుంటే తామెలా సుప్రీంకోర్టుకు వెళ్లగలమన్నారు. మోహన్‌రెడ్డి స్పందిస్తూ.. కేసు ఫైళ్లను ఛాంబర్లో పెట్టుకుని, వాటిని రిజిస్ట్రీకి పంపకుంటే, తాము ఎప్పటికీ ఉత్తర్వుల కాపీని అందుకోలేమని చెప్పారు. న్యాయమూర్తి ఇందుకు సంబంధించిన అన్ని వ్యాజ్యాలను శుక్రవారానికి వాయిదా వేశారు. నో చెప్పడానికి వీల్లేదు.. ప్రభుత్వం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ రికార్డులను తెప్పించాలని.. మోహన్‌రెడ్డి కోరారు. కోర్టు ప్రతీ దానికీ, ప్రతీ దాన్ని నో చెప్పడానికి వీల్లేదన్నారు. ప్రభుత్వ అనుబంధ పిటిషన్ తమ ముందులేదని రాకేశ్ చెప్పగా, దానిని తెప్పించుకోవాలనడంతో మధ్యాహ్నం 2.15 గంటలకు ప్రభుత్వ పిటిషన్‌ను పరిశీలిస్తామని జస్టిస్ రాకేశ్ తెలిపారు. -
అభ్యర్థిస్తే బెదిరించినట్లా?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రాజ్యాంగం వైఫల్యం చెందిందా? లేదా అన్న అంశాన్ని తేలుస్తామంటూ గత కొద్ది రోజులుగా జస్టిస్ రాకేశ్ నేతృత్వంలోని ధర్మాసనం జరుపుతున్న విచారణలో బుధవారం కూడా వాడివేడిగా వాదనలు జరిగాయి. గత విచారణ సందర్భంగా తనను బెదిరించారంటూ జస్టిస్ రాకేశ్ కుమార్ ఆరోపించడంపై ప్రభుత్వ న్యాయవాదులు చింతల సుమన్, వైఎన్ వివేకానంద, స్పెషల్ సీనియర్ కౌన్సిల్ సత్యనారాయణ ప్రసాద్ తీవ్రంగా అభ్యంతరం తెలిపారు. పలు అభ్యర్థనలతో పిటిషన్లు దాఖలు చేయడం, కేసును వాయిదా వేయాలని కోరడం వంటి వాటిని బెదిరింపులని ఎలా అంటారంటూ ప్రశ్నించారు. వాస్తవానికి కోర్టు ద్వారా తామే బెదిరింపులకు గురవుతున్నామని తెలిపారు. సత్యనారాయణ ప్రసాద్ వాదనలు కొనసాగిస్తూ.. సోమవారం నాటి విచారణ సందర్భంగా అడ్వొకేట్ జనరల్ (ఏజీ) విషయంలో జస్టిస్ రాకేశ్ కుమార్ వ్యవహరించిన తీరును ఎత్తిచూపారు. ఏజీ పట్ల గౌరవప్రదంగా వ్యవహరించలేదని, వాదనలు వినిపించేందుకు, కోర్టు తీర్పులను ప్రస్తావించేందుకు సైతం ఆయనను అనుమతించలేదని, దీనిని అందరూ గమనించారని వివరించారు. న్యాయమూర్తులు మౌఖికంగా గానీ, తీర్పుల్లో గానీ ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేయరాదని, అలాగే వ్యక్తుల ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేయరాదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఓ కేసు విచారణకు నిర్ధిష్టమైన విధి విధానాలు ఉంటాయని, వాటికి అనుగుణంగా తమకు కౌంటర్ దాఖలుకు, వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ న్యాయవాదులు, స్పెషల్ కౌన్సిల్ గట్టిగా చెప్పారు. వీరి వాదనతో ఒకింత వెనక్కి తగ్గిన జస్టిస్ రాకేశ్‌కుమార్.. ఈ అంశం నుంచి వాదనలను మళ్లించేందుకు పలుమార్లు ప్రయత్నించారు. చివరకు విచారణను జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం గురువారానికి వాయిదా వేసింది. రాజ్యాంగం వైఫల్యం చెందిందన్న అంశంపై విచారణ జరిపే పరిధి లేదని, అందువల్ల ఆ అంశంపై విచారణ జరుపుతామంటూ ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలన్న తమ పిటిషన్‌ను కొట్టేస్తూ ఇచ్చిన ఉత్తర్వులపై ఈనెల 18న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని, అందువల్ల