న్యూయార్క్: యూఎస్ ఓపెన్ టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ గెలిస్తే 38 లక్షల డాలర్లు (రూ. 26 కోట్లు) ఎగరేసుకుపోవచ్చు. నిర్వాహకులు సింగిల్స్ విజేతలకు ఈ ఏడాది ప్రైజ్‌మనీని భారీగా పెంచారు. గ్రాండ్‌స్లామ్ టోర్నీల చరిత్రలో ఇదే అత్యధిక ప్రైజ్‌మనీ కావడం విశేషం. కేవలం మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధిస్తే చాలు 54 వేల డాలర్లు (రూ. 37 లక్షలు) సొంతమవుతాయి. మొత్తం టోర్నీ ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా 5 కోట్ల 30 లక్షల డాలర్లు (రూ. 363 కోట్లు).
ఇది మొన్న సాకర్ విజేతకు ఇచ్చిన ప్రైజ్‌మనీ కంటే ఎక్కువ! గత మూడేళ్లుగా నగదు బహుమతిని పెంచుతూ వచ్చామని అమెరికా టెన్నిస్ సంఘం చైర్మన్ కట్రినా ఆడమ్స్ తెలిపారు. పురుషులు, మహిళల సింగిల్స్ విజేతలకు సమాన ప్రైజ్‌మనీ ఇచ్చిన తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ కూడా యూఎస్ ఓపెనే. 1973 నుంచే సింగిల్స్ విజేతలకు ప్రైజ్‌మనీ ‘సరిసమానం’ చేసిన చరిత్ర ఈ టోర్నీదే. వచ్చే నెల 27న మొదలయ్యే ఈ గ్రాండ్‌స్లామ్ టోర్నీకి ఈ ఏడాది స్వర్ణోత్సవ వేడుక కానుంది.
యూఎస్ ఓపెన్ విజేతకు రూ. 26 కోట్లు
Published Thu, Jul 19 2018 12:44 AM | Last Updated on Wed, Oct 17 2018 4:36 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment