క్రికెట్ అభిమానులను నెల రోజుల పాటు ఉర్రూతలూగించిన టీ20 వరల్డ్‌కప్-2024కు శుభం కార్డ్ పడింది. జూన్ 29(శనివారం) భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ ముగిసింది. ఈ టైటిల్ పోరులో 7 వికెట్ల తేడాతో సౌతాఫ్రికాను ఓడించిన టీమిండియా.. రెండో సారి జగజ్జేతగా నిలిచింది.
దీంతో 140 కోట్ల భారతీయుల కల నెరవేరింది. ఇక విజేతగా నిలిచిన టీమిండియా ఎంత ప్రైజ్‌మనీని గెల్చుకుంది, రన్నరప్‌గా నిలిచిన దక్షిణాఫ్రికా ఎంత మొత్తం దక్కించుకుంది అనే వివరాలను తెలుసుకుందాం.
టీ20 వరల్డ్‌కప్ విజేతకు ఎన్ని కోట్లంటే?
టీ20 ప్రపంచకప్ చాంపియన్‌గా నిలిచిన టీమిండియాకు 2.45 మిలియన్ డాలర్లు ( భారత కరెన్సీలో దాదాపు రూ. 20.42 కోట్లు) అందుకుంది. అదే విధంగా రన్నరప్‌గా నిలిచిన సఫారీలకు 1.28 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 10.67 కోట్లు) లభించింది.
సెమీఫైనల్‌కు చేరుకున్న ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్థాన్ జట్లకు చెరో రూ. 6.56 కోట్లు దక్కాయి. అదే విధంగా సూపర్-8కు చేరుకున్న మొత్తం 8 జట్లకు రూ.3.17 కోట్లు ప్రైజ్‌మనీ లభించనుంది. అదేవిధంగా 9 నుంచి 12వ స్థానాల్లో నిలిచిన జట్లకు- రూ. 2.05 కోట్లు, 13 నుంచి 20 స్థానాల్లో ఉన్న జట్లకు- రూ. 1.87 కోట్లు అందనున్నాయి.
ఇక ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచిన జస్ప్రీత్ బుమ్రాకు రూ.12.45 లక్షల నగదు బహుమతి లభించనుంది.
Comments
Please login to add a commentAdd a comment