విచారణను 21వ తేదీకి వాయిదా వేయాలన్న స్పెషల్ కౌన్సిల్ అభ్యర్థనను జస్టిస్ రాకేశ్ కుమార్ తోసిపుచ్చారు. కేసు వాయిదా కోసం పలుమార్లు సత్యనారాయణ ప్రసాద్ అభ్యర్థనలు చేస్తుండటంతో, కోర్టు ప్రొసీడింగ్స్‌కు ఆటంకం కలిగిస్తున్నారంటూ ధర్మాసనం తన ఉత్తర్వుల్లో రికార్డ్ చేసింది. కౌంటర్ దాఖలుకు అనుమతినివ్వని విషయాన్ని రికార్డ్ చేయాలని సుమన్ ధర్మాసనాన్ని కోరారు. తమ వాదనలు వినిపించేందుకు సైతం అవకాశం ఇవ్వలేదని, ఈ కోర్టు సహజ న్యాయ సూత్రాలను అను సరించలేదన్నారు. దీంతో ప్రభుత్వ రీకాల్ పిటిషన్‌ను కొట్టేస్తూ ఈ నెల 14న తామిచ్చిన ఉత్తర్వుల కాపీని ప్రభుత్వానికి అందచేయాలని రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది. సుమోటోగా విచారిస్తున్న జస్టిస్ రాకేశ్ ధర్మాసనం పోలీసులు చేసిన అరెస్టులపై పలువురు వ్యక్తులు వేసిన హెబియస్ కార్పస్ పిటిషన్లు, రాజధాని ప్రాంతంలో ఇతరులెవ్వరూ పోటీగా నిరసనలు చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ టీడీపీ నేత తెనాలి శ్రావణ్‌కుమార్ వేసిన పిల్‌పై విచారణ జరుపుతున్న జస్టిస్ రాకేశ్ నేతృత్వంలోని ధర్మాసనం, రాష్ట్రంలో రాజ్యాంగం వైఫల్యం చెందిందా? లేదా అన్న అంశాన్ని తేలుస్తామని తెలిపింది. వాస్తవానికి ఏ పిటిషనర్ కూడా రాజ్యాంగం వైఫల్యం చెందిందని ప్రకటించాలని కోర్టును కోరకపోయినా.. జస్టిస్ రాకేశ్ కుమారే సుమోటోగా తీసుకుని ఆ విషయాన్ని తేలుస్తామంటూ విచారణ మొదలుపెట్టారు. బుధవారం విచారణ ప్రారంభం కాగానే, తమ రీకాల్ పిటిషన్‌ను కొట్టేస్తూ ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నామని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. దీనికి జస్టిస్ రాకేశ్ కుమార్ స్పందిస్తూ, సుప్రీంకోర్టు స్టే ఇస్తే మొత్తం విచారణ నిలిచిపోతుందని, అయితే సుప్రీంకోర్టు నుంచి ప్రస్తుతం ఎలాంటి ఉత్తర్వులు లేనందున విచారణ కొనసాగిస్తామని తెలిపారు. -
ఒక్కరోజే 6,351 కేసుల పరిష్కారం
సాక్షి, అమరావతి: జాతీయ లోక్ అదాలత్‌లో భాగంగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా హైకోర్టుతో సహా అన్ని న్యాయస్థానాల్లో ఈ–లోక్ అదాలత్ నిర్వహించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, లీగల్ సర్వీసెస్ అథారిటీ ప్యాట్రన్ ఇన్ చీఫ్, లీగల్ సరీ్వసెస్ అథారిటీ చైర్మన్ జస్టిస్ రాకేశ్ కుమార్ ఆదేశాల మేరకు ఈ–లోక్ అదాలత్ చేపట్టారు. హైకోర్టులో మూడు బెంచ్‌లు, 13 జిల్లాల్లోని కోర్టుల్లో 322 లోక్ అదాలత్ బెంచ్‌లు ఏర్పాటు చేశారు. ఈ–లోక్ అదాలత్‌లో మొత్తం 6,351 కేసులను పరిష్కరించారు. రూ.33.77 కోట్లను సెటిల్మెంట్ కింద చెల్లింపులు చేశారు. ఈ–లోక్ అదాలత్‌కు సహకరించిన వారందరికీ న్యాయసేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి చిన్నంశెట్టి రాజు కృతజ్ఞతలు తెలిపారు. హైకోర్టులో 262 కేసులు పరిష్కారం... హైకోర్టులో నిర్వహించిన ఈ–లోక్ అదాలత్ కేసులను న్యాయమూర్తులు జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్, జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్ నైనాల జయసూర్య బెంచ్‌లు విచారించాయి. ఈ మూడు బెంచ్‌లు 368 కేసులను విచారించి, అందులో 262 కేసులను పరిష్కరించాయి. రూ.1.01 కోట్లను సెటిల్మెంట్ కింద నిర్ణయించాయి. హైకోర్టులో లోక్ అదాలత్ విజయవంతం కావడానికి సహకరించిన వారికి హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ కార్యదర్శి ఎంవీ రమణకుమారి కృతజ్ఞతలు తెలిపారు. -
