దాదాపు నెల రోజుల పాటు ఫుట్‌బాల్ అభిమానులను ఉర్రూతలూగించిన యూరో కప్-2024కు ఎండ్ కార్డ్ పడింది. ఆదివారం రాత్రి స్పెయిన్- ఇంగ్లండ్ ఫైనల్ మ్యాచ్‌తో ఈ టోర్నీ ముగిసింది. యూరోకప్ విజేతగా స్పెయిన్ నిలిచింది.
ఫైనల్లో 2-1 తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించిన స్పెయిన్.. నాలుగో సారి టైటిల్‌ను ముద్దాడింది. ఈ క్రమంలో విజేత స్పెయిన్ ప్రైజ్ మనీ ఎంత? రన్నరప్ ఇంగ్లండ్‌కు ఎంత దక్కుతుంది? ప్లేయర్ ఆఫ్‌ది టోర్నీ ఎవరన్న ఆంశాలపై ఓ లుక్కేద్దాం.
విజేత స్పెయిన్‌కు ఎన్ని కోట్లంటే?
యూరో కప్ విజేత స్పెయిన్‌కు ప్రైజ్ మనీ రూపంలో మొత్తం 30.4 మిలియన్ డాలర్లు అందనుంది. అంటే భారత కరెన్సీలో సుమారుగా రూ. 253 కోట్ల ప్రైజ్ మనీ స్పెయిన్‌కు దక్కింది.
అన్ని మ్యాచ్‌ల్లో గెలిచి ఛాంపియన్స్‌గా నిలిచినందుకు బోనస్+ గ్రూప్ స్టేజ్ విజయాలు+ క్వార్టర్-ఫైనల్ + సెమీ-ఫైనల్+ ఫైనల్+ టోర్నీలో పాల్గోనే రుసుము మొత్తం కలిపే రూ. 253 కోట్ల నగదు బహుమతిగా స్పెయిన్‌కు లభించనుంది.
రన్నరప్ ఇంగ్లండ్‌కు ఎంతంటే?
రన్నరప్ ఇంగ్లండ్‌కు ప్రైజ్ మనీ రూపంలో మొత్తం 27.25మిలియన్ డాలర్లు అందనుంది. అంటే భారత కరెన్సీలో సుమారుగా రూ.227 కోట్ల ప్రైజ్ మనీ ఇంగ్లండ్‌కు దక్కింది.
గ్రూప్ స్టేజ్ విజయాలు+ క్వార్టర్-ఫైనల్ + సెమీ-ఫైనల్+ టోర్నీలో పాల్గోనే రుసుము+ రౌండ్ 16 మొత్తం ప్రైజ్‌మనీ కలిపి ఇంగ్లండ్‌కు రూ.227 కోట్ల నగదు బహుమతిగా అందనుంది. ఇక సెమీఫైనల్‌కు చేరిన ఫ్రాన్స్, నెదర్లాండ్స్‌కు చెరో రూ. 101 కోట్ల ప్రైజ్ మనీ దక్కనుంది.
యంగ్ ప్లేయర్ ఆఫ్‌ది టోర్నీ: లామిన్ యమల్ (స్పెయిన్)
ఈ టోర్నీలో లామిన్ యమల్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు.17 ఏళ్ల యమల్ ఒక గోల్‌తో పాటు 4 అసిస్ట్‌లు చేశాడు. ఈ యువ ప్లేయర్ కచ్చితంగా ఫ్యూచర్ స్టార్ అవుతాడనడంలో ఎటువంటి సందేహం లేదు.
ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్: రోడ్రి (స్పెయిన్)
స్పెయిన్ తరఫున మిడ్‌ఫీల్డ్‌లో రోడ్రి అదరగొట్టాడు. స్పెయిన్ విజేతగా నిలవడంలో రోడ్రిది కీలకపాత్ర.
గోల్డెన్ బూట్ విజేతలు వీరే..
యూరో కప్-2024 గోల్డన్ బూట్ విజేతలగా ఆరుగురు నిలిచారు. మొత్తం ఆరు మంది ఆటగాళ్లు సమంగా 3 గోల్స్ చేసి సంయుక్తంగా గోల్డన్ బూట్ అవార్డును తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ జాబితాలో ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ కేన్, స్పెయిన్ అటాకింగ్ మిడ్‌ఫీల్డర్ డాని ఓల్మో, జార్జియా మిడ్ ఫిల్డర్ జార్జెస్ మికౌతాడ్జే, కోడి గక్పో, ఇవాన్ ష్రాంజ్,జమాల్ ముసియాలా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment