తెలంగాణ హస్తకళల అభివృద్ధి సంస్థ ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హస్త కళల అభివృద్ధి సంస్థకు పేరును, లోగోను సూచించి తగిన బహుమతి పొందాలని ఆ సంస్థ ఎం.డి. శైలజారామయ్యర్ సూచించారు. లేపాక్షి దేవాలయం ఏపీలోని అనంతపురం జిల్లాలో ఉండటంతో ఆ పేరు, లోగో వారికే చెందుతాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థకు సంస్కృతీసంప్రదాయాలు, వారసత్వం ఉట్టిపడే పేరును సూచించాలని ప్రజానీకానికి విజ్ఞప్తి చేశా రు. ఈ నెల 15లోగా పేరు, లోగోను సూచిస్తూ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని ప్రధాన కార్యాలయానికి పంపాలని తెలిపారు. అత్యుత్తమైన మూడింటికి రూ. 15వేల చొప్పున నగదు అందించనున్నట్లు చెప్పారు. వివరాలకు 040 - 27616461 సంపద్రించాలని, aphdcltd@ yahoo.comకు మెయిల్ పంపాలని కోరారు.
పేరు పెట్టండి.. బహుమతి పొందండి
Published Wed, Dec 3 2014 2:37 AM | Last Updated on Sat, Sep 2 2017 5:30 PM
Advertisement
Advertisement