పేదలకు ఇకపై ఉచిత ప్రతివాద న్యాయసేవలు
అనంతపురం లీగల్: పేద, బడుగు వర్గాలపై నమోదైన క్రిమినల్ కేసుల్లో ఉచిత న్యాయ సహాయం అందించేందుకు న్యాయవాదుల నియామకానికి జాతీయ న్యాయ సేవాధికార సంస్థ శ్రీకారం చుట్టిందని రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ కార్యనిర్వాహక అధ్యక్షులు, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాకేష్‌కుమార్ చెప్పారు. పైలట్ ప్రాజెక్ట్ కింద అనంతపురం జిల్లాకు మంజూరైన న్యాయ సహాయ ప్రతివాద న్యాయవాది వ్యవస్థను జస్టిస్ రాకేష్‌కుమార్ శుక్రవారం డిజిటల్ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెషన్స్ కేసుల్లో పేదవారి తరఫున అండగా నిలిచి న్యాయసహాయం అందించటానికి ఈ వ్యవస్థ చక్కటి అవకాశమన్నారు. జిల్లా పరిపాలనా న్యాయమూర్తి, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్.రఘునందన్‌రావు మాట్లాడుతూ.. సకాలంలో సరైన న్యాయ సహాయకులు లేక ఎందరో జైళ్లలో మగ్గిపోతున్నారని, వారందరికీ అండగా లీగల్ ఎయిడ్ డిఫెన్స్ సిస్టం నిలుస్తుందని చెప్పారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మెంబర్ సెక్రటరీ చిన్నంశెట్టి రాజు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణసారిక, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి గరికపాటి దీనబాబు, జాతీయ బార్ కౌన్సిల్ సభ్యుడు రావిురెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.గురుప్రసాద్, అన్ని జిల్లాల జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శులు, సీనియర్ సివిల్ జడ్జిలు పాల్గొన్నారు. -
‘రాజ్యాంగం వైఫల్యం’పై వాయిదా ఇచ్చే ప్రసక్తే లేదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రాజ్యాంగం వైఫల్యం చెందిందా? లేదా? అన్న అంశంపై జరుగుతున్న విచారణను ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వేసే ప్రసక్తే లేదని వచ్చే నెల 31న పదవీ విరమణ చేయనున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాకేశ్‌కుమార్ స్పష్టం చేశారు. రోజూవారీ పద్ధతిలో విచారణ జరుపుతామని ప్రకటించారు. ఈ కేసులో వాయిదాలు ఇచ్చే ప్రసక్తే లేదన్నారు. విచారణను రెండు రోజుల పాటు వాయిదా వేయాలన్న పోలీసుల తరఫు స్పెషల్ కౌన్సిల్ సత్యనారాయణప్రసాద్ అభ్యర్థనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. ఏదేమైనా విచారణను వాయిదా వేయడం సాధ్యం కాదంటూ తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేశారు. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. -
