
జైపూర్: ప్రొ కబడ్డీ లీగ్‌లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ జోరు కొనసాగుతోంది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ 29–23తో జైపూర్ పింక్ పాంథర్స్‌పై గెలుపొంది 12వ విజయాన్ని నమోదు చేసింది. మరోవైపు జైపూర్‌కు సొంత గడ్డపై ఇదే తొలి ఓటమి. గుజరాత్ తరఫున 15సార్లు రైడింగ్‌కు వెళ్లిన చంద్రజిత్ 7 పాయింట్లు సాధించి టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
ట్యాకిల్‌లో పర్వేశ్ బైన్స్‌వాల్ 4 పాయింట్లు సాధించాడు. జైపూర్ జట్టులో పవన్ కుమార్ 4 పాయింట్లతో రైడింగ్‌లో రాణించగా, ట్యాకిల్‌లో జస్వీర్ సింగ్ (4 పాయింట్లు) ఆకట్టుకున్నాడు. మరో మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్ 25–19తో పుణేరి పల్టన్‌పై గెలుపొందింది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో హరియాణా స్టీలర్స్‌తో తెలుగు టైటాన్స్, జైపూర్ పింక్ పాంథర్స్‌తో యు ముంబా జట్లు తలపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment