
సెప్టెంబర్ 17(ఆదివారం).. శ్రీలంక క్రికెట్‌కు మరచిపోలేని రోజుగా మిగిలిపోతుంది. ఆసియాకప్-2023 భాగంగా టీమిండియాతో జరిగిన ఫైనల్లో 10 వికెట్ల తేడాతో శ్రీలంక ఘోర ఓటమి చవిచూసింది. భారత ఫాస్ట్‌బౌలర్ల ధాటికి కేవలం 50 పరుగులకే శ్రీలంక కుప్పకూలింది. తమ వన్డే క్రికెట్ చరిత్రలో లంకకు ఇది రెండో అత్యల్ప స్కోర్ కావడం గమనార్హం.
టీమిండియా ఫాస్ట్‌బౌలర్ మహ్మద్ సిరాజ్ పేస్ ముందు.. లంక బ్యాటర్లు పట్టుమని పది నిమిషాల కూడా నిలవలేకపోయారు. సిరాజ్ 6 వికెట్లతో లంకను చావు దెబ్బతీశాడు. అసియాకప్ చరిత్రలో భారత్ తర్వాత అత్యుత్తమ రికార్డు కలిగి ఉన్న శ్రీలంక.. ఇటువంటి ప్రదర్శన కనబరిచడం అందరని ఆశ్చర్యపరిచింది.
విరాట్ కోహ్లి ఓవర్ త్రో గిఫ్ట్
కాగా శ్రీలంక 50 పరుగుల మార్క్‌ను అయినా అందుకుందంటే అది టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి పుణ్యమే అని చెప్పుకోవాలి. ఎందుకంటే విరాట్ ఓవర్ త్రో రూపంలో 4 పరుగులు శ్రీలంకకు గిఫ్ట్‌గా ఇచ్చాడు. లంక ఇన్నింగ్స్ 14 ఓవర్ వేసిన సిరాజ్ బౌలింగ్‌లో దుషాన్ హేమంత ఫైన్ లెగ్ దిశగా షాట్ ఆడాడు. ఈ క్రమంలో హేమంత రెండో పరుగు కోసం ప్రయత్నించాడు.
దీంతో ఫీల్డర్ వికెట్ కీపర్ దిశగా త్రో వేశాడు. అయితే త్రోలో పవర్ లేకపోవడంతో బంతి స్లిప్‌లో ఉన్న కోహ్లి చేతికి వెళ్లింది. కోహ్లి వెంటనే నాన్‌స్ట్రైకర్ ఎండ్‌కు విసిరాడు. అయితే బంతి స్టంప్స్‌కు తాకకుండా బౌండరీ లైన్‌కు వెళ్లింది. దీంతో లంకకు ఆదనంగా నాలుగు పరుగులు వచ్చాయి.
బంతి బౌండరీకి వెళ్లడంతో కోహ్లి నిరాశ చెందాడు. తన క్యాప్‌తో ముఖాన్ని అడ్డుపెట్టుకున్నాడు. కానీ భారత్ అప్పటికే లంకపై చేయి సాధించడంతో విరాట్ కాసేపటికే చిరునవ్వు నవ్వాడు. కోహ్లి రియాక్షన్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండి: అతడే మా కొంపముంచాడు.. మమ్మల్ని క్షమించండి ప్లీజ్: శ్రీలంక కెప్టెన్
— Rahul Chauhan (@ImRahulCSK11) September 17, 2023
Super11 Asia Cup 2023 | Final | India vs Sri Lanka | Highlights https://t.co/74ghboYcrR#AsiaCup2023
— AsianCricketCouncil (@ACCMedia1) September 17, 2023