దక్షిణాఫ్రికాతో కీలక పోరు.. పెర్త్‌కు చేరుకున్న టీమిండియా | India, South Africa teams reach PERTH for MEGA CLASH on Sunday | Sakshi
Sakshi News home page

T20 WC 2022: దక్షిణాఫ్రికాతో కీలక పోరు.. పెర్త్‌కు చేరుకున్న టీమిండియా

Published Sat, Oct 29 2022 1:56 PM | Last Updated on Sat, Oct 29 2022 3:16 PM

India, South Africa teams reach PERTH for MEGA CLASH on Sunday - Sakshi

టీ20 ప్రపంచకప్‌లో  వరుస విజయాలతో దూసుకు పోతున్న టీమిం‍డియా మరో కీలక పోరుకు సిద్దమైంది. ఆదివారం పెర్త్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో రోహిత్‌ సేన తలపడనుంది. ఇక దక్షిణాఫ్రికాతో పోరు కోసం టీమిండియా శుక్రవారం సాయంత్రం పెర్త్‌కు చేరుకుంది. భారత్‌ జట్టుతో పాటు టెంబా బావుమా సారథ్యంలోని ప్రోటీస్‌ జట్టు కూడా పెర్త్‌లో అడుగుపెట్టింది.

ఇక పెర్త్‌కు చేరుకున్న టీమిండియా శనివారం తమ తొలి ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గొనుంది. అదే విధంగా విరాట్‌, సూర్య కుమార్‌ యాదవ్‌, రోహిత్‌ వంటి ఆటగాళ్లు ఈ ప్రాక్టీస్‌ సెషన్‌కు మిస్స్‌ అయ్యే అవకాశం ఉంది. కానీ హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, కేఎల్ రాహుల్ వంటి వారు పూర్తి ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొంటారు.

ఎందుకంటే నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డికే, హార్దిక్‌కు బ్యాటింగ్‌ చేసే అవకాశం రాలేదు.  అయితే ఈ మ్యాచ్‌లో రాహుల్‌ మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. ఈ క్రమంలో రాహుల్‌ కూడా ఎక్కువ సమయం నెట్స్‌లో గడిపే అవకాశం ఉంది.


చదవండి: T20 WC 2022: ‘వాళ్లిద్దరు అద్భుతం.. ఈసారి వరల్డ్‌కప్‌ ట్రోఫీ సౌతాఫ్రికాదే!’.. భారత్‌ నుంచి ఒక్కరికీ చోటు లేదు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement