ఆసియాకప్-2023 విజేతగా టీమిండియా నిలిచిన సంగతి తెలిసిందే. ఆదివారం కొలంబో వేదికగా జరిగిన ఫైనల్లో శ్రీలంకను 10 వికెట్ల తేడాతో చిత్తు చేసిన భారత జట్టు.. 8వ సారి ఆసియాకప్‌ను ముద్దాడింది. తొలుత బ్యాటింగ్ చేసిన లంక.. భారత బౌలర్ల ధాటికి కేవలం 50 పరుగులకే కుప్పకూలింది.
టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ 6 వికెట్లతో లంకను దెబ్బతీయగా, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా 3 వికెట్లతో సత్తాచాటాడు. అనంతరం 51 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా వికెట్ నష్టపోకుండా ఛేదించింది. ఇక ఆసియా ఛాంపియన్స్‌గా నిలిచిన భారత జట్టుకు ఫ్రైజ్‌మనీ ఎంత? మ్యాన్ ఆఫ్‌ది సిరీస్ అవార్డు ఎవరికి లభించిందో వంటి ఆసక్తికర విషయాలపై ఓ లూక్కేద్దం.
విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే ?
ఈ ఏడాది ఆసియాకప్ విజేతగా నిలిచిన టీమిండియాకు ప్రైజ్ మనీ లక్ష యాభై వేల డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ1.24 కోట్లు) లభించింది. అదే విధంగా రన్నరప్‌గా నిలిచిన లంకకు 75,000 డాలర్లు( భారత కరెన్సీలో రూ.62 లక్షలు) నగదు బహుమతి దక్కింది.
ఇక టోర్నీ ఆసాంతం అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్ అవార్డు వరించింది. ఇందుకు గాను కుల్దీప్ 15,000 డాలర్లు( భారత కరెన్సీలో రూ. 12 లక్షలు) ప్రైజ్ మనీ అందుకున్నాడు.
ఈ మెగా ఈవెంట్‌లో కుల్దీప్ 4 మ్యాచ్‌ల్లో 9 వికెట్లు పడగొట్టాడు. ఇక ఫైనల్లో 6 వికెట్లతో అదరగొట్టిన మహ్మద్ సిరాజ్‌కు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌కు అవార్డు దక్కింది. ఈ అవార్డు రూపంలో అతడికి రూ. 4లక్షల ప్రైజ్‌మనీ లభించింది.
అయితే సిరాజ్ తన మంచి మనసును చాటుకున్నాడు. తనకు వచ్చిన ప్రైజ్‌మనీని ప్రేమదాస స్టేడియం గ్రౌండ్స్‌మెన్‌కు కానుకగా ఇచ్చాడు. ఇక ఈ ఏడాది ఆసియాకప్‌లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో టీమిండియా యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్(302) ఉండగా.. వికెట్ల లిస్ట్‌లో శ్రీలంక పేసర్ మతీషా పతిరానా(11) నిలిచాడు.
చదవండి: Asia Cup 2023: కాస్త ఓవర్ అయిందేమో భయ్యా! అందుకే ఆ బంతి వెంట పరిగెత్తాను: సిరాజ్
Comments
Please login to add a commentAdd a comment