PC: ICC
ICC Men's T20 World Cup 2022- Prize Money Details: పురుషుల టీ20 ప్రపంచకప్-2022 టోర్నీకి సంబంధించి ప్రైజ్‌మనీ వివరాలను అంతర్జాతీయ క్రికెట్ మండలి శుక్రవారం ప్రకటించింది. విజేత, రన్నరప్‌లతో పాటు సెమీ ఫైనలిస్టులు, సూపర్-12 దశలో విజయాలు నమోదు చేసిన జట్లు, సూపర్-12 స్టేజ్‌లో నిష్క్రమించిన జట్లు, తొలి రౌండ్ విజేతలు, మొదటి రౌండ్‌లోనే వెనుదిరిగిన టీమ్‌లకు ఎంత మొత్తం అందనుందో తెలిపింది.
ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. కాగా ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు 16 నుంచి నవంబరు 13 వరకు టీ20 వరల్డ్‌కప్-2022 ఈవెంట్ జరుగనుంది. ఇందులో విజేతగా నిలిచిన జట్టుకు 1,600,000 అమెరికన్ డాలర్లు(భారత కరెన్సీలో 13,05,35,440 కోట్ల రూపాయలు) ప్రైజ్‌మనీగా లభించనుందని పేర్కొంది. ఇక రన్నరప్ 800,000 అమెరికన్ డాలర్లు(భారత కరెన్సీలో 6,52,64,280 కోట్ల రూపాయలు) అందుకోనున్నట్లు ఐసీసీ వెల్లడించింది.
16 జట్లు..
ఆసీస్ వేదికగా జరిగే ప్రపంచకప్ టోర్నీలో మొత్తం 16 జట్లు పాల్గొననున్నాయి. ఇందులో ఆస్ట్రేలియా, భారత్ , పాకిస్తాన్, అఫ్గనిస్తాన్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ, ఇంగ్లండ్ నేరుగా సూపర్-12కు అర్హత సాధించగా.. మరో ఎనిమిది జట్లు క్వాలిఫైయర్స్ ఆడనున్నాయి. గతేడాది దారుణ వైఫల్యం మూటగట్టుకున్న మాజీ చాంపియన్ వెస్టిండీస్ సహా శ్రీలంక, యూఏఈ, నమీబియా, నెదర్లాండ్స్, జింబాబ్వే, ఐర్లాండ్, స్కాట్లాండ్ క్వాలిఫైయర్స్‌లో తలపడనున్నాయి.
టీ20 ప్రపంచకప్-2022 ప్రైజ్‌మనీ వివరాలు(లభించే మొత్తం డాలర్లలో)
►విజేత- 1,600,000 డాలర్లు ( భారత కరెన్సీలో సుమారుగా 13 కోట్ల ఐదు లక్షలు)
►రన్నరప్- 800,000 డాలర్లు (దాదాపు ఆరున్నర కోట్ల రూపాయలు)
►సెమీ ఫైనల్లో ఓడిన 2 జట్లు- 800,000 డాలర్లు(ఒక్కో జట్టుకు 400,000 డాలర్లు- సుమారు 3,26,20,220 రూపాయలు)
►సూపర్-12 దశలో గెలిచిన జట్లు- 1,200,000 డాలర్లు(ఒక్కో మ్యాచ్‌కు 40,000 డాలర్లు)
►సూపర్-12 దశలో నిష్క్రమించిన జట్లు- 560,000 డాలర్లు (8X 70,000 డాలర్లు )
►ఫస్ట్‌రౌండ్లో గెలిచిన జట్లు- 480,000 డాలర్లు (12X 40,000 డాలర్లు)
►ఫస్ట్‌రౌండ్లో ఇంటిబాట పట్టిన జట్లు- 160,000 డాలర్లు(4X 40,000 డాలర్లు)
చదవండి: T20 WC 2022: ఎంసీజీ నా హోం గ్రౌండ్.. భారత బ్యాటర్లు నన్ను తట్టుకోలేరు! అవునా?!
Comments
Please login to add a commentAdd a comment