Good name
-
పేరు పెట్టండి.. బహుమతి పొందండి
తెలంగాణ హస్తకళల అభివృద్ధి సంస్థ ఆహ్వానం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హస్త కళల అభివృద్ధి సంస్థకు పేరును, లోగోను సూచించి తగిన బహుమతి పొందాలని ఆ సంస్థ ఎం.డి. శైలజారామయ్యర్ సూచించారు. లేపాక్షి దేవాలయం ఏపీలోని అనంతపురం జిల్లాలో ఉండటంతో ఆ పేరు, లోగో వారికే చెందుతాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థకు సంస్కృతీసంప్రదాయాలు, వారసత్వం ఉట్టిపడే పేరును సూచించాలని ప్రజానీకానికి విజ్ఞప్తి చేశా రు. ఈ నెల 15లోగా పేరు, లోగోను సూచిస్తూ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని ప్రధాన కార్యాలయానికి పంపాలని తెలిపారు. అత్యుత్తమైన మూడింటికి రూ. 15వేల చొప్పున నగదు అందించనున్నట్లు చెప్పారు. వివరాలకు 040 - 27616461 సంపద్రించాలని, aphdcltd@ yahoo.comకు మెయిల్ పంపాలని కోరారు. -
పోయిన పేరు మళ్లీ వస్తుందా?!
టీవీక్షణం: మంచి పేరు తెచ్చుకోవాలంటే చాలా కష్టపడాలి. కానీ చెడ్డ పేరు తెచ్చుకోవడానికి ఒక్క తప్పు చేస్తే చాలు. ఒక్కసారి అందరి నోళ్లలో పడితే చాలు. అంతవరకూ ఉన్న పేరు తుడిచి పెట్టుకు పోతుంది. ఈ విషయం ప్రత్యూష బెనర్జీకి అర్థం కాలేదు. అందుకే ‘ఆనంది’గా తెచ్చుకున్న ఖ్యాతిని ‘బిగ్‌బాస్’ షోలో తన ప్రవర్తనతో పాడు చేసుకుంది. అతి చిన్న వయసులోనే చాలా పెద్ద పేరు తెచ్చుకుంది ప్రత్యూష. ‘బాలికావధు’లో ఆమె చేసింది ఓ ఆదర్శనీయమైన పాత్ర కావడంతో అందరూ ఆమెను ఆకాశానికెత్తేశారు. కానీ ‘బిగ్‌బాస్’లో ఆమెను చూసిన తర్వాత ఆ అభిమానం మాయమైంది. గిల్లికజ్జాలాడుకోవడానికే పెట్టారా అన్నట్టుండే బిగ్‌బాస్ షోలో తమ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం. రకరకాల మనస్తత్వాలు ఉన్నవారి మధ్య తమ ఎమోషన్స్‌ను నియంత్రించుకుంటూ నిలబడటం అంత తేలిక కాదు. అదే ప్రత్యూషను దెబ్బ తీసింది. ఒకరి విషయాలు మరొకరి దగ్గర చెప్పడం, వెనుక మాట్లాడటం వంటి లక్షణాలతో చెడ్డపేరు మూటగట్టుకుంది. అది ఆమె కెరీర్ మీద కూడా ప్రభావం చూపించిందని చాలామంది చెప్పారు. దాని తర్వాత ఇప్పుడు, చాలా గ్యాప్ తర్వాత ఆమె ‘హమ్ హై నా’తో రీ ఎంట్రీ ఇస్తోంది. ఇటీవలే సోనీ చానెల్లో ప్రారంభమైన ఈ సీరియల్లో బెంగాలీ అమ్మాయిగా నటిస్తోంది ప్రత్యూష. అంతకుముందు పక్కా రాజస్థానీ అమ్మాయిగా సంప్రదాయబద్ధంగా చూసిన ఆమెని, ఇప్పుడీ సీరియల్లో ఆధునిక యువతిగా చూడటం కొత్త అనుభూతి. మరి ఈ పాత్ర ఆమెకు ఎంత పేరు తెస్తుందో చూడాలి. నటన పరంగా ఆమెకు వంక పెట్టనవసరం లేదు. మరి ఆ నటన ఆమెకున్న చెడ్డపేరును తుడిచేసి మళ్లీ ప్రేక్షకుల మనసుల్లో ఆమెను నిలబెడుతుందా లేదా అన్నది ముందు ముందు తెలుస్తుంది!