India vs South Africa T20 World Cup
-
T20 ప్రపంచకప్‌తో రోహిత్ శర్మ.. బీచ్‌లో ఫోటోకు ఫోజులు
-
టీ20 వరల్డ్‌కప్ విజేతగా భారత్.. ప్రైజ్‌మనీ ఎన్ని కోట్లంటే?
క్రికెట్ అభిమానులను నెల రోజుల పాటు ఉర్రూతలూగించిన టీ20 వరల్డ్‌కప్-2024కు శుభం కార్డ్ పడింది. జూన్ 29(శనివారం) భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ ముగిసింది. ఈ టైటిల్ పోరులో 7 వికెట్ల తేడాతో సౌతాఫ్రికాను ఓడించిన టీమిండియా.. రెండో సారి జగజ్జేతగా నిలిచింది. దీంతో 140 కోట్ల భారతీయుల కల నెరవేరింది. ఇక విజేతగా నిలిచిన టీమిండియా ఎంత ప్రైజ్‌మనీని గెల్చుకుంది, రన్నరప్‌గా నిలిచిన దక్షిణాఫ్రికా ఎంత మొత్తం దక్కించుకుంది అనే వివరాలను తెలుసుకుందాం.టీ20 వరల్డ్‌కప్ విజేతకు ఎన్ని కోట్లంటే?టీ20 ప్రపంచకప్ చాంపియన్‌గా నిలిచిన టీమిండియాకు 2.45 మిలియన్ డాలర్లు ( భారత కరెన్సీలో దాదాపు రూ. 20.42 కోట్లు) అందుకుంది. అదే విధంగా రన్నరప్‌గా నిలిచిన సఫారీలకు 1.28 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 10.67 కోట్లు) లభించింది. సెమీఫైనల్‌కు చేరుకున్న ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్థాన్ జట్లకు చెరో రూ. 6.56 కోట్లు దక్కాయి. అదే విధంగా సూపర్-8కు చేరుకున్న మొత్తం 8 జట్లకు రూ.3.17 కోట్లు ప్రైజ్‌మనీ లభించనుంది. అదేవిధంగా 9 నుంచి 12వ స్థానాల్లో నిలిచిన జట్లకు- రూ. 2.05 కోట్లు, 13 నుంచి 20 స్థానాల్లో ఉన్న జట్లకు- రూ. 1.87 కోట్లు అందనున్నాయి. ఇక ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచిన జస్ప్రీత్ బుమ్రాకు రూ.12.45 లక్షల నగదు బహుమతి లభించనుంది. -
టీమిండియా బ్యాటర్ల విధ్వంసం.. దక్షిణాఫ్రికాపై ఘన విజయం
బెనోని: తొలి అండర్–19 టి20 ప్రపంచకప్‌ను భారత మహిళల జట్టు ఘన విజయంతో మొదలు పెట్టింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా అండర్–19 మహిళల టీమ్‌ను చిత్తు చేసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేయగా... భారత్ 16.3 ఓవర్లలో 3 వికెట్లకు 170 పరుగులు చేసింది. షబ్నమ్ వేసిన తొలి ఓవర్లోనే 3 ఫోర్లు, 1 సిక్స్ కొట్టి వాన్ రెన్స్‌బర్గ్ (23) సఫారీ జట్టుకు శుభారంభం అందించగా, సోనమ్ వేసిన తర్వాతి రెండు ఓవర్లలో కలిపి సిమోన్ లోరెన్స్ (44 బంతుల్లో 61; 9 ఫోర్లు, 1 సిక్స్) 4 ఫోర్లు, సిక్స్ బాదింది. అయితే ఆ తర్వాత ప్రత్యర్థిని భారత బౌలర్లు కట్టడి చేయడంలో సఫలం కాగా, మ్యాడిసన్ ల్యాండ్స్‌మన్ (17 బంతుల్లో 32; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించింది. ఛేదనలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శ్వేత