
సోనియా సెక్యూరిటీ కమాండో దొరికాడు
న్యూఢిల్లీ: గత ఐదు రోజులుగా కనిపించకుండా పోయిన కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ భద్రతను చూసుకునే ప్రత్యేక కమాండో రాకేశ్ కుమార్‌ను పోలీసులు ఎట్టకేలకు గుర్తించారు. ఎవరికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పలు అనుమానాల మధ్యన కనిపించకుండా పోయిన అతడిని ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. సోనియాగాంధీ భద్రతను చూసుకునే ప్రత్యేక కమాండ్‌లలో రాకేశ్ కుమార్ కూడా ఉన్నాడు. అతడు ఈ నెల(సెప్టెంబర్) 1న సెక్టార్-8లోని తన ఇంటి నుంచి కనిపించకుండా పోయాడు.
జనపథ్‌లో విధులు నిర్వర్తించేందుకు 10గంటలకే ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్లు అతడి కుటుంబ సభ్యులు చెప్పారు. కానీ, వాస్తవానికి అతడు విధులకు వెళ్లలేదు. వారు ఎన్నిసార్లు ఫోన్ చేసి బదులు ఇవ్వలేదు. అయితే, బహుషా మొబైల్ సంకేతాలు అందని చోట విధులు నిర్వర్తిస్తున్నాడేమోనని కుటుంబ సభ్యులు అనుకున్నారు. ఈ నెల 3న కుటుంబ సభ్యులు జన్‌పథ్‌కు వెళ్లి తెలుసుకోగా అతడు రిపోర్టింగ్ చేయలేదని తెలుసుకున్నారు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా చివరకు గుర్తించారు.