అంతా మీ ఇష్టమేనా?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రాజ్యాంగం వైఫల్యం చెందిందన్న ప్రాథమిక అభిప్రాయంతో గత కొద్ది రోజులుగా పలు హెబియస్ కార్పస్ పిటిషన్లపై విచారణ జరుపుతున్న హైకోర్టు.. పోలీసులపై ఆరోపణలు చేస్తూ దాఖలు చేసిన వ్యాజ్యాలను పిటిషనర్లు తాజాగా ఉపసంహరించుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. పిటిషన్లు అలా ఎలా ఉపసంహరించుకుంటారని ప్రశ్నించింది. అంతా మీష్టమేనా? అని పిటిషనర్లను ప్రశ్నిస్తూ అవసరమైతే దీనిపై విచారణకు ఆదేశిస్తామని స్పష్టం చేసింది. ఇలా ఆరోపణలు చేయడం, ఆ తరువాత ఉపసంహరించుకుంటామంటే దాని అర్థం ఏమిటని అడిగింది. న్యాయస్థానం ఓ దశలో పిటిషన్ల ఉపసంహరణ వినతికి ససేమిరా అంది. అయితే తమ వ్యాజ్యాలను ఉపసంహరించుకుంటామని పిటిషనర్లు తేల్చి చెప్పడంతో చివరకు అందుకు అనుమతినిస్తూ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. అయితే ఇలా ఉపసంహరించుకున్న వ్యాజ్యాలన్నిటినీ రికార్డుల్లోనే ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది. తదుపరి విచారణను 17కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులిచ్చింది. -
‘ఈసీ సభ్యుల నియామక విధి విధానాలు ఏంటో చెప్పండి’
సాక్షి, అమరావతి: విశ్వవిద్యాలయాల్లో పాలక మండలి (ఈసీ) సభ్యుల నియామకం విషయంలో ప్రస్తుతం అనుసరిస్తున్న విధి విధానాలు, వాటికి సంబంధించిన చట్ట నిబంధనలు తదితర వివరాలను తమ ముందుంచాలని హైకోర్టు సోమవారం పిటిషనర్‌ను ఆదేశించింది. వీటిపై స్పష్టత వచ్చిన తర్వాతనే మిగిలిన అంశాల జోలికి వెళతామంది. తదుపరి విచారణను ఈ నెల 23కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఈసీ సభ్యుల నియామకాలు రాజకీయ నేతల సిఫారసుల మేరకు జరిగాయని, అందువల్ల ఈసీ సభ్యుల నియామక జీవోలను రద్దు చేయాలని కోరుతూ ముందడుగు ప్రజా పార్టీ నాయకురాలు నక్క నిమ్మి గ్రేస్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సోమవారం జస్టిస్ రాకేశ్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. -
తీర్పు ఎందుకు ఇవ్వకూడదు?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రాజ్యాంగం వైఫల్యం చెందిందంటూ తీర్పునిచ్చేందుకు ఉన్న అవకాశాలను హైకోర్టు పరిశీలిస్తున్నట్లు కనిపిస్తోంది. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ కేసులో ఇచ్చిన తీర్పు, శాసన మండలి రద్దు వివరాలు, న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో పోస్టింగ్‌లపై సీబీఐ దర్యాప్తు తీర్పు, నర్సీపట్నం వైద్యుడు డాక్టర్ సుధాకర్ కేసులో సీఐడీ దర్యాప్తునకు ఆదేశిస్తూ ఇచ్చిన తీర్పు.. ఇలా పలు అంశాల్లో ఇచ్చిన తీర్పులను, ఇతర వివరాలను తమ ముందుంచాలని పిటిషనర్లను హైకోర్టు ఆదేశించింది. వీటితోపాటు రాష్ట్రంలో రాజ్యాంగం వైఫల్యం చెందిందని భావించేందుకు ఆస్కారం ఉన్న వివరాలన్నింటినీ తమ ముందు ఉంచవచ్చని పిటిషనర్లకు వెసులుబాటునిచ్చింది. అంతేకాకుండా రాజ్యాంగం వైఫల్యం చెందిందని ఎందుకు తీర్పునివ్వకూడదో చెప్పాలని పిటిషనర్లకు సూచించింది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్రంలో