సెహ్రావత్ (57 బంతుల్లో 92 నాటౌట్; 20 ఫోర్లు), కెప్టెన్ షఫాలీ వర్మ (16 బంతుల్లో 45; 9 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగిపోయారు. నిని వేసిన ఓవర్లో షఫాలీ వరుసగా 4, 4, 4, 4, 4, 6తో ఆధిపత్యం ప్రదర్శించింది. మరోవైపు శ్వేత తన దూకుడును తగ్గించకుండా దూసుకుపోయింది. గొంగడి త్రిష (15) తొందరగానే వెనుదిరిగినా... శ్వేత చివరి వరకు నిలబడటంతో భారత్‌కు గెలుపు సులువైంది. ఓపెనర్ శ్వేత 7 ఓవర్లలో కనీసం రెండు ఫోర్ల చొప్పున కొట్టడం విశేషం. ఇతర మ్యాచ్‌ల్లో బంగ్లాదేశ్ ఏడు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై, యూఏఈ ఆరు వికెట్ల తేడాతో స్కాట్లాండ్పై, శ్రీలంక ఏడు వికెట్ల తేడాతో అమెరికాపై గెలిచాయి. -
హ్యాట్రిక్ పై కన్నేసిన భారత్
-
మిల్లర్ సూపర్ ఇన్నింగ్స్.. టీమిండియాపై దక్షిణాఫ్రికా విజయం
బౌన్స్...బౌన్స్...బౌన్స్... మాకెవరికీ పడదు, మేం ఆడలేం... కానీ బౌన్స్ మాత్రం మమ్మల్ని వదల్లేదు... మా వెంట పడి మరీ వేటాడింది... పెర్త్‌లో తమ ఆట తర్వాత భారత క్రికెటర్లు మనసులో ఇలాగే అనుకొని ఉంటారు. ఊహించిన విధంగానే ఆప్టస్ స్టేడియంలో బౌన్సీ పిచ్‌పై దక్షిణాఫ్రికా పేసర్లు చెలరేగిపోయారు... అన్నీ తెలిసినా మేం మాత్రం దానికి సిద్ధంగా లేము అన్నట్లుగా భారత బ్యాటర్లు ఆడలేక వికెట్లు సమర్పించుకున్నారు. రోహిత్ శర్మ, కోహ్లి, హార్దిక్, కార్తీక్, అశ్విన్... ఐదుగురూ ఎక్కువ ఎత్తులో వచ్చిన బంతులను పుల్ షాట్ ఆడబోయి విఫలం కాగా, కేఎల్ రాహుల్ అదే తరహా అనూహ్య బౌన్స్‌కు వెనుదిరిగాడు. భారత్ ఇన్నింగ్స్‌లో ఏకంగా 50 షార్ట్ బంతులు వేసిన ప్రత్యర్థి బౌలర్లు ఈ ఆరు వికెట్లతో పండగ చేసుకున్నారు. ఒకదశలో స్కోరు 49/5... 100 కూడా చేయడం కష్టమనిపించించిది. అయితే సూర్యకుమార్ మాత్రం పిచ్‌ను పట్టించుకోను అనే రీతిలో కొన్ని చక్కటి షాట్లతో అర్ధసెంచరీ చేసి ఆదుకోవడంతో భారత్ పరువు కొంత దక్కింది. కానీ ఓటమి మాత్రం తప్పలేదు. మన పేసర్లూ మెరిసినా... 134 పరుగుల లక్ష్యం మరీ చిన్నదైపోయింది. మిల్లర్, మార్క్రమ్ బాధ్యతాయుత బ్యాటింగ్ సఫారీ టీమ్‌ను ఆదుకుంది. ఫలితంగా రెండు వరుస విజయాల తర్వాత రోహిత్ బృందం తొలి పరాజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. పటిష్ట జట్టుపై నెగ్గి దక్షిణాఫ్రికా గ్రూప్–2లో అగ్రస్థానానికి చేరింది. పెర్త్: టి20 ప్రపంచకప్ గ్రూప్–2లో బలమైన ప్రత్యర్థి దక్షిణాఫ్రికా ముందు టీమిండియా తలవంచింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 5 వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (40 బంతుల్లో 68; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు అర్ధసెంచరీ సాధించగా, మిగతా వారంతా విఫలమయ్యారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ లుంగి ఇన్‌గిడి (4/29) భారత టాపార్డర్‌ను కుప్పకూల్చగా, పార్నెల్ (3/15) కూడా రాణించాడు. అనంతరం దక్షిణాఫ్రికా 19.4 ఓవర్లలో 5 వికెట్లకు 137 పరుగులు సాధించి గెలిచింది. డేవిడ్ మిల్లర్ (46 బంతుల్లో 59 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), మార్క్రమ్ (41 బంతుల్లో 52; 6 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీలతో జట్టును గెలిపించారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 60 బంతుల్లో 76 పరుగులు జోడించారు. అర్‡్షదీప్‌కు 2 వికెట్లు దక్కాయి. భారత్ తమ తర్వాతి మ్యాచ్‌లో బుధవారం బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. టపటపా... పెర్త్ పిచ్‌పై బ్యాటింగ్ ఎంచుకున్న తర్వాత తొలి తొమ్మిది బంతుల్లో భారత్ ఒక్క పరుగు కూడా తీయలేకపోవడం ప్రమాద హెచ్చరికను చూపించింది! గతంలో మొదటి పరుగు సాధించేందుకు భారత్ ఎప్పుడూ 10 బంతులు తీసుకోలేదు. ఇద్దరు ఓపెనర్లు రోహిత్ శర్మ (15), కేఎల్ రాహుల్ (9) సిక్సర్లతోనే తమ ఖాతాలు తెరిచినా ఆ జోరు ఎక్కువ సేపు సాగలేదు. ఇన్‌గిడి ఒకే ఓవర్లో వీరిద్దరిని వెనక్కి పంపించగా, కోహ్లి (12) అరుదైన వైఫల్యం భారత్ కష్టాలు పెంచింది. తొలి ప్రపంచకప్ మ్యాచ్ ఆడుతున్న దీపక్ హుడా (0) డకౌట్ కాగా, రబడ అద్భుత క్యాచ్‌కు హార్దిక్ పాండ్యా (2) పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత జట్టును రక్షించే బాధ్యతను సూర్యకుమార్ తీసుకున్నాడు. ఒకే ఒక్కడు... 9 ఓవర్లోలోపే భారత్ ఐదో వికెట్ కోల్పోయిన సమయంలో మరో ఎండ్‌లో ఉన్న సూర్యకుమార్ స్కోరు 7 పరుగులు. ఇలాంటి స్థితి నుంచి అతను అద్భుత బ్యాటింగ్‌తో జట్టును 100 పరుగులు దాటించడంతో పాటు కాస్త గౌరవప్రదమైన స్కోరును అందించగలిగాడు. నోర్జే 143 కిలోమీటర్ల వేగంతో వేసిన బంతిని లెగ్‌సైడ్ ఫ్లిక్‌తో సిక్సర్‌గా మలచిన తీరు సూర్య బ్యాటింగ్ ప్రత్యేకతను చూపించింది. మహరాజ్ బౌలింగ్‌లోనూ మరో సిక్సర్‌తో అతను తన ధాటిని కొనసాగించాడు. అప్పటి వరకు భారత్‌ను బెంబేలెత్తించిన ఇన్‌గిడి ఓవర్లోనే సిక్స్, ఫోర్ బాది 30 బంతుల్లోనే సూర్య హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకోవడం విశేషం. దినేశ్ కార్తీక్ (6)తో ఆరో వికెట్‌కు 52 పరుగులు జోడించగా అందులో 44 సూర్యవే ఉన్నాయి. ఆ తర్వాతా మరో మూడు ఫోర్లు బాదిన తర్వాత పార్నెల్ బౌలింగ్‌లో పుల్ షాట్‌కు ప్రయత్నించి అతను వెనుదిరిగాడు. కీలక భాగస్వామ్యం... ఛేదనలో దక్షిణాఫ్రికా కూడా తడబడింది. 24 పరుగులకే జట్టు 3 వికెట్లు కోల్పోయింది. పవర్‌ప్లే ముగిసేలోపే డి కాక్ (1), రోసో (0), బవుమా (10) వెనుదిరిగారు. అర్‡్షదీప్ తన తొలి ఓవర్లోనే 2 వికెట్లు తీయగా, సఫారీ కెప్టెన్‌ను షమీ అవుట్ చేశాడు. ఇలాంటి దశలో మార్క్రమ్, మిల్లర్ కలిసి పరిస్థితిని చక్కదిద్దారు. ఈ క్రమంలో జట్టుకు కొంత అదృష్టం కూడా కలిసొచ్చింది. 35 పరుగుల వద్ద మార్క్రమ్ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను కోహ్లి వదిలేయగా... 15 పరుగుల వద్ద ఉన్న మిల్లర్‌ను దగ్గరి నుంచి అండర్‌ఆర్మ్ త్రోతో రనౌట్ చేసే అతి సునాయాస అవకాశాన్ని రోహిత్ చేజార్చాడు. 7 ఓవర్లలో 66 పరుగులు చేయాల్సి ఉండగా అశ్విన్ ఓవర్లో ఇద్దరు బ్యాటర్లు చెరో సిక్స్ బాది జట్టుపై ఒత్తిడి తగ్గించారు. తక్కువ వ్యవధిలో మార్క్రమ్, స్టబ్స్ (6) వెనుదిరిగినా, పట్టుదలగా చివరి వరకు నిలిచి మిల్లర్ పని పూర్తి చేశాడు. అశ్విన్ వేసిన 18వ ఓవర్లో రెండు సిక్స్‌లు కొట్టిన అతను, భువీ వేసిన చివరి ఓవర్లో రెండు ఫోర్లతో మ్యాచ్ ముగించాడు. 10 ఓవర్లు ముగిసేసరికి 40 పరుగులే చేసిన దక్షిణాఫ్రికా ఆ తర్వాత 9.4 ఓవర్లలో 97 పరుగులు చేయడం విశేషం. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రాహుల్ (సి) మార్క్రమ్ (బి) ఇన్‌గిడి 9; రోహిత్ (సి అండ్ బి) ఇన్‌గిడి 15; కోహ్లి (సి) రబడ (బి) ఇన్‌గిడి 12; సూర్యకుమార్ (సి) మహరాజ్ (బి) పార్నెల్ 68; హుడా (సి) డికాక్ (బి) నోర్జే 0; హార్దిక్ (సి) రబడ (బి) ఇన్‌గిడి 2; కార్తీక్ (సి) రోసో (బి) పార్నెల్ 6; అశ్విన్ (సి) రబడ (బి) పార్నెల్ 7; భువనేశ్వర్ (నాటౌట్) 4; షమీ (రనౌట్) 0; అర్‡్షదీప్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 133. వికెట్ల పతనం: 1–23, 2–26, 3–41, 4–42, 5–49, 6–101, 7–124, 8–127, 9–130. బౌలింగ్: పార్నెల్ 4–1–15–3, రబడ 4–0–26–0, ఇన్‌గిడి 4–0–29–4, నోర్జే 4–0–23–1, మహరాజ్ 3–0–28–0, మార్క్రమ్ 1–0–5–0. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: డికాక్ (సి) రాహుల్ (బి) అర్‡్షదీప్ 1; బవుమా (సి) కార్తీక్ (బి) షమీ 10; రోసో (ఎల్బీ) (బి) అర్‡్షదీప్ 0; మార్క్రమ్ (సి) సూర్య (బి) హార్దిక్ 52; మిల్లర్ (నాటౌట్) 59; స్టబ్స్ (ఎల్బీ) (బి) అశ్విన్ 6; పార్నెల్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (19.4 ఓవర్లలో 5 వికెట్లకు) 137. వికెట్ల పతనం: 1–3, 2–3, 3–24, 4–100, 5–122. బౌలింగ్: భువనేశ్వర్ 3.4–0–21–0, అర్‡్షదీప్ 4–0–25–2, షమీ 4–0–13–1, హార్దిక్ 4–0–29–1, అశ్విన్ 4–0–43–1. -
T20 World Cup 2022: ‘పెర్త్’లో పైచేయి ఎవరిదో?
