టీ20 ప్రపంచకప్-2022 కీలక దశలో భారత వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ గాయానికి గురయ్యాడు. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో 15 ఓవర్లు ముగిసిన తర్వాత కార్తీక్ వెన్ను నొప్పితో బాధపడుతూ మైదానం వీడాడు. అతని స్థానంలో రిషభ్ పంత్ కీపింగ్ కొనసాగించాడు. గాయం తీవ్రతపై స్పష్టత లేకపోయినా బుధవారం బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు అతను అందుబాటులో ఉండే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి.
కార్తీక్ వెన్ను నొప్పితో బాధపడుతున్న విషయాన్ని మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో భువనేశ్వర్ కుమార్ నిర్ధారించాడు. వైద్యుల నివేదిక తర్వాత పూర్తి సమాచారం తెలుస్తుందని అతను చెప్పాడు. ప్రపంచకప్‌లో 1, 6 పరుగులు చేసి కార్తీక్‌తో నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో బ్యాటింగ్ అవకాశం రాలేదు. ఒకవేళ కార్తీక్ దూరమైనా... పంత్ రూపంలో ప్రత్యామ్నాయం అందుబాటులో ఉండటంతో ఇప్పటికిప్పుడు భారత జట్టుకు ఎలాంటి బెంగా లేకపోవచ్చు. కాగా ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది.
చదవండి: T20 World Cup 2022: మిల్లర్ సూపర్ ఇన్నింగ్స్.. టీమిండియాపై దక్షిణాఫ్రికా విజయం
Comments
Please login to add a commentAdd a comment