రాజ్యాంగ వైఫల్యంపై తీర్పునిస్తామని పేర్కొంది. కాగా దీనిపై పోలీసుల తరఫున హాజరవుతున్న సీనియర్ స్పెషల్ కౌన్సిల్ సర్వా సత్యనారాయణ ప్రసాద్ అభ్యంతరం తెలిపారు. హెబియస్ కార్పస్ పిటిషన్లలో రాజ్యాంగం వైఫల్యం చెందిందంటూ తీర్పు ఇవ్వడం సరికాదన్నారు. అలాంటి తీర్పునిచ్చే పరిధి హైకోర్టుకు లేదని, దీనిపై పూర్తి స్థాయిలో వాదనలు వినిపిస్తామని నివేదించారు. ఏ అంశాల ఆధారంగా తీర్పునివ్వబోతున్నారో ముందే తమకు తెలియచేయాలని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) శ్రీరామ్ హైకోర్టును కోరారు. తద్వారా ఆయా అంశాలపై తాము స్పష్టమైన వివరణలతో వాదనలు వినిపిస్తామన్నారు. పిటిషనర్ల వాదనల నిమిత్తం తదుపరి విచారణను ఈ నెల 10వతేదీకి వాయిదా వేస్తూ న్యాయమూర్తులు జస్టిస్ రాకేశ్‌కుమార్, జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. తమ నిరసనను అడ్డుకునేందుకు పోలీసులు 144 సెక్షన్ ప్రయోగిస్తున్నారని, తమకు పోటీగా ఎవరూ కార్యక్రమాలు చేపట్టకుండా ఆదేశాలివ్వాలంటూ టీడీపీ నేత తెనాలి శ్రవణ్‌కుమార్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. అలాగే వేర్వేరు అంశాలకు సంబంధించి పోలీసులపై ఆరోపణలు చేస్తూ పలువురు వ్యక్తులు వేర్వేరుగా పలు హెబియస్ కార్పస్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై ధర్మాసనం తాజాగా మరోసారి విచారణ జరిపింది. ఇలా అయితే పోలీసులు పని చేసేదెలా? పోలీసుల తరఫున సీనియర్ స్పెషల్ కౌన్సిల్ సత్యనారాయణ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ పోలీసులు అరెస్ట్ చేసింది తీవ్రమైన ఆర్థిక నేరానికి పాల్పడిన వారినని, పోలీసులపై పిటిషనర్లు చేసిన ఆరోపణలు ఏ దశలోనూ నిరూపితం కాలేదని తెలిపారు. ఇతర వివాదాస్పద అంశాల జోలికి న్యాయస్థానం వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. న్యాయస్థానం ఇలా ప్రతి విషయంలో జోక్యం చేసుకుంటూ, ప్రతి పనినీ తప్పుపడుతుంటే పోలీసులు స్వేచ్ఛగా విధులు నిర్వర్తించలేరన్నారు. వ్యక్తుల అరెస్ట్‌పై పిటిషన్లు దాఖలు చేస్తే రాష్ట్రంలో రాజ్యాంగం వైఫల్యం లాంటి అంశాల జోలికి వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. ఆ వివరాలు ముందే తెలియచేయండి.. అంతకు ముందు ఇదే అంశంపై అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ జోక్యం చేసుకుంటూ ఏ అంశాల ఆధారంగా రాష్ట్రంలో రాజ్యాంగం వైఫల్యం చెందిందని ఈ న్యాయస్థానం భావిస్తోందో ఆ వివరాలను ముందుగానే తమకు తెలియచేయాలని ధర్మాసనాన్ని కోరారు. తగిన సమయంలో వాదనలకు అవకాశం ఇస్తామని ధర్మాసనం పేర్కొంది. కోర్టు ముందుంచే వివరాలను ఏజీకి అందచేయాలని పిటిషనర్లకు సూచించింది. ఈ సందర్భంగా పాట్నా హైకోర్టు గురించి చర్చకు రావడంతో ధర్మాసనం స్పందిస్తూ వివాదాస్పద విషయాల గురించి తాము మాట్లాడబోమని పేర్కొంది. మహారాష్ట్రలో ఏం జరుగుతోందో (జర్నలిస్ట్ అర్నబ్ గోస్వామి విషయం) అందరం చూస్తూనే ఉన్నామని, మహారాష్ట్రతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ ఎంతో నయమని ధర్మాసనం వ్యాఖ్యానించింది.