ప్రపంచకప్‌లో పాకిస్తాన్ ఆట కట్టించేశాం... ఆపై చిన్న జట్టయిన నెదర్లాండ్స్‌ను ఓడించేశాం... లీగ్ దశలో చివరి రెండు మ్యాచ్‌లు బంగ్లాదేశ్, జింబాబ్వేలతోనే కాబట్టి బెంగ పడాల్సిందేమీ లేదు... అటు రెండు మ్యాచ్‌లు, ఇటు రెండు మ్యాచ్‌ల మధ్య మరో కీలక సమరానికి భారత్ సన్నద్ధమైంది. పటిష్ట జట్టయిన దక్షిణాఫ్రికా మనకు సవాల్ విసురుతోంది. టి20 ప్రపంచకప్‌లో రికార్డు, ఇరు జట్ల మధ్య ఇటీవలి సిరీస్, తాజా ఫామ్... ఎలా చూసినా భారత్‌దే పైచేయిగా కనిపిస్తున్నా, అనుకూల పిచ్‌పై సఫారీ పేస్ బౌలింగ్ బలగం చెలరేగితే గెలుపు అంత సులువు కాబోదు. గత మ్యాచ్‌లో భారీ విజయం సాధించిన దక్షిణాఫ్రికా కూడా పాకిస్తాన్‌తో ‘నాకౌట్’ సమస్య రాకుండా ఇక్కడ గెలిచి తమ సెమీఫైనల్ అవకాశాలు మెరుగుపర్చుకోవాలని పట్టుదలగా ఉంది. పెర్త్: టి20 ప్రపంచకప్‌లో గత ఆదివారం భారత అభిమానులకు ఎప్పటికీ మరచిపోలేని జ్ఞాపకాన్ని అందిస్తే... ఇప్పుడు మరో ఆదివారం సాయంత్రం అందరికీ అదే స్థాయి వినోదం అందించేందుకు వచ్చేసింది. గ్రూప్–2లో భాగంగా నేడు జరిగే మూడో ‘సూపర్ 12’ మ్యాచ్‌లో భారత్, దక్షిణాఫ్రికా తలపడనున్నాయి. భారత్ గెలిస్తే సెమీఫైనల్ బెర్త్‌ను దాదాపుగా ఖరారు చేసుకోవడంతోపాటు గ్రూప్‌లో టాపర్‌గా నిలిచే అవకాశం కూడా ఉంది. అదే జట్టుతో... భారత జట్టు ప్రదర్శన చూస్తే తుది జట్టులో మార్పులకు ఎలాంటి అవకాశం కనిపించడం లేదు. కేఎల్ రాహుల్ మినహా ప్రతీ ఆటగాడు తమదైన రీతిలో గత రెండు విజయాల్లో తగిన పాత్ర పోషించారు. దాంతో రాహుల్ స్థానంలో ఓపెనర్‌గా పంత్ ఆడవచ్చని వినిపించింది. అయితే బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ అలాంటిదేమీ లేదని స్పష్టం చేసేశాడు. పంత్ ఎడంచేతి వాటం అదనపు ప్రయోజనమే అయినా, రాహుల్‌కు మేనేజ్మెంట్ మరో అవకాశం ఇస్తోంది. ఈ మ్యాచ్‌లో అసలు సవాల్ భారత టాపార్డర్‌కు ఎదురు కానుంది. 140–150 కిలోమీటర్ల వేగంతో పాటు బంతిని స్వింగ్ చేస్తున్న రబడ, నోర్జేలను సమర్థంగా ఎదుర్కోవడంపైనే గెలుపు అవకాశాలు ఆధారపడి ఉన్నాయంటే తప్పు లేదు. బౌన్సీ పిచ్‌పై ఆరంభంలోనే కోహ్లి, రోహిత్, సూర్యకుమార్ ఎదురు దాడి చేస్తారా లేక సగం ఇన్నింగ్స్ వరకు జాగ్రత్తగా నిలబడి ఆపై దూకుడు ప్రదర్శిస్తారా అనేది ఆసక్తికరం. మన బౌలర్లలో షమీ మంచి వేగంతో పాటు బౌన్స్ రాబట్టగలడు. భువనేశ్వర్, అర్‡్షదీప్ల వేగం ఎంత వరకు ఇక్కడ పనికొస్తుందో చూడాలి. ప్రత్యర్థి జట్టులోని ముగ్గురు ప్రధాన బ్యాటర్లు ఎడంచేతి వాటం కావడంతో అక్షర్ పటేల్‌కు బదులు చహల్‌ను ఆడించే అవకాశం ఉన్నా... అక్షర్ ఎడంచేతి వాటం బ్యాటింగ్ జట్టుకు కీలకమే. బవుమా మినహా... దక్షిణాఫ్రికా ప్రధాన బ్యాటర్లంతా దూకుడుగా ఆడగల సమర్థులే. అంతర్జాతీయ టి20ల్లో వరుసగా రెండు సెంచరీలు చేసిన రెండో ఆటగాడైన రిలీ రోసో సమరోత్సాహంతో ఉన్నాడు. భారత్‌తో ఇండోర్‌లో జరిగిన చివరి టి20లోనే అతను శతకం