వచ్చే ఏడాది జరిగే ఫుట్బాల్ ప్రపంచ కప్ విజేతకు నగదు బహుమతిని భారీగా పెంచారు. చాంపియన్ జట్టు 215 కోట్ల రూపాయల్ని సొంతం చేసుకోనుంది. 2010లో దక్షిణాఫ్రికాలో జరిగిన ప్రపంచ కప్లో కంటే ఈ నగదు బహుమతి 17 శాతం ఎక్కువ. ప్రపంచ ఫుట్బాల్ గవర్నింగ్ బాడీ ఫిఫా ఈ మేరకు ప్రకటించింది.
రన్నరప్గా నిలిచిన జట్టుకు దాదాపు 154 కోట్లు ఇవ్వనున్నారు. ఇక మూడో స్థానంలో నిలిచిన జట్టుకు 135 కోట్లు, టోర్నీలో పాల్గొనే 32 జట్లకు తలా 9 కోట్ల రూపాయల చొప్పున అందజేయనున్నారు. ప్రపంచ కప్నకు బ్రెజిల్ ఆతిథ్యమివ్వనుంది.
ఫుట్బాల్ ప్రపంచ కప్ విజేతకు 215 కోట్లు
Published Fri, Dec 6 2013 3:43 PM | Last Updated on Sat, Sep 2 2017 1:20 AM