టీ20 వరల్డ్‌కప్-2022లో భాగంగా నిన్న (అక్టోబర్ 23) పాకిస్తాన్‌తో జరిగిన ఉత్కంఠ సమరంలో టీమిండియా 4 వికెట్ల తేడాతో మరపురాని విజయం సాధించిన విషయం తెలిసిందే. నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగిన ఈ సమరంలో విరాట్ కోహ్లి (53 బంతుల్లో 82 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) వీరోచితంగా పోరాడి టీమిండియాకు చారిత్రక విజయాన్నందించాడు. కోహ్లి పోరాటానికి హార్ధిక్ పాండ్యా ఆల్‌రౌండ్ ప్రదర్శన (40, 3/30) కూడా తోడవ్వడంతో భారత్ అపురూప విజయాన్ని సాధించింది. ఈ విజయంతో టీమిండియా ప్రపంచకప్‌లో ఘనంగా బోణీ కొట్టడంతో పాటు ఓ ప్రపంచ రికార్డును సైతం బద్దలు కొట్టింది.
క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక విజయాలు (అన్ని ఫార్మాట్లలో) సాధించిన జట్టుగా టీమిండియా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. నిన్న పాక్‌పై సాధించిన విజయంతో ప్రస్తుత క్యాలెండర్ ఇయర్‌లో 39వ విజయాన్ని నమోదు చేసిన భారత్.. ఆస్ట్రేలియా పేరిట ఉన్న అత్యధిక విజయాల ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. 2003లో ఆసీస్ అన్ని ఫార్మాట్లలో కలిపి 47 మ్యాచ్‌ల్లో 38 విజయాలు (రికీ పాంటింగ్ సారధ్యంలో 30 వన్డేలు, 8 టెస్ట్‌లు) నమోదు చేయగా.. ఈ ఏడాది భారత్ ఇప్పటికే (ఈ క్యాలెండర్ ఇయర్‌లో భారత్ ఇంకా 10 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది) 39 విజయాలు (56 మ్యాచ్‌ల్లో 24 టీ20లు, 2 టెస్ట్‌లు, 13 వన్డేలు) సాధించి ఆసీస్ రికార్డుకు అధిగమించింది.
చదవండి: కోహ్లి తప్ప ఇంకెవరూ ఆ షాట్లు ఆడలేరు.. ఆ రెండు సిక్స్‌లు ప్రత్యేకం: పాండ్యా
Comments
Please login to add a commentAdd a comment