బాదాడు. డికాక్, మిల్లర్ రూపంలో ఇద్దరు మెరుపు బ్యాటర్లు ఉండగా, మార్క్రమ్ మిడిలార్డర్లో జట్టుకు వెన్నెముక. యువ ఆటగాడు స్టబ్స్ సత్తా చాటాలని పట్టుదలగా ఉన్నాడు. అయితే వరుసగా విఫలమవుతున్నా, కెప్టెన్ బవుమా విషయంలో టీమ్ మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతోంది. పిచ్‌ను బట్టి చూస్తే స్పిన్నర్ షమ్సీని తప్పించి రబడ, నోర్జేకు తోడుగా మూడో పేసర్‌గా ఇన్‌గిడి లేదా జాన్సెన్లలో ఒకరు జట్టులోకి రావడం ఖాయం. పిచ్, వాతావరణం పేస్, బౌన్స్, ఆరంభంలో స్వింగ్... ఇలా పేసర్లకు అన్ని రకాలుగా అనుకూలమైన పిచ్. ఇరు జట్ల బౌలర్లు దీనిని ఎలా వాడుకుంటారనేది కీలకం. శనివారం పెర్త్‌లో వర్షం కురిసినా, మ్యాచ్ రోజు ఇబ్బంది ఉండకపోవచ్చు. టి20 ప్రపంచకప్‌లో నేడు బంగ్లాదేశ్ vs జింబాబ్వే (ఉ.గం. 8:30 నుంచి) పాకిస్తాన్ vs నెదర్లాండ్స్ (మ.గం. 12:30 నుంచి) భారత్ vs దక్షిణాఫ్రికా (సా.గం. 4:30 నుంచి) స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం -
దక్షిణాఫ్రికాతో కీలక పోరు.. పెర్త్‌కు చేరుకున్న టీమిండియా
టీ20 ప్రపంచకప్‌లో వరుస విజయాలతో దూసుకు పోతున్న టీమిండియా మరో కీలక పోరుకు సిద్దమైంది. ఆదివారం పెర్త్ వేదికగా దక్షిణాఫ్రికాతో రోహిత్ సేన తలపడనుంది. ఇక దక్షిణాఫ్రికాతో పోరు కోసం టీమిండియా శుక్రవారం సాయంత్రం పెర్త్‌కు చేరుకుంది. భారత్ జట్టుతో పాటు టెంబా బావుమా సారథ్యంలోని ప్రోటీస్ జట్టు కూడా పెర్త్‌లో అడుగుపెట్టింది. ఇక పెర్త్‌కు చేరుకున్న టీమిండియా శనివారం తమ తొలి ప్రాక్టీస్ సెషన్లో పాల్గొనుంది. అదే విధంగా విరాట్, సూర్య కుమార్ యాదవ్, రోహిత్ వంటి ఆటగాళ్లు ఈ ప్రాక్టీస్ సెషన్‌కు మిస్స్ అయ్యే అవకాశం ఉంది. కానీ హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, కేఎల్ రాహుల్ వంటి వారు పూర్తి ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంటారు. ఎందుకంటే నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డికే, హార్దిక్‌కు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. అయితే ఈ మ్యాచ్‌లో రాహుల్ మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. ఈ క్రమంలో రాహుల్ కూడా ఎక్కువ సమయం నెట్స్‌లో గడిపే అవకాశం ఉంది. Scenes from the Airport 🛫 as @ProteasMenCSA 🇿🇦 are about to take off for Perth 🇦🇺 for their next clash against @BCCI 🇮🇳. 🇿🇦⚔️🇮🇳@justmyroots @lalbabarice @OfficialFanatic @BoriaMajumdar@debasissen@sharmisthagoop2 #T20WorldCup #INDvsSA #India #SouthAfrica pic.twitter.com/7RgoYQ1z1x — RevSportz (@RevSportz) October 28, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి: T20 WC 2022: ‘వాళ్లిద్దరు అద్భుతం.. ఈసారి వరల్డ్‌కప్ ట్రోఫీ సౌతాఫ్రికాదే!’.. భారత్ నుంచి ఒక్కరికీ చోటు లేదు! -
ఫైనల్ కు చేరిన టీమిండియా